నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలానికి చెందిన ఒక రైతుకు డెంగ్యూ సోకింది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. దాంతో అతడు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూరు మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన నర్సారెడ్డి గత ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు.
ఆ క్రమంలో స్థానిక ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నా జ్వరం తగ్గలేదు. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని యశోదా ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్య పరీక్షల నిర్వహించగా డెంగ్యూ సోకిందని నిర్ధారణ అయింది. సదరు రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.