grahanam
-
నేడు సోమావతి అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో..
ఈ అమావాస్య అత్యంత శక్తిమంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని పిలుస్తారు. ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: ⇒ సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ⇒ ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ⇒ శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. ⇒ గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ⇒ వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా.. వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారమూ లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు పాటు సేవ చేయగా.. ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. (చదవండి: సైన్స్ ఆగిపోయిన సమయాన ..) -
నమ్మకమా..నిజమా?
-
చంద్రగహణం.. నేడు ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో బుధవారం అన్నప్రసాదాల వితరణను టీటీడీ నిలిపివేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. గ్రహణం కారణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5.18 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతున్నందున రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అలాగే శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నందున టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి లావణ్యత్రిపాఠి, క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు చాముండేశ్వరీ నాధ్లు దర్శించుకున్నారు. -
గ్రహం అనుగ్రహం ( 21-07-2015 )
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం తిథి శు.పంచమి ప.12.44 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తర రా.1.21 వరకు వర్జ్యం ఉ.6.29 నుంచి 8.10 వరకు దుర్ముహూర్తం ఉ.8.12 నుంచి 9.02 వరకు తదుపరి రా.11.00 నుంచి 11.47 వరకు అమృతఘడియలు సా.5.07 నుంచి 6.47 వరకు సూర్యోదయం : 5.39 సూర్యాస్తమయం: 6.34 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ధన, వస్తు లాభాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభం: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. మిథునం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల స్థితి. సింహం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కన్య: నూతన వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తుల: వ్యయ ప్రయాసలు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. వృశ్చికం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పనులు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లాభిస్తాయి. మకరం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పనులు వాయిదా పడవచ్చు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి. కుంభం: ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మీనం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
వైవిధ్యభరితంగా గ్రహణం
గ్రహణం చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మిస్తున్న తాజా చిత్రం గ్రహణం. ఈ సంస్థ ఇప్పటికే నాగార్జున, కార్తీ కలయికలో ఒక మల్టీ స్టార్ చిత్రాన్ని, ఆర్య, అనుష్క జంటగా ఇంజి ఇడుప్పలగు చిత్రంతో పాటు మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, నాల్గో చిత్రంగా గ్రహణంకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నవ దర్శకుడు ఇలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో యువ నటుడు కృష్ణ హీరోగా, నవ నటి నందిని హీరోయిన్గా నటిస్తున్నారు. కయల్ ఫేం చంద్రన్, కరుణాస్, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలోని వినాయక స్వామి ఆలయంలో జరిగాయి. చిత్ర ద ర్శకుడు ఇలన్ వివరాలు తెలుపుతూ ఇది వైవిధ్య భరిత త్రిల్లర్ కథా చిత్రంగా పేర్కొన్నారు. గ్రహణం అంటే ప్రజల్లో రక రకాల అభిప్రాయాలు ఉంటాయన్నారు. అలాంటి గ్రహణం రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఇతి వృత్తాంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.ఏప్రిల్ 16 నుంచి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించి నిరవధికంగా ముందుకు వెళ్తామని నిర్మాతలు తెలిపారు. పూజా కార్యక్రమానికి దర్శకుడు విష్ణువర్దన్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజ, ఎస్ఆర్ ప్రభు, స్టూడియో-9 సురేష్, ధనంజయన్, సీవీ కుమార్, టి.శివ విచ్చేసి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.