మా గోడు అరణ్య రోదనే
‘గడపగడపకూ వైఎస్సార్’లో నేతల వద్ద ప్రజల ఆక్రందన
స్థానిక సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు
భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న నేతలు
‘అగ్ని ప్రమాదం జరిగి మా ఇళ్లు కాలిపోయాయి. ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలలైనా అతీగతీ లేదు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని పట్టాలు ఇచ్చారు. అందులో తహసీల్దార్ సంతకం మాత్రమే ఉంది. అధికారిక ముద్ర, సర్వే నంబర్ ఏమీ లేవు. మాకు బోగస్ పట్టాలు ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు’
– మునక పార్వతి, గెద్దాడ పాప, గెద్దాడ వెంకటరత్నం, పండ్రవాడ గ్రామం, పెద్దాపురం నియోజకవర్గం
‘గతంలో ఎస్సీల్లో ఉన్న మమ్మల్ని ఓసీలుగా మార్చారు. దీనివల్ల పిల్లలకు విద్యా సంస్థల్లో సీట్లు, స్కాలర్షిప్లు రావడం లేదు. తెలంగాణలో మమ్మల్ని ఎస్సీలుగానే పరిగణిస్తున్నారు. ఇక్కడ కూడా తిరిగి ఎస్సీలుగా గుర్తించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు’
– కప్పిలి వెంకన్న, బేడబుడగ జంగాల నేత, కొంతమూరు గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం
ఇవి కేవలం ఒకటి, రెండు ప్రాంతాలకు పరిమితం కాదు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న నేతల వద్ద అన్నిచోట్లా ప్రజలు తమ వెతలను ఇలా చెప్పుకొస్తున్నారు. ఆదివారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
– సాక్షి, రాజమహేంద్రవరం
‘అర్హత ఉన్నా్న పింఛను రావడంలేదు. పెండింగ్లో ఉన్న ఇళ్ల బిల్లులు ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు రోడ్లపై పారుతోంది.’ పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఉన్న సమస్యలను ప్రజలు తమ వద్దకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టికి తీసుకువస్తున్నారు. ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు తీరు, రెండేళ్ల పాలనలో చంద్రబాబు దగా, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుంచేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ‘గడపగడపకూ వైఎస్సార్’ కార్యక్రమం ఆదివారం జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జరిగింది. గుంతలమయమైన రోడ్లతో అల్లాడుతున్నామని, అధ్వానంగా ఉన్న పారిశుధ్యం కారణంగా తాము రోగాల బారిన పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని స్థానిక నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా, చివరికి తమ గోడు అరణ్యరోదనైందని ప్రజలు వైఎస్పార్ సీపీ నేతల వద్ద వాపోతున్నారు. తమ సమస్యలు ఆలకించేందుకు వస్తున్న నేతలను ప్రజలు వాడవాడలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రజలు సమస్యలు సావధానంగా వింటున్న నేతలు వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
పి.గన్నవరం మండలం గాజులపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం మున్సిపాలిటీ ఆరో వార్డులోని శీలం వారి సావరం, రైలుగట్టు ప్రాంతాల్లో కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డా.యనమదల మురళీకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి శంకర్రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామం జంగాల కాలనీలో కోఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు(బాబు) కార్యక్రమం నిర్వహించారు. వర్షం వస్తే కాలనీ ప్రధాన రోడ్డు బురదమయంగా మారుతోందని స్థానికులు గిరిజాల వద్ద వాపోయారు.
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట, కాకినాడ నగరపాలక సంస్థ ఒకటో డివిజన్లో కార్యక్రమం జరిగింది. స్థానిక నేత వాసిరెడ్డి సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకూ వెళ్లి ప్రజా బ్యాలెట్ ప్రజలకందించి, చంద్రబాబు హామీలపై మార్కులు వేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి తదితరులు పాల్గొన్నారు.
సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో కార్యక్రమాన్ని కోఆర్టినేటర్ తోట సుబ్బారావు నాయుడు నిర్వహించారు. తమ ఇళ్లు కాలిపోయాయని, కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలైనా ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి వీరభద్రరావు, కార్యకర్తలు ఉన్నారు.
మండపేట పట్టణం ఐదో వార్డులో నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరో కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని పదో వార్డులో కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ ప్రతిప„ý Sనేత శాఖా ప్రసన్నకుమార్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.