Greens Farms
-
Sagubadi: ప్రకృతి ఆహారం.. పక్కా లోకల్!
తొలకరితో పాటే వచ్చే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (జూన్ 5) ఈ ఏడాది లక్ష్యం: ’భూముల పునరుద్ధరణ, ఎడారీకరణను, కరువును తట్టుకునే దిశగా పనిచేయటం’. మట్టిలో సేంద్రియ కర్బనం 0.3%కి పడిపోయింది. దీన్ని పెం΄÷ందించుకోవటానికి, పనిలో పనిగా భూతాపాన్ని తగ్గించడానికి సేద్యం మొత్తాన్నీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం తప్ప మరో మేలైన దారి లేదన్నది నిపుణుల మాట.ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు భూమిని శాశ్వతంగా బాగుచేసుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వారు పండించిన అమృతాహారాన్ని స్థానిక మార్కెట్లలోనే నేరుగా ప్రజలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్రకృతి/సేంద్రియ రైతులతో పాటు ఈ ఆహారాన్ని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు కూడా పర్యావరణ పరిరక్షణకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార రంగంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక మార్పుల గురించి ప్రత్యేక కథనం..!ప్రకృతి వ్యవసాయంలో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) విస్తారంగా సాగవుతోంది. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకంగా పండించిన ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్థానిక మార్కెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో ఏపీ రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది.ప్రకృతి వ్యవసాయంలో స్థానిక రైతులు పండించిన ఆహారోత్పత్తులను స్థానిక ప్రజలకే తొలుత అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. స్థానిక మార్కెట్లలో, రైతుబజార్లలో, వైఎస్సార్ చేయూత మహిళా రూరల్ మార్ట్‌లలో రైతుల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమం ్రపారంభమైంది. విజయవాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రతి సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు తరలి వస్తారు కాబట్టి అదే రోజు నమ్మకమైన ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, సాధారణ మార్కెట్‌తో పోల్చినప్పుడు ఇక్కడ 10–15% అదనపు ధర రైతులకు లభిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ సీనియర్ మార్కెటింగ్ లీడ్ బి. ప్రభాకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్న ప్రకృతి వ్యవసాయదారులు427 మండల కేంద్రాల్లో అమ్మకాలు..ఏపీలోని 26 జిల్లా కేంద్రాలకు గాను 22 చోట్ల, 663 మండలాలకు గాను 427 మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను రైతులు అమ్ముతున్నారని ప్రభాకర్ వివరించారు. అదేవిధంగా, 113 మునిసిపాలిటీలకు గాను 24 మునిసిపాలిటీలలోనూ తాము పండించే ఉత్పత్తులను గత 2–3 నెలలుగా ప్రకృతి వ్యవసాయదారులు విక్రయిస్తున్నారు. వైఎస్సార్ చేయూత మహిళా గ్రామీణ మార్ట్లు 47 ఉండగా ఇప్పటికి 32 మార్ట్‌లలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తెచ్చారు.ఆకర్షిస్తున్న ‘కంటెయినర్ రైతుబజార్లు’..ఏపీలో 96 రైతుబజార్లు పట్టణ ్రపాంత వినియోగదారులకు నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో ఇప్పటికే 47 రైతుబజార్లలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే స్టాల్స్ ఏర్పాటయ్యాయి. 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5 రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో అవని ఆర్గానిక్స్ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక కంటెయినర్లు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించటం ఇటీవలే ్రపారంభించారు. పట్టణ ్రపాంతీయులను ఈ కంటెయినర్ రైతుబజార్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయని, మరో 33 రైతుబజార్లలో జూన్ రెండోవారంలో కంటెయినర్ దుకాణాలను ్రపారంభించనున్నామని ప్రభాకర్ వివరించారు. మున్ముందు దశలవారీగా ప్రతి రైతుబజారులోనూ కంటెయినర్ దుకాణాలు తెరుస్తామన్నారు.