granite company
-
గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది కూడా. ఇక.. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు నిర్ధారించింది. అంతేకాదు.. గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
గ్రానైట్ పరిశ్రమపై ఈడీ దాడులు సరికాదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీల కార్యాల యాలపై ఈడీ, ఐటీ దాడులు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తన కుటుంబ సభ్యులు, సమీప బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీలు దాడులకు దిగడం శోచనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు చేపట్టే విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని, తమకు కేంద్రం నుంచి ఎటువంటి రాయితీలు రాలేదని తెలిపారు. కరోనా కారణంగా మా ర్కెట్ దెబ్బతిని గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని, ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని స్పష్టం చేశారు. -
Karimnagar: గ్రానెట్ కంపెనీలకు ఈడీ ఝలక్.. ఉప ఎన్నిక ఎఫెక్టా..!
సాక్షి, కరీంనగర్: గ్రానైట్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి పంజా విసిరింది. కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలకు నోటీసులు జారీచేసి ఝలక్ ఇచ్చింది. ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెవ) నిబంధనలు ఉల్లంఘించారంటూ కేంద్ర ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈడీ దృష్టి సారింంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘిం మోతాదుకు మించి విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతోపాటు సీనరేజీ చార్జీలు ఎగవేతపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కేంద్రానికి 2019 జూలైలో ఫిర్యాదు చేశారు. సీనరేజీ చార్జీలు ర.749 కోట్లకుపైగా ప్రభుత్వానికి చెల్లించకుండా వెసం చేశారంటూ ఎంపీ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలింన ఈడీ.. ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపై విచారించే క్రమంలో కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలింంది. మైనింగ్ డిపార్ట్మెంట్లో చూపింన వాటికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేకుండా పోయింది. గ్రానైట్ ఎగుమతుల వివరాలు నిర్ణీత సమయంలో తెలపాలంటూ ఈడీ కరీంనగర్‌లోని గ్రానైట్ సంస్థలకు నోటీసులు పంపింంది. 9 గ్రానైట్ కంపెనీలకు నోటీసులు.. కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది కంపెనీలు ఈ మేరకు నోటీసులు అందుకున్నాయి. గ్రానైట్ విదేశాలకు ఎంత మేరకు ఎగుమతి చేశారో వివరాలు అందించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. గతంలో వెళ్లిన ఫిర్యాదుల దృష్ట్యా సముద్ర మార్గంలో గ్రానైట్‌ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సీనరేజీ ఫీజు రపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నవెదు చేశారు. సీనరేజీ ఫీజును నాడు ర.125 కోట్లుగా నిర్ణయించారు. వాటిని చెల్లించకపోవడంతో దీనిపై ఐదు రెట్ల అపరాధ రుసుం వి«ధించారు. దీంతో ర.749 కోట్లకు పైగా గ్రానైట్ వ్యాపారులు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులిచ్చారు. అంతేగాకుండా క్వారీల అనుమతులు నిలిపివేయడంతో కొంతమంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతోపాటు మైనింగ్ చట్టం ప్రకారం అప్పిలేట్ అధికారికి విన్నవించుకోగా సీనరేజీ ఫీజును 1+5 బదులు 1+1గా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో కొంతమంది క్వారీ వ్యాపారులు చెల్లింపులు చేయగా మరికొంత మంది కోర్టుల సహకారంతో క్వారీలు నడుపుతున్నారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి నోటీసులు జారీ చేయడంతో మరోసారి గ్రానైట్ వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారింది. తనిఖీలు వ్యాపారుల్లో కలకలం రేపాయి. ఉప ఎన్నిక ఎఫెక్టా..! టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భముల సంబంధింన వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కోవడంతో మంత్రి వర్గం నుం బర్తరఫ్ అయ్యారు. అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీల మధ్య ఎన్నికల షెడ్యల్ రాకముందే నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తుండడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర స్థాయి, కేంద్రస్థాయి అధినాయకత్వం హుజూరాబాద్ ఎన్నిక విషయం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తనే ఉంది. ఈటల రాజీనామా చేసిన మరుసటి రోజు నుండే టీఆర్ఎస్ అధినాయకత్వం హుజూరాబాద్‌పై దృష్టిసారించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపి ఈటల వెంట 20 సంవత్సరాలుగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను, బీజేపీ నాయకులను ఆకర్షిస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా హుజూరాబాద్‌కు చెందిన నాయకులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. దళితబంధు పథకాన్ని సైతం ఇక్కడి నుండే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ పైనే పడింది. ఉప ఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి కీలకంగా వ్యవహరిస్తుండడం, కరీంనగర్లో ఉన్న అతనికి సంబంధించిన గ్రానైట్ సంస్థలకు ఈడీ నోటీసులు రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది హుజూ రాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్టా అని పలువురు అనుకుంటున్నారు. నోటీసులు అందుకున్న కంపెనీలు ► శ్వేత ఏజెన్సీ ► ఏఎస్ షిప్పింగ్ ► జేఎం బ్యాక్సీ ► మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్ ► కేవీఏ ఎనర్జీ ► అరవింద్ గ్రానైట్ ► శాండియా ఏజెన్సీస్ ► పీఎస్ఆర్ ఏజెన్సీస్ ► శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ -
వరంగల్‌లో భారీ పేలుడు
సాక్షి, వరంగల్ : పొట్ట కూటి కోసం కూలి పనికి పోయిన పేదల బతుకులు చెల్లాచెదురయ్యాయి. వెంట తెచ్చుకున్న మెతుకులు తినకముందే బతుకులు చిందరవందరగా మారాయి. రోజులాగే పనిచేస్తున్న చోటే ఎవరూ ఊహించిన రీతిలో పిడుగు పడినట్లుగా శబ్దంతో కూడిన పేలుడు సంభవించడం... ఏమైందో తెలుసుకునే లోపే తెగిపడ్డ అవయవాలను చూసి బాధితుల గుండెలు అవిసేలా రోదించారు. కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని వజ్ర మ్యాట్రిక్స్లో గురువారం ఉదయం 10.46 గంటలకు భారీ పేలుడు సంభవించించగా ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా షెడ్డు రేకులు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు భారీ శబ్దం రావడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయా.. ఉంటే ఎందుకు తీసుకొచ్చారు.. గ్రానైట్ రాళ్లను పాలీష్ చేసేందుకు ఉపయోగించే బిట్స్ తయారీ పరిశ్రమ పేరిట ఇందులో ఏం చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ముక్కలు ముక్కలు వజ్ర మ్యాట్రిక్స్లో పేలుడు సమయంలో వెలువడిన భారీ శబ్దం రాంపూర్ గ్రామం వరకు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అంతలోపే బాధితుల కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారితో పాటు గ్రామస్తులు చేరుకున్నారు. అప్పటికే గాయాలతో విలవిలాడుతున్న బాధితులను వజ్ర మ్యాట్రిక్స్ యాజమానితో పాటు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో ముగ్గురు స్త్రీలతో పాటు ఇద్దరు పురుషులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు గాయపడగా.. దూరంగా ఉన్న పురుషులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు ధాటికి కంపెనీలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు కావడంతో పాటు పైకప్పు రేకులు ముక్కలుముక్కలయ్యాయి. కిటికీ అద్దాలు మొత్తం పగిలిపోగా షట్టర్ ఓ పక్కకు వంగిపోవడం పేలుడు తీవ్రతను చెబుతోంది. తెగిపడిన కాలు తొలగింపు పేలుడులో గాయపడిని నాయిని స్వరూప, నాయిని రజితను రోహిని ఆస్పత్రికి తీసుకువచ్చేటప్పటికీ స్వరూప కుడికాలు మోకాలు కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయింది. దీంతో డాక్టర్లు తెగిపోయిన భాగాన్ని వేరు చేశారు. ఆమెకు ముఖంపై కూడా బలమైన గాయాలయ్యాయి. ఇక స్వరూపతో పాటు రజితకు చికిత్స చేసి ఐసీయూ విభాగానికి తరలించారు. తీవ్ర గాయాలైన కంటి ప్రియాంకను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొలుత