Grand Slam Champion
-
గెలుపును ఊహించని విజేతలు వీళ్లు
-
Emma Raducanu: అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా!
ఈ టోర్నీకి ముందు ఎమ్మా రాడుకాను ... పెద్దగా ఎవరికీ తెలియని పేరు! కానీ ఆదివారం క్రీడా ప్రపంచంలో మార్మోగుతున్న పేరు అదే! ఇంతకు తను ఏం చేసింది. యూఎస్ ఓపెన్ గెలిచింది. ఓస్ అంతేనా! అంతేనా అంటారేంటి. ఆమె ఓ సంచలనం. అదేలా... మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్‌లోకి వచ్చిందే ఈ జూన్‌లో. ఆడిన అనుభవం ఒక్కటే గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్). బరిలోకి దిగిన రెండో గ్రాండ్‌స్లామ్‌లోనే విజేత! ఆమె చరిత్రకెక్కింది... మరి ఇదెలాగో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి టైటిల్ గెలవడం... రాడుకాను ఇంత చేసిందా! అవును... 18 ఏళ్ల చిన్నది చకచకా పెద్ద టోర్నీనే జయించింది. ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. –సాక్షి క్రీడావిభాగం నిజానికి ఇంత చేస్తానని, యూఎస్ ఓపెన్ గెలుస్తానని తను కూడా అనుకోలేదు కాబోలు. ఎందుకంటే రాడుకాను క్వాలిఫయింగ్ టోర్నీ దశ వరకే ఇంగ్లండ్‌కు రిటర్న్ టికెట్ (ఫ్లయిట్) కూడా బుక్ చేసుకుంది. ఓ మూడు వారాలు ప్రత్యర్థులందరినీ ఓడిస్తూ ఏకంగా ఇపుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పయనమవుతోంది. ఆమె ఆట... ఫైనల్‌దాకా ఆమె వేసుకున్న బాట ఎవరి ఊహకు అందదు. అసలు ఒకటో రెండో రౌండ్‌కే ఇంటికి చేరాల్సిన బ్రిటన్ భామ గ్రాండ్‘సలామ్’ కొట్టే ప్రదర్శన చేసింది. అమ్మ... నాన్న... ఓ కెనడా పాపాయి ఎమ్మా రాడుకాను సహా వాళ్ల అమ్మ, నాన్నది ఇంగ్లండ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురివి వేర్వేరు ప్రదేశాలు కాదు... ఏకంగా వేర్వేరు దేశాలే! నాన్న ఇయాన్ది రొమేనియా. తల్లి రెనీది చైనా. ఎమ్మా పుట్టిందేమో టోరంటో (కెనడా)! ఈ కెనడా పాపాయి రెండేళ్ల వయసులో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అక్కడే ఐదేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టింది. పదమూడేళ్లు తిరిగే సరికే (18 ఏళ్ల వయసులో) యూఎస్ ఓపెన్ చాంపియన్ అయ్యింది. జయం భళారే విజయం ఎమ్మా రాడుకాను సీడెడ్ ప్లేయరేం కాదు. ప్రపంచ 150వ ర్యాంకర్. ఓ క్వాలిఫయర్! వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే మెయిన్ ‘డ్రా’ ప్రాప్తం లభిస్తుంది. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో క్వాలిఫయర్ లక్ష్యం ఏదైనా ఉందంటే అది మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించడమే! అలా క్వాలిఫయింగ్ అంచెను దాటింది. మెయిన్ ‘డ్రా’ ఆట మొదలుపెట్టింది. ఒక్కొక్కరినీ ఒక్క సెట్ కోల్పోకుండానే కంగుతినిపించింది. ఇలా ఒకటి, రెండు కాదు... ఏడు మ్యాచ్ (ఫైనల్)ల దాకా తలవంచని ఈ టీనేజ్ సంచలనం ఏకంగా పది మ్యాచ్‌ల్లో (క్వాలిఫయింగ్ సహా) ఈ రికార్డుతో చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల టెన్నిస్‌లో ఇంతవరకు ఏ ఒక్కరికి సాధ్యం కానీ అరుదైన, అసామాన్యమైన రికార్డుతో రాడుకాను టెన్నిస్ పుటల్లో నిలిచింది. అందరినీ వరుస సెట్లలోనే! జూనియర్ స్థాయిలో మూడు టైటిల్స్ గెలిచిన రాడుకాను ఈ మధ్యే డబ్ల్యూటీఏ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టింది. ఈ జూన్‌లో నాటింగ్‌హామ్‌లో జరిగిన గ్రాస్ట్కోర్ట్ టెన్నిస్ టోరీ్నతో ఎమ్మా ఫ్రొఫెషనల్ టెన్నిస్ షురూ అయింది. మరుసటి నెలలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో ఆడింది. మూడు రౌండ్లు గెలిచి ఊపుమీదున్న రాడుకాను ప్రిక్వార్టర్స్‌లో శ్వాస సమస్యతో మ్యాచ్ మధ్యలోనే వైదొలగింది. దీంతో ఆమె వైల్డ్‌కార్డ్‌కు అనారోగ్యంతో శుభం కార్డు పడింది. కోలుకున్నాక అమెరికా వచి్చంది. గత నెల చికాగో డబ్ల్యూటీఏ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచింది. తిరిగి ఓ అనామక క్రీడాకారిణిగా యూఎస్ ఓపెన్ ఆడింది. మెయిన్ డ్రాకు చేరాక మేటి క్రీడాకారిణుల భరతం పట్టింది. ఆమె ప్రతీ మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించడం విశేషం. ఈ పరంపరలో ప్రపంచ 11వ ర్యాంకర్, టోక్యో ఒలింపిక్ చాంపియన్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను క్వార్టర్స్‌లో కంగుతినిపించింది. సెమీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న మరియా సాకరి (18వ ర్యాంక్; గ్రీస్)ని మట్టికరిపించి టైటిల్ బరిలో నిలిచింది. వర్జినియా వేడ్ తర్వాత... ఓ ఇంగ్లండ్ మహిళా టెన్నిస్ ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి దశాబ్దాలైంది. 