వైవిధ్యభరితంగా గ్రహణం | As varied grahanam | Sakshi
Sakshi News home page

వైవిధ్యభరితంగా గ్రహణం

Published Sat, Apr 4 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

వైవిధ్యభరితంగా గ్రహణం

వైవిధ్యభరితంగా గ్రహణం

గ్రహణం చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మిస్తున్న తాజా చిత్రం గ్రహణం. ఈ సంస్థ ఇప్పటికే నాగార్జున, కార్తీ కలయికలో ఒక మల్టీ స్టార్ చిత్రాన్ని, ఆర్య, అనుష్క జంటగా ఇంజి ఇడుప్పలగు చిత్రంతో పాటు మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, నాల్గో చిత్రంగా గ్రహణంకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నవ దర్శకుడు ఇలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో యువ నటుడు కృష్ణ హీరోగా, నవ నటి నందిని హీరోయిన్‌గా నటిస్తున్నారు. కయల్ ఫేం చంద్రన్, కరుణాస్, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలోని వినాయక స్వామి ఆలయంలో జరిగాయి.

చిత్ర ద ర్శకుడు ఇలన్ వివరాలు తెలుపుతూ ఇది వైవిధ్య భరిత త్రిల్లర్ కథా చిత్రంగా పేర్కొన్నారు. గ్రహణం అంటే ప్రజల్లో రక రకాల అభిప్రాయాలు ఉంటాయన్నారు. అలాంటి గ్రహణం రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఇతి వృత్తాంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.ఏప్రిల్ 16 నుంచి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించి నిరవధికంగా ముందుకు వెళ్తామని నిర్మాతలు తెలిపారు. పూజా కార్యక్రమానికి దర్శకుడు విష్ణువర్దన్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజ, ఎస్‌ఆర్ ప్రభు, స్టూడియో-9 సురేష్, ధనంజయన్, సీవీ కుమార్, టి.శివ విచ్చేసి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement