వచ్చే ఏడాది 44 ప్రభుత్వ సెలవులు
హైదరాబాద్: 2016 సంవత్సరానికిగానూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. మొత్తం 44 రోజుల సెలవు దినాలలో 23 సాధారణ సెలవులు కాగా, 21 ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) ఉన్నాయి. వచ్చే ఏడాదికి గాను వివిధ పండుగలు, వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శనివారం వెల్లడించింది.
సెలవుల వివరాలు: జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 26న గణతంత్ర దినోత్సవం,
మార్చి 7న మహాశివరాత్రి, 23న హోలీ, 25న గుడ్‌ఫ్రైడే,
ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రాం జయంతి, 8న ఉగాది, 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి,
జులై 6న రంజాన్, 7న రంజాన్ తర్వాతి రోజు సెలవుదినం
ఆగస్ట్ 1న బోనాలు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 25న శ్రీకృష్ణాష్టమి,
సెప్టెంబర్ 5న వినాయక చవితి, 12న బక్రీద్, 30న బతుకమ్మ,
అక్టోబర్ 11న విజయదశమి, 12న మొహర్రం,
నవంబర్ 14న గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ,
డిసెంబర్ 12న ఈద్ మిలాద్ నబి, 26న బాక్సింగ్ డే లను సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
సాధారణ సెలవుల జాబితాలో ఉన్న గాంధీ జయంతి (అక్టోబర్ 2), దుర్గాష్టమి (అక్టోబర్ 9), దీపావళి (అక్టోబర్ 30), క్రిస్మస్ (డిసెంబర్ 25) పండుగలు ఆదివారం వచ్చాయి.
ఇక ఐచ్ఛిక సెలవుల విషయానికొస్తే జనవరి 1న కొత్త సంవత్సరం రోజు, 16న కనుమ, 22న యాజ్ దాహుమ్ షరీఫ్,
ఫిబ్రవరి 2న శ్రీపంచమి, 23న హజ్రత్ సయ్యద్ మహ్మద్ జయంతి,
ఏప్రిల్ 19న మహవీర్ జయంతి, 21న హజ్రత్ అలి జయంతి
మే 5న షబ్-ఇ-మిరాత్, 9న బసవజయంతి, 21న బుద్ధపూర్ణిమ, 23న షెబ్-ఇ-బరాత్,
జులై 1న జుమత్-ఉల్-విదా, 6న రథయాత్ర,
ఆగస్టు 12న వరలక్ష్మీవ్రతం, 17న పార్సీ కొత్త సంవత్సరం, 18న రాఖీపౌర్ణమి/శ్రావణ పూర్ణిమ,
సెప్టెంబర్ 20న ఈద్-ఇ-గదీర్,
అక్టోబర్ 10న మహా నవమి, 29న నరక చతుర్ధి,
నవంబర్ 21న అర్బఈన్,
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్