1977లో వర్జినియా వేడ్ సొంతగడ్డపై వింబుల్డన్ గెలిచాక ఇంకెవరూ మేటి టైటిల్ గెలవనే లేదు. ఇప్పుడు రాడుకాను 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రాడుకాను 150వ స్థానం నుంచి నేడు అనూహ్యంగా 24వ ర్యాంక్‌కు ఎగబాకనుంది. అన్‌సీడెడ్ హోదాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 13వ ప్లేయర్ ఎమ్మా రాడుకాను. గతంలో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా; 2017లో యూఎస్ ఓపెన్), ఒస్టాపెంకో (లాత్వి యా; 2017లో ఫ్రెంచ్ ఓపెన్), క్లియ్‌స్టర్స్ (బెల్జియం; 2009లో యూఎస్ ఓపెన్), సెరెనా విలియమ్స్ (అమెరికా; 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్), గాస్టన్ గాడియో (అర్జెంటీనా; 2005లో ఫ్రెంచ్ ఓపెన్), ఇవానిసెవిచ్ (క్రొయేషియా; 2001లో వింబుల్డన్), కుయెర్టన్ (బ్రెజిల్; ఫ్రెంచ్ ఓపెన్ 1997), అగస్సీ (అమెరికా; 1994లో యూఎస్ ఓపెన్), బోరిస్ బెకర్ (జర్మనీ; 1985లో వింబుల్డన్), విలాండర్ (స్వీడన్; 1982లో ఫ్రెంచ్ ఓపెన్), క్రిస్ ఓనీల్ (ఆస్ట్రేలియా; 1978లో ఆస్ట్రేలియన్ ఓపెన్), మార్క్ ఎడ్మండ్సన్ (ఆ్రస్టేలియా; 1976లో ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. తన అభిమాన ప్లేయర్ హలెప్‌తో చిన్నారి రాడుకాను 🇬🇧 @EmmaRaducanu did a thing. Highlights from the women's singles final 👇 pic.twitter.com/oLKnAlyPSU — US Open Tennis (@usopen) September 11, 2021 -
Emma Raducanu: అద్భుతం ఆవిష్కృతం
కష్టపడితే కలలు కూడా నిజమవుతాయని... అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతాయని... ర్యాంక్‌తో సంబంధం లేదని... వయసుతో పనిలేదని... అపార అనుభవం అక్కర్లేదని... సత్తా ఉంటే... గెలవాలనే సంకల్పం ఉంటే... అద్భుతాలు చేయవచ్చని బ్రిటన్ టెన్నిస్ టీనేజర్ ఎమ్మా రాడుకాను నిరూపించింది. మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడమే లక్ష్యంగా న్యూయార్క్ వచ్చిన ఈ 18 ఏళ్ల అమ్మాయి మూడు వారాల్లో ఊహకందని అద్భుతాన్ని ఆవిష్కరించింది. టెన్నిస్ చరిత్రలో క్వాలిఫయర్ హోదాలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత బ్రిటన్ తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. న్యూయార్క్: ఏనాటికైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆడాలని... విజేతగా నిలిచి కోర్టు అంతా కలియ తిరగాలని... స్టాండ్స్‌లోకి వెళ్లి తన వాళ్లతో సంబరాలు చేసుకోవాలని... సగర్వంగా ట్రోఫీని ముద్దాడాలని... ఐదేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టినప్పటి నుంచి రాడుకాను కలల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. రాడుకాను కలల్లో కనిపించిన ఈ దృశ్యాలు ఆదివారం న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో నిజమయ్యాయి. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ ఇంటిముఖం పడుతుంటే... ఎవరూ ఊహించని విధంగా సంచలనాల మోత మోగిస్తూ ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణులు 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను, 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం తలపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ముగిసిన ఈ ఫైనల్లో ప్రపంచ 150వ ర్యాంకర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) గంటా 51 నిమిషాల్లో 6–4, 6–3తో ప్రపంచ 73వ ర్యాంకర్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన రాడుకానుకు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ లేలా ఫెర్నాండెజ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభంలోనే బ్రేక్‌తో... 24 వేల మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ అయిన ఆర్థర్ యాష్ స్టేడియంలో రాడుకాను, లేలా ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రాడుకాను ఫైనల్ చేరగా... గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్లో నెగ్గి లేలా తుది పోరుకు సమాయత్తమైంది. డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), 16వ సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్)లను బోల్తా కొట్టించిన లేలా ఫైనల్లో ఫేవరెట్‌గా అడుగుపెట్టింది. కానీ క్వాలిఫయింగ్ దశ నుంచి మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన రాడుకాను మాత్రం లేలా గత మ్యాచ్‌ల ప్రదర్శనను చూసి ఆందోళన చెందలేదు. తన సర్వీస్‌తో తొలి సెట్‌ను మొదలుపెట్టిన రాడుకాను గేమ్‌ను సాధించి 1–0తో ముందంజ వేసింది. లేలా సర్వీస్ చేసిన రెండో గేమ్‌లో రాడుకాను దూకుడు కనబరిచింది. లేలా కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ గేమ్‌లో నాలుగుసార్లు డ్యూస్ (40–40) నమోదయ్యాయి. చివరకు ఐదో ప్రయత్నంలో రాడుకాను పాయింట్ సాధించి లేలా సరీ్వస్‌ను బ్రేక్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే లేలా డీలా పడిపోలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సరీ్వస్‌లో మూడుసార్లు ‘డ్యూస్’ అయింది. నాలుగో ప్రయత్నంలో లేలా పాయింట్ గెలిచి రాడుకాను సరీ్వస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తన సరీ్వస్‌ను నిలబెట్టుకుంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 4–4తో సమమైంది. తొమ్మిదో గేమ్‌లో రాడుకాను తన సరీ్వస్‌ను నిలబెట్టుకొని పదో గేమ్‌లో లేలా సరీ్వస్‌ను బ్రేక్ చేసి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. గాయమైనా... తొలి సెట్‌ను నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్లోనూ రాడుకాను దూకుడు కొనసాగింది. మరోవైపు లేలా కూడా పోరాటం ఆపలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకున్నట్లు కనిపించిన లేలా నాలుగో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఆరో గేమ్‌లో లేలా సర్వీస్‌ను బ్రేక్ చేసిన రాడుకాను ఏడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో లేలా తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. ఈ గేమ్ చివర్లో స్లయిడ్ షాట్ ఆడే క్రమంలో రాడుకాను ఎడమ కాలికి గాయమై రక్తస్రావమైంది. రాడుకాను మెడికల్ టైమ్ కోరగా... లేలా మాత్రం చైర్ అంపైర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ లేలా అభ్యంతరాన్ని చైర్ అంపైర్ తోసిపుచ్చి డాక్టర్‌ను కోర్టులోకి పిలిచారు. కాలికి చికిత్స చేసుకున్నాక రాడుకాను మ్యాచ్ కోసం సర్వీస్ చేసింది. ఒకసారి బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న రాడుకాను రెండుసార్లు డ్యూస్ అయ్యాక మూడోసారి ఏస్ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్ వరకు తీసుకెళ్లి గెలిచిన లేలా ఈసారి మాత్రం సఫలం కాలేకపోయింది. మహిళల టెన్నిస్ భవిష్యత్‌ను ఈ ఫైనల్ చూపించింది. ‘డ్రా’లో ఉన్న ఏ క్రీడాకారిణి అయినా గెలవొచ్చనే సందేశాన్నిచ్చింది. బిల్లీ జీన్ కింగ్, వర్జినియా వేడ్, టిమ్ హెన్మన్లాంటి టెన్నిస్ దిగ్గజాల అడుగుజాడల్లో కొత్త తరం నడుస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యర్థి లేలా పోరాడింది. ఆమెను ఓడించడం అంత సులభం కాదు. భవిష్యత్‌లో మేం మళ్లీ మళ్లీ ఫైనల్లో తలపడాలని కోరుకుంటున్నాను. –రాడుకాను (9/11) ఉగ్రదాడి తర్వాత గత 20 ఏళ్లలో న్యూయార్క్ నగరం తేరుకున్న తీరు అపూర్వం. ఈ నగరంలానే నేనూ పుంజుకుంటాను. న్యూయార్క్ వాసుల ఆత్మస్థయిర్యమే నాకు స్ఫూర్తి. వచ్చే ఏడాదీ ఇక్కడ ఫైనల్ ఆడతాను. అప్పుడు తప్పకుండా ట్రోఫీని ఎగరేసుకుపోతాను. ఈ ఫైనల్లో ఎమ్మా బాగా ఆడింది. ఆమెకు నా అభినందనలు. –లేలా ఫెర్నాండెజ్ రన్నరప్ ట్రోఫీతో లేలా ఫెర్నాండెజ్ -
జొకోవిచ్ వస్తున్నాడు...
