'బాబు వచ్చాడు... ఉన్న జాబులు పోయాయి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది. బుధవారం నిరుద్యోగులు చేస్తున్న సంకల్ప దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతూనే ఉంటుందని చెవిరెడ్డి అన్నారు.
బాబు వచ్చాడు... ఉన్న జాబులు పోయాయని ఎమ్మెల్యే రాంరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు గోవిందరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మార్చి 29న విజయవాడలో నిరుద్యోగ గర్జన చేపడతామని గోవిందరావు తెలిపారు.