లోకల్ మార్కెటింగే మా వ్యూహం!రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తులతో పోల్చితే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ఈ ఆహారోత్పత్తులను స్థానిక మార్కెట్ల ద్వారా సాధారణ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటమే మా మార్కెటింగ్ వ్యూహం. మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.– టి. విజయకుమార్, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఏపీఆర్వైఎస్ఎస్.గ్రామాల్లో ‘ఫుడ్ బాస్కెట్లు’!ఏపీలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యుల కుటుంబాలలోని వారందరికీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను ప్రకృతి వ్యవసాయంలో పండించినవే అందించాలన్న లక్ష్యంతో ఫుడ్ బాస్కెట్స్ కార్యక్రమానికి రైతుసాధికార సంస్థ 7 నెలల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి 76 గ్రామాల్లో ఈ ఫుడ్ బాస్కెట్ స్కీమ్ ్రపారంభమైందని, త్వరలో 129 గ్రామాలకు విస్తరించనున్నామన్నారు. వీరికి ఆయా గ్రామాల్లో పండించేవి చాలకపోతే, పక్క గ్రామాలు, మండలాల నుంచి సేకరించి అందిస్తున్నారు.గ్రామీణులకు తొలి ్రపాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ఫుడ్ బాస్కెట్స్ అందిస్తుండటం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తున్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిబ్బంది, సందర్శకులకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ విక్రయించేందుకు జూన్ రెండో వారం నుంచి ప్రత్యేక స్టాల్‌ను ్రపారంభించనున్నామని ప్రభాకర్ (97714 63539) చెప్పారు. స్థానిక మార్కెట్ల ద్వారా స్థానిక ప్రజలకు ప్రకృతి ఆహారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవటం సంతోషదాయకం.– బి.ప్రభాకర్, సీనియర్ మార్కెటింగ్ లీడ్, ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ -
ఆరోగ్యం వెం‘బడి’...
సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 12 మందితో కమిటీ కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు. ఇతరులు తీసుకోకుండా.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్ గార్డెన్‌కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సాగు చేస్తున్న కూరగాయలు సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్‌పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. – పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు ఎంతో రుచికరం మా స్కూల్లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. –పూజ, 7వ తరగతి -
బతుకులు బుగ్గి
♦ ‘క్వారీ కోరల్లో పచ్చని పొలాలు ♦ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు ♦ పేలుళ్లకు బీటలువారుతున్న ఇళ్లు ♦ అనారోగ్యాల పాలవుతున్న జనం ఒకప్పుడు పచ్చని పొలాలు...చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామాలు ఉండేవి. ఊట, కొండగెడ్డల నీటితో పంటలతో కళకళలాడే ఆ గ్రామాల్లో కొంతకాలంగా అలజడి మొదలైంది. క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి నెత్తిన పడుతుందోనన్న భయం...ఊటనీరురాక ఏటా ఎండిపోతున్న పొలాలు...