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో తాను పాల్గొంటానని ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రకటించాడు. గాయం కారణంగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్... కరోనా వైరస్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఈ మెగా టోర్నీకి దూరంగా ఉన్నారు. గత జూన్‌లో కరోనా బారిన పడి కోలుకున్న 32 ఏళ్ల జొకోవిచ్ మాత్రం తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లో పోటీపడతానని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో మూడుసార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఈ సెర్బియా స్టార్ ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘అన్ని వైపుల ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా ఆలోచించి యూఎస్ ఓపెన్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని పరిమితుల మధ్య మేము మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని తెలుసు. నా సహాయక సిబ్బందితో కలిసి ప్రణాళికబద్ధంగా యూఎస్ ఓపెన్‌కు సిద్ధమయ్యాను’ అని 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెల్చుకున్న జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
మళ్లీ జొకో‘విన్’
తనకెంతో అచ్చొచ్చిన వేదికపై మరో అద్భుత ప్రదర్శనతో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ టోర్నీ ఫైనల్స్‌లో 8–0తో తన అజేయ రికార్డును కొనసాగించాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ నేడు విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో రాఫెల్ నాదల్‌ను రెండో స్థానానికి నెట్టి మళ్లీ తాను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. మెల్బోర్న్: పోరాట పటిమకు పెట్టింది పేరైన సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆదివారం వీరోచిత ఆటతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగం టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. రాడ్‌లేవర్ ఎరీనాలో ఆదివారం 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–4, 4–6, 2–6, 6–3, 6–4తో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎనిమిదోది. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019లలో చాంపియన్‌గా నిలిచాడు. తాజా విజయంతో జొకోవిచ్ సోమవారం విడుదల చేసే ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నాదల్ నుంచి మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ థీమ్‌కు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను ఓడించిన 26 ఏళ్ల డొమినిక్ థీమ్ ఫైనల్లోనూ మరో సంచలనం నమోదు చేస్తాడనిపించింది. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఆడుతున్న థీమ్ తొలి సెట్‌ను కోల్పోయాక... అనూహ్యంగా పుంజుకొని రెండు, మూడు సెట్లలో నెగ్గి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా అడుగులు వేశాడు. అయితే గతంలో ఆడిన ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో విజయం సాధించి అజేయంగా ఉన్న 32 ఏళ్ల జొకోవిచ్ తన ప్రత్యర్థికి సులువుగా తలవంచాలనుకోలేదు. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ నాలుగో సెట్లో ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. జొకోవిచ్ ఆటతీరు గాడిలో పడటంతో ఐదో సెట్లో థీమ్ ఒత్తిడికి లోనై తడబడ్డాడు. మూడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచంలోని నా అభిమాన కోర్టు, నా అభిమాన స్టేడియమిదే. ఈ ట్రోఫీని మరోసారి అందుకోవడంతో పరమానందం కలుగుతోంది. ఈ ఏడాది విషాదభరిత సంఘటనలతో ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సంఘర్షణ వాతావరణం, పలువురు ప్రాణాలు కోల్పోవడం... నా ఆప్తమిత్రుడు, బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ దుర్మరణం కలిచి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం సంఘటితంగా ఉండాలి. క్రీడాకారులకూ వేరే జీవితం ఉంటుంది. మనల్ని అభిమానించే వాళ్లతో, ప్రేమించే వాళ్లతో, కుటుంబసభ్యులతో బాధ్యతగా మెలగాలి. ఫైనల్లో థీమ్ బాగా ఆడాడు. భవిష్యత్‌లో అతను కచ్చితంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తాడు. –జొకోవిచ్ ►3 ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని 8 అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో ప్లేయర్ జొకోవిచ్. ఫెడరర్ వింబుల్డన్ టోర్నీలో 8 సార్లు, నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 12 సార్లు చాంపియన్‌గా నిలిచారు. ►పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ (17) మూడో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ (స్విట్జర్లాండ్–20), రాఫెల్ నాదల్ (స్పెయిన్–19) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
