Great leader
-
మరపురాని మహానేత.. ఇడుపులపాయంలో నివాళులర్పించిన జననేత (ఫొటోలు)
-
ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్
-
సీఎం జగన్ విజనరీ ఉన్న నాయకుడు: సౌరభ్ గౌర్
-
మహానేత వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి
కాజీపేట రూరల్ : మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని శుక్రవా రం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయం లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు రవి, నాయకులు చందా హరికృష్ణ, పి.ప్రభాకర్, ముజఫరుద్దీన్ ఖాన్, పి.సంపత్, సంతో ష్, కమలాకర్, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరం: కిరణ్
నల్లజాతి సురీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జాతీ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సందర్బంగా మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్బంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ...మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరమని కిరణ్ అభివర్ణించారు.మండేలా మృతి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. నెల్సన్ మండేలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నారని తెలిపారు. నెల్సన్ మండేలాకు వచ్చిన పురస్కారాలకు లెక్కలేదని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ... మండేలా మృతితో ఓ యుగపురుషుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మండేలా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వర్ణ వివక్షపై పోరాడే క్రమంలో మండేలా మరణానికి వెరవకుండా పోరాటం సాగించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బతుకంతా పోరాటానికి ఆంకితం చేసిన మహానుభావుడు అని మండేలా పోరాటాన్ని కేటీఆర్ కొనియాడారు. -
మహుత్మా..మళ్లీ రా!
సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు బాపూజీ. అహింసామార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మడమతిప్పకుండా ముందుకు సాగిన మహానేత గాంధీజీ. ఆయన ప్రబోధించిన సత్యం, ధర్మం, అహింస సూత్రాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయాలు. అందుకే మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని, బాపూజీ ఆశయాలు సాధించాలని మనం ఇప్పటికీ అంటుంటాం. కానీ.. ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నాం. ఫలితం అంతా అరాచకం. నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..