చివరికి గ్రామాలనే ఖాళీచేసి వెళ్లిపోదామనే దుస్థితి. చోడవరం : వ్యవసాయమే ఆధారంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు మైనింగ్ మాఫియా కోరలు చాస్తోంది. కొండలు, గుట్టలు పేల్చి సొమ్ముచేసుకుంటున్న కొందరు పచ్చని పొలాలను బుగ్గిపాలు చేస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల అండదండలతో కొండలను ఆక్రమిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు, అపరాలు పండించే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, రావికమతం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, నర్సీపట్నం, మాకవరంపాలెం ప్రాంతాలు ఇప్పుడు క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం,ఎరుకువాడ, చింతలూరు, విజెపురం, కె.కోటపాడు మండలం దాలివలస, పిండ్రంగి, రావికమతం మండలంలో మరుపాక, కొట్నాబిల్లి, అనకాపల్లి మండలంలో మార్టూరు, బవులవాడ, దర్జీనగర్, శంకరం, మామిడిపాలెం గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. క్వారీల వల్ల గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం కోల్పోయి, ఊరులోకి ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని బండరాళ్ల మధ్య, దుమ్ముదూళి మింగేస్తూ అనుక్షణం ఆందోళనతో జీవిస్తున్నారు. ఒకప్పుడు ఈ గ్రామాలు నిత్యం పంటలతో కళకళలాడుతూ ఉండేవి. క్వారీలు పెరిగిపోవడంతో కొండ ఊటగెడ్డలన్నీ మూసుకుపోయాయి. ఇలా నీటి సౌకర్యం లేక ఈ ప్రాంతాల్లో 20శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మాడుగుల మండలం కృష్ణాపురం కొండ నుంచి ఊటగెడ్డల్లో నిత్యం నీరు పారేది. పంటలు బాగా పండేవి. అటువంటి ఈ గ్రామం ఇప్పుడు పంటలు నాశనమై, క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాల్సిన దుస్థితి. ఈ గ్రామం సమీప కొండలో నల్లరాయి ఉండటంతో ఒకే అనుమతితో ఇక్కడ పదుల సంఖ్యలో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో రాజులకాలం నుంచి ఉన్న తాగునీటి కోనేరును సైతం క్వారీ యజమానులు కప్పేశారు. కొండ నుంచి పంట కాలువలకు వచ్చే నాలుగు ఊటగెడ్డలనూ కప్పేయడంతో సుమారు 200ఎకరాలకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. వీరవిల్లి అగ్రహారం శివారు ఎరుకువాడపై గ్రానైట్ క్వారీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దపెద్ద రాళ్లు పచ్చని పొలాల్లోకి పడి పంటలు నాశమైపోతున్నాయి. కె.కోటపాడులో క్వార్జ్ రాయి క్వారీలు, మరుపాక, కొట్నాబిల్లి గ్రామాల్లో నల్లరాయి మెటర్ క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. గంధవరం సమీపంలో కొండపై అక్రమ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఇక చోడవరం-అనకాపల్లి రోడ్డులో అయితే చెప్పనక్కరలేదు. ఈ రోడ్డులో గంథవరం నుంచి తుమ్మపాల వెళ్లేవరకు దారిపొడవునా ధన్..ధన్ అంటూ కొండలు నిత్యం పేలుతూనే ఉంటాయి. నిత్యం రాయి క్రషింగ్‌తో బుగ్గి ఆయా గ్రామాలను, పంటలను ఆవరిస్తోంది. వాతావరణం పూర్తిగా కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. వరి,చెరకు, కంది, ఆపరాల పంటలతోపాటు మామిడి, జీడి తోటలు ఈ బూడిదపడి ఎర్రగా మారిపోయి దిగుబడి తగ్గిపోతోంది. క్రషర్బుగ్గితో చిన్నారులు, వృద్ధులు తరుచూ ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా కిడ్నీల వ్యాధులకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ఐదేళ్లలో సుమారు 100 మంది వరకు కిడ్నీల వ్యాధికి గురయ్యారంటే కమ్ముకున్న ఈ కాలుష్యం ప్రజాఆరోగ్యాన్ని ఎలా క బళిస్తోందో అర్ధమవుతుంది. పేలుళ్ల శబ్ధాలకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ఎం. కృష్ణాపురం, మార్టూరు, బవులవాడ గ్రామ ప్రజలైతే ఒక దశలో గ్రామాలనే వదిలిపోవాలా... అంటూ ఆందోళనలు సైతం చేపట్టిన సంఘటనలు ఉన్నాయి.అక్రమ బ్లాస్టింగ్‌లకు ఐదేళ్లల్లో 18మంది వరకు మృతిచెందారు. అనేక మంది శరీర అవయవాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ బ్లాస్టిం గ్లు నిరువరించడంతోపాటు క్రషర్ల నుంచి దు మ్ము బయటికి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఉన్న క్వారీల లీజను రద్దుచేయడంతోపాటు కొత్తక్వారీలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.