నయోమి... నవ చరిత్ర
మహిళల టెన్నిస్‌లో మరో యువ తార అవతరించింది. తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా విజేతగా నిలిచింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే సెరెనా అనుచిత ప్రవర్తన ఒసాకా విజయానందాన్ని ఆవిరి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని చైర్ అంపైర్ సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేయడం... సెరెనా అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు రెండో హెచ్చరిక రూపంలో ప్రత్యర్థికి పాయింట్ ఇచ్చేయడం... ఆ తర్వాత తీవ్ర పదజాలంతో చైర్ అంపైర్‌ను దూషించినందుకు.. మూడో హెచ్చరిక రూపంలో సెరెనా గేమ్నే కోల్పోవడం... వెరసి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా అద్భుత ఆటతీరు కాకుండా చివరకు సెరెనా అనుచిత ప్రవర్తనే హైలైట్ అయ్యింది. న్యూయార్క్: అద్భుతం జరిగింది. అంచనాలు తలకిందులయ్యాయి. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్ భవిష్యత్ టెన్నిస్ తార చేతిలో బోల్తా పడింది. జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా ధాటికి ఈ అమెరికా టెన్నిస్ దిగ్గజం చేతులెత్తేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 20వ సీడ్ నయోమి ఒసాకా 6–2, 6–4తో 17వ సీడ్, ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. నా లీ (చైనా; 2011లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఆసియా నుంచి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా 20 ఏళ్ల ఒసాకా గుర్తింపు పొందింది. విజేత ఒసాకాకు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో కేవలం ఒక సెట్ కోల్పోయిన ఒసాకా తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. 36 ఏళ్ల సెరెనాకు ప్రతి విభాగంలో ఆమె గట్టి జవాబు ఇచ్చింది. తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలు అయినప్పటికీ... స్టేడియంలోని 24 వేల మంది ప్రేక్షకులు సెరెనా విజయమే కోరుకుంటునప్పటికీ... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న ఈ జపాన్ అమ్మాయిపై ఆ అంశాలు ఎలాంటి ప్రభావం చూపలేదు. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన ఒసాకా కచ్చితమైన సర్వీస్‌లు... కళ్లు చెదిరేరీతిలో రిటర్న్ షాట్లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో సెరెనాకు ఊపిరి ఆడకుండా చేసింది. ఒకదశలో ఒసాకా కొట్టిన కొన్ని షాట్లను సెరెనా కూడా ప్రశంసించింది. మరోవైపు సెరెనాకు ఏదీ కలసి రాలేదు. గతి తప్పిన సర్వీస్‌లు.. డబుల్ ఫాల్ట్‌లు... అనవసర తప్పిదాలు... బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకోవడం... ఇలా ఆమె ఏదశలోనూ ఒసాకాకు పోటీ ఇచ్చినట్టు అనిపించలేదు. తొలి సెట్లోని మూడో గేమ్‌లో, ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఒసాకా తన సర్వీస్‌లను కాపాడుకొని 34 నిమిషాల్లో 6–2తో సెట్‌ను దక్కించుకుంది. వివాదం మొదలైందిలా... రెండో సెట్లో తన సర్వీస్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సెరెనా 1–0తో ముందంజ వేసింది. ఈ దశలో గ్యాలరీలో ఉన్న సెరెనా కోచ్ ప్యాట్రిక్ మురాతొగ్లు నిబంధనలకు విరుద్ధంగా సంకేతాల రూపంలో సలహాలు ఇస్తున్నారని గమనించిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ (పోర్చుగల్) సెరెనాను హెచ్చరించారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన సెరెనా చైర్ అంపైర్ రామోస్‌తో వాగ్వాదానికి దిగింది. ‘కోచ్ తనకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు. మోసపూరిత పద్ధతులతో గెలిచే బదులు నేను ఓడిపోవడానికి సిద్ధపడతాను’ అని రామోస్‌కు సెరెనా సమాధానం ఇచ్చింది. అనంతరం ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత సెరెనా కూడా గేమ్ నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. గేమ్ పూర్తయ్యాక తన కుర్చీ వద్దకు వెళ్తూ ‘నేను మోసం చేయడంలేదు’ అని చైర్ అంపైర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. కంట కన్నీరు.... జరిమానా రూపంలో గేమ్ ఒసాకాకు ఇవ్వడంతో సెరెనా మరింత రెచ్చిపోయింది. టోర్నీ రిఫరీ కోర్టులోకి రావాలని కోరింది. ‘ఇది అన్యాయం. పురుష ప్లేయర్లు నాకంటే దారుణంగా ఎన్నోసార్లు దూషించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. నేను