Karimnagar: గ్రానెట్‌ కంపెనీలకు ఈడీ ఝలక్‌.. ఉప ఎన్నిక ఎఫెక్టా..! | ED Issued Notices To 9 Granite Companies In Karimnagar | Sakshi
Sakshi News home page

Karimnagar: గ్రానెట్‌ కంపెనీలకు ఈడీ ఝలక్‌.. ఉప ఎన్నిక ఎఫెక్టా..!

Published Wed, Aug 4 2021 1:21 PM | Last Updated on Wed, Aug 4 2021 1:34 PM

ED Issued Notices To 9 Granite Companies In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: గ్రానైట్‌ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి పంజా విసిరింది. కరీంనగర్‌లోని 9 గ్రానైట్‌ సంస్థలకు నోటీసులు జారీచేసి ఝలక్‌ ఇచ్చింది. ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెవ) నిబంధనలు ఉల్లంఘించారంటూ కేంద్ర ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈడీ దృష్టి సారింంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘిం మోతాదుకు మించి విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతోపాటు సీనరేజీ చార్జీలు ఎగవేతపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కేంద్రానికి 2019 జూలైలో ఫిర్యాదు చేశారు.

సీనరేజీ చార్జీలు ర.749 కోట్లకుపైగా ప్రభుత్వానికి చెల్లించకుండా వెసం చేశారంటూ ఎంపీ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలింన ఈడీ.. ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపై విచారించే క్రమంలో కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్‌ పోర్టుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలింంది. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చూపింన వాటికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేకుండా పోయింది. గ్రానైట్‌ ఎగుమతుల వివరాలు నిర్ణీత సమయంలో తెలపాలంటూ ఈడీ కరీంనగర్‌లోని గ్రానైట్‌ సంస్థలకు నోటీసులు పంపింంది. 

9 గ్రానైట్‌ కంపెనీలకు నోటీసులు..
కరీంనగర్‌ జిల్లాలోని తొమ్మిది కంపెనీలు ఈ మేరకు నోటీసులు అందుకున్నాయి. గ్రానైట్‌ విదేశాలకు ఎంత మేరకు ఎగుమతి చేశారో వివరాలు అందించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. గతంలో వెళ్లిన ఫిర్యాదుల దృష్ట్యా సముద్ర మార్గంలో గ్రానైట్‌ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. సీనరేజీ ఫీజు రపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నవెదు చేశారు. సీనరేజీ ఫీజును నాడు ర.125 కోట్లుగా నిర్ణయించారు. వాటిని చెల్లించకపోవడంతో దీనిపై ఐదు రెట్ల అపరాధ రుసుం వి«ధించారు. దీంతో ర.749 కోట్లకు పైగా గ్రానైట్‌ వ్యాపారులు చెల్లించాలని మైనింగ్‌ అధికారులు నోటీసులిచ్చారు. అంతేగాకుండా క్వారీల అనుమతులు నిలిపివేయడంతో కొంతమంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలతోపాటు మైనింగ్‌ చట్టం ప్రకారం అప్పిలేట్‌ అధికారికి విన్నవించుకోగా సీనరేజీ ఫీజును 1+5 బదులు 1+1గా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో కొంతమంది క్వారీ వ్యాపారులు చెల్లింపులు చేయగా మరికొంత మంది కోర్టుల సహకారంతో క్వారీలు నడుపుతున్నారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలో దిగి నోటీసులు జారీ చేయడంతో మరోసారి గ్రానైట్‌ వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారింది. తనిఖీలు వ్యాపారుల్లో కలకలం రేపాయి.

ఉప ఎన్నిక ఎఫెక్టా..!
టీఆర్‌ఎస్‌ పార్టీలో సీఎం కేసీఆర్‌ తర్వాత స్థానంలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భముల సంబంధింన వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కోవడంతో మంత్రి వర్గం నుం బర్తరఫ్‌ అయ్యారు. అనంతరం హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీల మధ్య ఎన్నికల షెడ్యల్‌ రాకముందే నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తుండడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర స్థాయి, కేంద్రస్థాయి అధినాయకత్వం హుజూరాబాద్‌ ఎన్నిక విషయం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తనే ఉంది. 

ఈటల రాజీనామా చేసిన మరుసటి రోజు నుండే టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం హుజూరాబాద్‌పై దృష్టిసారించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపి ఈటల వెంట 20 సంవత్సరాలుగా ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులను, బీజేపీ నాయకులను ఆకర్షిస్తూ టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా హుజూరాబాద్‌కు చెందిన నాయకులకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. దళితబంధు పథకాన్ని సైతం ఇక్కడి నుండే సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌ పైనే పడింది.  ఉప ఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి కీలకంగా వ్యవహరిస్తుండడం, కరీంనగర్‌లో ఉన్న అతనికి సంబంధించిన గ్రానైట్‌ సంస్థలకు ఈడీ నోటీసులు రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది హుజూ రాబాద్‌ ఉప ఎన్నిక ఎఫెక్టా అని పలువురు అనుకుంటున్నారు.

నోటీసులు అందుకున్న కంపెనీలు
► శ్వేత ఏజెన్సీ 
► ఏఎస్‌ షిప్పింగ్‌
► జేఎం బ్యాక్సీ 
► మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌ 
► కేవీఏ ఎనర్జీ 
► అరవింద్‌ గ్రానైట్‌ 
► శాండియా ఏజెన్సీస్‌ 
► పీఎస్‌ఆర్‌ ఏజెన్సీస్‌ 
► శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement