మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే కమల్
చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరో రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు శుక్రవారం వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని తన ఇంట్లో మెట్లు దిగుతూ కమల్‌హాసన్ జారి పడ్డారు. దీంతో ఆయన కుడికాలికి, వెన్నెముకకు దెబ్బతగిలింది.
దాంతో కమల్ కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని గ్రీన్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి తీరలించారు. కమల్ కుడి కాలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయన కాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. కమల్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.