మహిళను కాబట్టే నన్ను శిక్షించారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని టోర్నీ రిఫరీతో కన్నీరు కారుస్తూ వాపోయింది. టోర్నీ రిఫరీ చైర్ అంపైర్‌తో మాట్లాడి సెరెనాకు సర్దిచెప్పడంతో మళ్లీ ఆట కొనసాగింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్ నిలబెట్టుకుంది. స్కోరు 5–4 ఉండగా పదో గేమ్‌లో ఒసాకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే కోర్టులో జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు కనిపించిన ఒసాకా విజయం అనంతరం సంబరాలను కూడా చేసుకోలేదు. ఒసాకాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించిన సెరెనా మళ్లీ చైర్ అంపైర్ వద్దకు వెళ్లి తనకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఆయన స్పందించలేదు. దాంతో సెరెనా చైర్ అంపైర్‌తో కరచాలనం చేయకుండానే వెనుదిరిగింది. నువ్వో దొంగవి... రెండో సెట్లో ఆరో గేమ్ ముగిశాక సెరెనా చైర్ అంపైర్‌తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ‘నేను గ్యాలరీలో నుంచి ఎలాంటి కోచింగ్ తీసుకోవడంలేదు. నేను మోసానికి పాల్పడటం లేదని మీరు మైక్ ద్వారా ప్రకటించాలి. నాకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలి. నా జీవితంలో నేను ఏనాడూ మోసం చేయలేదు’ అని ఆవేశంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో సెరెనా మళ్లీ తన సర్వీస్ చేజార్చుకుంది. ఒసాకా 4–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మళ్లీ చైర్ అంపైర్‌ను సెరెనా దూషించడం మొదలుపెట్టింది. ‘నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. నువ్వో అబద్ధాలకోరువి. నువ్వు బతికినంతకాలం నేను ఆడుతున్న మ్యాచ్‌కు అంపైరింగ్ చేయొద్దు. నన్నెప్పుడు క్షమాపణలు కోరుతావ్? ఇప్పుడే క్షమాపణ చెప్పు. నా నుంచి పాయింట్ లాక్కున్నావు. నువ్వు ఓ దొంగవి’ అని తీవ్ర పదజాలాన్ని వాడింది. సెరెనా దూషణ పర్వానికి జరిమానాగా చైర్ అంపైర్ ఈసారి ఏకంగా ఒక గేమ్‌ను ఒసాకాకు ఇచ్చాడు. దాంతో ఒసాకా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. రాకెట్ విరగ్గొట్టి.... రెండో సెట్ నాలుగో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 3–1తో ముందంజ వేసింది. అయితే ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాక సెరెనా తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. దాంతో క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమెపై చైర్ అంపైర్ పెనాల్టీ విధించారు. ఫలితంగా ఒసాకా ఆరో గేమ్‌ను నేరుగా 15–0తో ప్రారంభించింది. తన సర్వీస్‌ను కాపాడుకుంది. స్కోరు 3–3తో సమమైంది. నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సెరెనా విజయం సాధించాలని కోరుకున్నారని తెలుసు. అయితే ముగింపు ఇలా ఉన్నందుకు క్షమాపణలు కోరుతున్నా. నేనీ స్థాయికి చేరుకోవడానికి అమ్మానాన్న ఎన్నో త్యాగాలు చేశారు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాతో ఆడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. –నయోమి ఒసాకా నయోమి చాలా బాగా ఆడింది. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. మీరందరూ నాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని తెలుసు. విజయార్హత ఉన్నవారికి గుర్తింపు ఇవ్వాలి. గేలి చేయడం మానేసి మీరందరూ నయోమిని అభినందించాలి. కోచ్ ప్యాట్రిక్ నాకు సలహాలు ఇచ్చానని అంగీకరించారు. కానీ సంకేతాలు ఇస్తున్నపుడు నేను ఆయనవైపు చూడలేదు. నాకు కోర్టులో కోచింగ్ తీసుకోవడం అలవాటు కూడా లేదు. గతంలో పురుష ప్లేయర్లు చైర్ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించారు. కానీ వారిపై ఎప్పుడూ గేమ్ పెనాల్టీ విధించలేదు. నేనిక్కడ మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడేందుకు ఉన్నాను. నాకు న్యాయం జరగకున్నా భవిష్యత్‌లో ఇతరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – సెరెనా -
ఒలింపిక్స్‌కు మేటి జంటను పంపలేకపోయారు