ప్రియాంకను రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లగా గాయాల తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోలేదని సమాచారం. ఎంజీఎంకు తీసుకెళ్లాక పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. బిట్స్ తయారు వజ్ర మ్యాట్రిక్స్ కంపెనీలో గ్రాðనైట్ రాళ్లను పాలిష్ చేయడానికి ఉపయోగించే బిట్స్ తయారుచేస్తారు. గురువారం ఐదుగురు పనికి వచ్చారు. గాయపడిన ముగ్గురు మహిళలు బిట్స్‌ను గమ్(బంక)తో అంటిస్తుండగా పేలుడు సంభవించింది. డైమండ్ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయన పదార్థాలు కలిపి మిషన్‌పై వివిధ పరిమాణాలలో బిట్స్ తయారు చేస్తారు. ముందే నిర్దేశించిన పరిమాణంలో రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. బిట్స్ తయారీకి వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉండదని చెబుతున్నారు. కాగా, బిట్స్‌ను రాజస్థాన్, ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. కంపెనీలో నాలుగు మిషన్లు ఉండగా గురువారం మూడు మిషన్లను మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. ఒక మిషన్‌లో ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఆన్ సమస్య వస్తే తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ తంబ రెండు రోజుల క్రితం వచ్చి రిపేర్ చేశారు. ప్రమాద సమయంలో తంబ కూడా కంపెనీలోనే ఉన్నాడు. రంగంలోకి క్లూస్ టీం పేలుడు సంభవించిన స్థలానికి లో క్లూసీ టీం సభ్యులు చేరుకుని నమూనాలు సేకరించారు. బిట్స్ తయారీకి సంబంధించి ఉపయోగించే డైమండ్ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయనాల శాంపిల్స్ సేకరించారు. బిట్స్‌తో పాటు బాధితుల సెల్ఫోన్లు కూడా సేకరించారు. క్లూస్ టీం సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నమునాలు సేకరించగా బాంబుస్క్వాడ్ బందం కూడా పరిశీలించింది. మిక్సింగ్ రూమ్‌లో ఏం ఉంది? బిట్స్ తయారీకి వినియోగించే పదార్థాలను ఒక గదిలో ఉంచారు. అందులో వివిధ రకాల సైజు బిట్స్ తయారీకి ఏ పదార్థం ఎంత మోతాదులో వినియోగించాలో నిర్ధారించి కలిపాకే మిషన్లపైకి తెస్తారు. మ్యాట్రిక్స్ కంపెనీలో 200, 400, 600, 800, 1500, 3000 రకాల బిట్స్ తయారుచేస్తారు. బిట్స్‌లో వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉంటే ప్రెషర్ మిషన్‌పై పేలొచ్చని భావిస్తున్నారు. కానీ బిట్స్ పూర్తిగా చల్లారాకే ప్లాస్టిక్ కవర్లు(గ్రిప్) గమ్‌తో అంటిస్తారు. గురువారం ఇదే పని చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో అసలు ఎలా జరిగిందంనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సాధారణంగా మిక్సింగ్ రూమ్‌లోకి ప్రియాంక, స్వరూప వెళ్తారని తెలిసింది. ఈ మేరకు క్లూస్‌టీం బందం శాంపిల్స్ సేకరించగా.. బిట్స్ తయారీ పదార్థాల్లో పేలుడు స్వభావం కలిగినవి ఉంటే మాత్రం ఎలాంటి అనుమతులు లేనందున యాజమాన్యం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. -
నోట్ల ఎర.. మద్యం మాయ!
‘రానున్న ఎన్నికల్లో ఓడిపోతే కోల్పోయేది అధికారమే కాదు.. ఏకంగా పార్టీయే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.. అందుకే ఏం చేస్తారో తెలీదు. ఎంతకైనా తెగించండి.. డబ్బు వెదజల్లండి. మద్యం ఏరులై పారించండి.. ప్రతి ఒక్కరినీ మేనేజ్ చేయండి. ఎలాగైనా గెలుపు కావాలి. అంతే..’ ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు, కార్పొరేట్ లాబీకి చేసిన ఎన్నికల మంత్రోపదేశం. దీంతో రంగంలోకి దిగిన కార్పొరేట్ మాయగాళ్లు జిల్లా టీడీపీని పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. డబ్బు మూటలు దించుతున్నారు. మద్యం బాటిళ్లను కుమ్మరిస్తున్నారు. సామాజిక వర్గాల ప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలకు నోట్ల ఎర వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని దాదాపు తేలిపోవడంతో టీడీపీ పూర్తిగా బరి తెగిస్తోంది. ఎన్నికలకు మరెన్నో రోజులు లేని సమయంలో తన అసలు రూపాన్ని బయటపెడుతోంది. డివిజన్ల వారీ గా నియోజకవర్గాలను తనకు సన్నిహితులైన కార్పొరేట్ లాబీకి చంద్రబాబు దత్తత ఇచ్చేశారు. పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావుల ఆధీనంలోని కార్పొరేట్ లాబీ జిల్లా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుంది. క్షేత్ర స్థాయిలోకి దూసుకుపోతోంది. ‘మీరు ప్రచారం చేసుకోండి. అసలు విషయమంతా మేం చూసుకుంటాం’అని అభ్యర్థులకు తేల్చి చెప్పేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే డివిజన్లవారీగా బాధ్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టెక్కలి డివిజన్ బాధ్యతలను నామా నాగేశ్వరరావుకు చెందిన గ్రానైట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ యాజమాన్యంతో కలసి టీడీపీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత చేపట్టింది. జిల్లా లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న ఆ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల పేరిట డబ్బు మూటలు దించుతోంది. ఒడిశాలో ఎన్నికలు ముగియడంతో అక్కడ నుంచి ఆర్థిక వ్యవహారాలను ఆపరేట్ చేస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి నేతలతో చర్చలు చేపట్టింది. టీడీపీకి మద్దతిస్తే భారీ నజరానాలు ఇస్తామని ప్రకటించింది. కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలోనే ఈ చర్చలు సాగాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అచ్చెన్నను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసుకున్న నేతలను డబ్బుతో కొనేయాలన్నది టీడీపీ కార్పొరేట్ లాబీ పన్నాగం. అదేవిధంగా పలాస నియోజకవర్గంలో టీడీపీని వ్యతిరేకిస్తున్న ఓ ప్రధాన సామాజికవర్గంతోపాటు మత్స్యకార గ్రామాలపై నోట్ల వల విసిరింది. ఈ మేరకు ఇప్పటికే డబ్బు మూటలతో టీడీపీ ప్రతినిధులు మత్స్యకార గ్రామపెద్దలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై మద్యం వల కూడా విసిరారు. భారీ ఎత్తున మద్యం సీసాలను గ్రామాల్లోకి పంపి హల్ చల్ చేస్తున్నారు. కానీ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్రలోభాలకు ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ గ్రామాల్లోకి వస్తే అంతు చూస్తామని మత్స్యకార పెద్దలు హెచ్చరించడంతో టీడీపీ ప్రతినిధులు తోకముడిచి జారుకున్నారు.శ్రీకాకుళం డివిజన్లో టీడీపీ అభ్యర్థుల తరపున డబ్బు పంపిణీ బాధ్యతను ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు సమాచారం. శ్రీకాకుళం పట్టణం, గార మండలాల్లో ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రాత్రివేళల్లో ప్రధాన సామాజిక వర్గాల పెద్దలను కలుస్తూ మంతనాలు సాగిస్తున్నారు. 100, 150 ఓట్లు ఉన్న చోటామోటా నేతలకు కూడా భారీగా ఎర వేస్తున్నారు. శ్రీకాకుళం గుజరాతీపేటలోని నాలుగు వార్డుల్లో కాస్తో కూస్తో పట్టున్న ఓ నేతకు భారీ మొత్తాన్నే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థికి సహకరించనని ఇటీవల తేల్చిచెప్పారు. దాంతో ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేట్ లాబీ పెద్ద మొత్తాన్నే ఎరవేసింది. గార మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో కూడా టీడీపీ నోట్ల కట్టలు దించుతోందని సమాచారం. ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామాలవారీగా టార్గెట్లు నిర్ణయించి నోట్ల కట్టలు దించుతున్నారు. ఇక నరసన్నపేట నియోజకవర్గం కోసం ఎంతైనా ఖర్చు చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నేతలను మేనేజ్ చేసేందుకు ఆయన భారీ ఆఫర్లే ఇస్తున్నారని తెలిసింది. తాను నేరుగా రంగంలోకి దిగకుండా కార్పొరేట్ లాబీ ప్రతినిధులను ఆ నేతల వద్దకు పంపుతున్నారు. అధికారుల తీరుపై అనుమానాలు టీడీపీ కార్పొరేట్ లాబీ యథేచ్ఛగా నోట్ల పందేరానికి బరితెగించినా అధికార యంత్రాంగం కనీస స్థాయిలో స్పందించడం లేదు. టెక్కలిలో డబ్బు మూటలు దించారన్న విషయం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఆ పార్టీ నేతల వాహనాలనుగానీ, ఇళ్లనుగానీ పోలీసులు ఇంతవరకు తనిఖీ చేయనే లేదు. మత్స్యకార గ్రామాల్లో టీడీపీ ప్రతినిధులు డబ్బు మూటలతో తిరుగుతున్నా స్పందనే లేదు. అధికార యంత్రాంగం టీడీపీ పట్ల ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందన్నది సందేహాస్పదంగా మారింది.