grahana morri
-
గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్లే బిడ్డకు అలా జరుగుతుందా?
Health Tips: గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్ల వారికి పుట్టబోయే బిడ్దలకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. వాస్తవం ఏమిటంటే.. గ్రహణ మొర్రి అనేది గ్రహణ సమయంలో గర్భిణులు సరిగా ఉండకపోవడం వల్ల వస్తుందనే దానిలో ఎటువంటి శాస్త్రీయతా లేదు. గ్రహణ మొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సమయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సమయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ మెుర్రి ఏర్పడుతుంది. అయితే... శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్ అయిన ప్రస్తుత సవుయంలో ఇప్పుడిది సవుస్యే కాదు. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సవుర్థంగా చక్కదిద్దవచ్చు. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. అలాగని గ్రహణ సమయంలో ప్రత్యేకించి బయట తిరగమని చెప్పడం కాదు. అనుమానాలు, అపోహలు మాని మామూలుగానే ఉండవచ్చునని చెప్పడమే ముఖ్యోద్దేశం. -(చంద్రగ్రహణం రానున్న నేపథ్యంలో) చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే -
చిన్నారుల జీవితాల్లో వెలుగు
– ముగిసిన గ్రహణ మొర్రి ఆపరేషన్లు – రూ.50 లక్షల సర్జరీలు పూర్తిగా ఉచితం నంద్యాల: ఫౌండేషన్ ఫర్ చైల్డ్ ఇన్‌నీడ్ ఆధ్వర్యంలో, అమెరికాకు చెందిన స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సహకారంతో స్థానిక శాంతిరాం జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి ఆపరేషన్లు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఆపరేషన్లు ఈనెల 5వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 75మంది చిన్నారులకు అమెరికాకు చెందిన 25 మంది వైద్యుల బృందం ఆపరేషన్లు నిర్వహించింది. ఎఫ్సీఎన్ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, థోమాస్రెడ్డి ఈ శిబిరాన్ని నిర్వహించారు. సర్జరీలు పూర్తయ్యాక వీరు చిన్నారుల తల్లిదండ్రులకు రవాణా చార్జీలను కూడా అందజేసి ఇంటికి పంపారు. థోమాస్రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపడానికే మూడేళ్ల నుంచి శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అమెరికా వైద్యులు నిస్వార్థంగా సేవలు అందించారన్నారు. శాంతిరాం జనరల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు, వైస్ చైర్పర్సన్ డాక్టర్ మాధవీలత ఆపరేషన్ థియేటర్లను, నర్సింగ్ స్టాఫ్‌తో పాటు అన్నివస తులు కల్పించాలన్నారు. సాక్షి మీడియాతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రహణ మొర్రి చిన్నారులకు సమాచారం అంది, వారు ఆపరేషన్లు చేయించుకున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు.