ముంబై బయల్దేరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తుది ఒప్పందం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ముంబై బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు తుది ఒప్పందం చేసుకోనుంది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట' ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేయనున్నారు.
కాగా, మహా ఒప్పందాన్ని స్వాగతిస్తూ జూలపల్లి నుంచి మేడిగడ్డ వరకు టీఆర్ఎస్ యూత్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో 1500 బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఈ మహా ఒప్పందాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో నల్ల జెండాలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.