Gowru Venkat Reddy
-
ఇంకెన్నాళ్లు నాన్చుతారు?
సాక్షి, కర్నూలు: గడచిన మూడేళ్ళుగా తమకు ఏవిధమైన న్యాయం జరగలేదని కేశవరెడ్డి బాధితులు వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, మలికి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సీఐడీ ఏఎస్పీని కలిశారు. తమకు డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేశవరెడ్డి ఆస్తులు సీఐడీ స్వాధీనంలో ఉన్నాయని న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆదాయం సుమారు రూ. 100కోట్లు పైనే అని, ఆ మొత్తం ఎటు వెళ్లిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం తమకు చెల్లించినా కొంత ఊరట కలిగేదన్నారు. వందల కోట్ల రూపాయల మోసం చేసిన కేశవరెడ్డి కుమారునికి స్కూల్ నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ కేశవరెడ్డి, ఆయన వియ్యంకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగాగే బాధితులకు డబ్బు కట్టకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, జగోపాల్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. బాధితులను బెదిరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. -
బుద్ధి చెప్పడానికే బహిష్కరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అనైతిక రాజకీయాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు స్పందించకపోవడంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో బాధాకరమైనప్పటికీ అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే అసెంబ్లీలో చూస్తూ ఉండలేకనే బహిష్కరణకు పిలుపునిచ్చామని తెలిపారు. గతంలో తమ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లి ఫిరాయింపుదారులకు విప్‌ను జారీ చేస్తే అది అమలు కాకుండా స్పీకరే అడ్డుకున్నారని, శాసనసభ వ్యవహారాల మంత్రి అప్పటికప్పుడు క్లాజులను రద్దు చేశారని తెలిపారు. కాల్‌మనీపై ప్రభుత్వాన్ని నిలదీసిన తమ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు వేటు వేసి కక్ష సాధింపునకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను మంజూరు చేయకుండా.. టీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులివ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే అసెంబ్లీకి రావడానికి తమ పార్టీ సభ్యులకు ఏ మాత్రమూ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. పాదయాత్రపై దుష్ప్రచారం... : వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఓదార్పుయాత్ర చేస్తానని అనగానే సోనియాగాంధీ, కాంగ్రెస్ నేతలు భయంతో ఏవిధంగా వణికిపోయారో.. ఇప్పుడు పాదయాత్ర చేస్తానని చెప్పగానే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా అదే తరహాలో భయపడుతున్నారని గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. పునాదులు కదులుతాయనే భయంతోనే ప్రజాసంకల్ప యాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
భజన మాని భరోసా ఇవ్వండి ..
సాక్షి, కర్నూలు : ‘ఇటీవలి వర్షాలు, వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలో 31 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పంట నష్టపరిహారం మంజూరు చేయించి బాధిత రైతులకు అండగా నిలవండి. హెక్టారుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కనీసం రూ. 50వేల పరిహారం చెల్లించే విధంగా చూడండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు గౌరు వెంకటరెడ్డి అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం గౌరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కొందరు టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు చొరవతోనే వర్షాలు పడుతున్నాయని, ఫలితంగా రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయనిప్రచారం చేసుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రికి భజన చేయడం మాని రైతన్నలకు అండగా నిలిచి సాగుపై వారికి భరోసా ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఏ గ్రామంలో చూసినా చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇళ్లు, గుడిసెలు కూలిపోయాయని, అలాంటి వారికి వెంటనే గృహవసతి కల్పించాలన్నారు. కొందరి గొర్రెలు, మేకలు, అవులు, ఇతర పశువులు వరదల కారణంగా చనిపోయాయని, పరిహారం చెల్లించాలన్నారు. నాసిరకం పనులతోనే గండ్లు... ఎస్ఆర్బీసీ, హంద్రీనీవాతోపాటు కొన్ని వంకలు, వాగులు వరద ఉద్ధృతికి తెగిపోవడం వల్లే పంటలు నష్టపోవడం, ఇళ్లలోకి నీరు చేరడం, గృహాలు కూలిపోవడం తదితర సమస్యలకు కారణమైందని గౌరు వెంకటరెడ్డి తెలిపారు. నాసిరకంగా పనులు చేయడంవల్లే గండ్లు పడ్డాయన్నారు. కమీషన్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు లాలూచీ పడడంతో ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి, విజయకుమారి, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, రమణ, ఫిరోజ్‌ఖాన్ కరుణాకరరెడ్డి, కురువ నాగరాజు, జగదీశ్వరరెడ్డి, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'నీతులు కాదు.. సమాధానం చెప్పండి'
సాక్షి, కర్నూలు: నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా నంద్యాలలో అధికార పార్టీ నాయకులు రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమిని తప్పించుకునేందుకు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వేట కొడవళ్లతో దాడులకు దిగడం పిరికిపంద చర్య అని నందికొట్కూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. రౌడీయిజం గురించి సీఎం చంద్రబాబు నీతులు చెబుతారని, నంద్యాల కాల్పుల ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.