చిన్నారుల జీవితాల్లో వెలుగు
చిన్నారుల జీవితాల్లో వెలుగు
Published Sat, Feb 11 2017 9:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
– ముగిసిన గ్రహణ మొర్రి ఆపరేషన్లు
– రూ.50 లక్షల సర్జరీలు పూర్తిగా ఉచితం
నంద్యాల: ఫౌండేషన్ ఫర్ చైల్డ్ ఇన్‌నీడ్ ఆధ్వర్యంలో, అమెరికాకు చెందిన స్మైల్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ సహకారంతో స్థానిక శాంతిరాం జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి ఆపరేషన్లు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఆపరేషన్లు ఈనెల 5వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 75మంది చిన్నారులకు అమెరికాకు చెందిన 25 మంది వైద్యుల బృందం ఆపరేషన్లు నిర్వహించింది. ఎఫ్‌సీఎన్ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, థోమాస్‌రెడ్డి ఈ శిబిరాన్ని నిర్వహించారు. సర్జరీలు పూర్తయ్యాక వీరు చిన్నారుల తల్లిదండ్రులకు రవాణా చార్జీలను కూడా అందజేసి ఇంటికి పంపారు.
థోమాస్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపడానికే మూడేళ్ల నుంచి శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అమెరికా వైద్యులు నిస్వార్థంగా సేవలు అందించారన్నారు. శాంతిరాం జనరల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ మాధవీలత ఆపరేషన్ థియేటర్లను, నర్సింగ్ స్టాఫ్‌తో పాటు అన్నివస తులు కల్పించాలన్నారు. సాక్షి మీడియాతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రహణ మొర్రి చిన్నారులకు సమాచారం అంది, వారు ఆపరేషన్లు చేయించుకున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు.
Advertisement