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ యువ సంచలనం సాకేత్ మైనేని ఆటతీరును ఆకాశానికెత్తాడు. అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని కితాబిచ్చాడు. ‘రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదు. దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నాం. గత 14 నెలల్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ టైటిల్స్‌ను సాధించిన నన్ను కాదని మరో ఆటగాడిని రియోకు పంపడం ఏమాత్రం సమంజసంగా లేదు’ అని అన్నాడు. సానియాకు జతగా రోహన్ బోపన్న బరిలోకి దిగగా ఈ జోడి సెమీఫైనల్‌తోపాటు కాంస్య పతక పోరులో ఓడింది. ప్రస్తుత డేవిస్ కప్ టీమ్ ఈవెంట్లో సాకేత్ మైనేనిలాంటి ఆటగాడితో జతకట్టడం బాగుందని పేస్ అన్నాడు. ఈ జోడీ... రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడి చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ‘మైనేని సర్వీస్ అద్భుతం. రిటర్న్ షాట్లు అసాధారణం. కెరీర్ తొలినాళ్లలోనే అతను చక్కని ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు. అనుభవం సంతరించుకుంటే భారత టెన్నిస్ మేటి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని తెలుగు కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తాడు. మనకు మరో 18 నెలల్లో ఆసియా గేమ్స్, నాలుగేళ్లకు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డబుల్స్‌లో ఎవరు, మిక్స్డ్ డబుల్స్‌లో ఎవరెవరు ఆడతారనే స్పష్టతతో ముందడుగు వేయాలని అఖిల భారత టెన్నిస్ సంఘాని (ఐటా)కి సూచించాడు. దీంతో చివరి నిమిషంలో అనవసరపు గందరగోళానికి తావుండదని చెప్పాడు. మరోవైపు ‘సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానం’ అని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా మీర్జా వ్యాఖ్యానించడం విశేషం. -
నాడు దోషి... నేడు విజేత
శతాబ్దంన్నర కంటే ఎక్కువ చరిత్ర కలిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆసియా క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే జపాన్ యువకెరటం కీ నిషికోరి రూపంలో తొలిసారి ఆసియా క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. దాంతో యూఎస్ ఓపెన్‌లో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని యావత్ జపాన్‌తోపాటు ఆసియా మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసింది. అయితే క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అసమాన ఆటతీరు ముందు నిషికోరి చేతులెత్తేయడంతో ఆసియా అభిమానులకు నిరాశ తప్పలేదు. తుది మెట్టుపై నిషికోరి బోల్తా యూఎస్ ఓపెన్ చాంపియన్ సిలిచ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఆసియా నుంచి పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను చూసేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. సంచలన విజయాలతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జపాన్ యువతార కీ నిషికోరి పోరాటం టైటిల్ పోరులో ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-3తో పదో సీడ్ నిషికోరిపై గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేకాకుండా సిలిచ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సిలిచ్ 17 ఏస్‌లు సంధించడంతోపాటు నిషికోరి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సిలిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒకేసారి సఫలమైన నిషికోరి 30 అనవసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన సిలిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు); రన్నరప్ నిషికోరికి 14 లక్షల 50 వేల డాలర్లు (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ (వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రొయేషియా క్రీడాకారుడిగా సిలిచ్ నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రస్తుతం సిలిచ్‌కు ఇవానిసెవిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ సాధించిన ఫైనల్ విజయాలు సోమవారమే రావడం విశేషం. తాజా ప్రదర్శనతో సిలిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి, నిషికోరి 8వ స్థానానికి ఎగబాకారు. స్థిరమైన ఆటతీరు క్వార్టర్స్‌లో ఆరో సీడ్ బెర్డిచ్ను, సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరిన సిలిచ్ అదే దూకుడును టైటిల్ పోరులోనూ ప్రదర్శించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న సిలిచ్ బుల్లెట్ వేగంతో కూడిన భారీ సర్వీస్‌లు... కచ్చితమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద చలాకీతనంతో నిషికోరి ఆట కట్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్పై, మూడో సీడ్ వావ్రింకాపై, ఐదో సీడ్ రావ్నిక్లపై అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరిన నిషికోరి తుదిపోరులో సిలిచ్ జోరు ముందు ఎదురునిలువలేకపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 68 కేజీల బరువున్న నిషికోరి మ్యాచ్ మొత్తంలో రెండో సెట్లో మాత్రమే ఒకసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. తన ప్రధాన ఆయుధం శక్తివంతమైన సర్వీస్‌లను నమ్ముకున్న సిలిచ్ ఆరోగేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో సిలిచ్ ఒకసారి తన సర్వీస్ కోల్పోయినా వెంటనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌పై తన పట్టుబిగించాడు. మూడో సెట్లోనూ సిలిచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌లో క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో సిలిచ్ మ్యాచ్‌ను ముగించాడు. * ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక 14వ సీడ్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. * పీట్ సంప్రాస్ (2002లో-ప్రపంచ 17వ ర్యాంకర్) తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్‌లో లేని క్రీడాకారుడు యూఎస్ ఓపెన్‌ను (సిలిచ్-ప్రపంచ 16వ ర్యాంకర్) గెలవడం ఇదే ప్రథమం. గాస్టన్ గాడియో (ప్రపంచ 44వ ర్యాంకర్; 2004-ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత సిలిచ్ రూపంలో టాప్-10లో లేని క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. * గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అత్యంత పొడగరి క్రీడాకారుడిగా యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా-2009 యూఎస్ ఓపెన్) సరసన సిలిచ్ చేరాడు. ఈ ఇద్దరూ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నారు. * ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్‌ను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నెగ్గిన 13వ క్రీడాకారుడు సిలిచ్. గతంలో ఆండీ ముర్రే (2012), డెల్‌పొట్రో (2009), లీటన్ హెవిట్ (2001) ఈ ఘనత సాధించారు. * ఓపెన్ శకంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో (క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్) ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఐదో ఆటగాడు సిలిచ్. గతంలో ఫెడరర్ (2003-వింబుల్డన్), రిచర్డ్ క్రాయిసెక్ (1996-వింబుల్డన్), ప్యాట్ క్యాష్ (1987-వింబుల్డన్), గిలెర్మో విలాస్ (1977-ఫ్రెంచ్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. నాడు దోషి... నేడు విజేత క్లిష్ట పరిస్థితులు గొప్ప వ్యక్తుల్లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి. మారిన్ సిలిచ్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్లో సిలిచ్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా... మోకాలి నొప్పితో వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో మ్యూనిచ్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు అతనికి వింబుల్డన్ టోర్నీలో సమాచారం ఇవ్వడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. దాంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సిలిచ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఫలితంగా సిలిచ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 2013 చివర్లో తన చిన్ననాటి అభిమాన క్రీడాకారుడు గొరాన్ ఇవానిసెవిచ్ను కోచ్‌గా నియమించుకున్నాడు. అదే సమయంలో తన నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేశాడు. తన సహాయక సిబ్బందిలో ఎవరో తెలియకుండా తనకు నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న మాత్రలను ఇవ్వడంతోనే ఇలా జరిగిందని వాదించాడు. సిలిచ్ వాదనలతో ఏకభవించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ నిషేధాన్ని నాలుగు నెలలకు కుదించింది. సత్తా ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో సిలిచ్లో ఉన్న అసలు చాంపియన్ బయటకు రావడంలేదని ఇవానిసెవిచ్ గ్రహించాడు. అతని ఆటలోని లోపాలను సవరించాడు. అతని ప్రధాన ఆయుధమైన భారీ సర్వీస్‌లకు మరింతగా పదును పెట్టాడు. పదేపదే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని సూచించాడు. అయితే సిలిచ్ తన ఆటతీరును మార్చుకోవడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో అనుకున్న ఫలితం వచ్చింది. మూడో రౌండ్లో 18వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), నాలుగో రౌండ్లో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) లను ఓడించిన సిలిచ్ ఫైనల్లో పదో సీడ్ నిషికోరిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. డోపింగ్‌లో దోషిగా తేలి కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో సిలిచ్ స్థయిర్యం కోల్పోకుండా పరిణతితో వ్యవహరించాడు. పట్టుదలే పెట్టుబడిగా పోరాటం చేసి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ను చక్కదిద్దుకున్నాడు.