మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే కమల్ | Kamal Hassan admitted to hospital with leg fracture | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే కమల్

Published Fri, Jul 15 2016 4:56 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Kamal Hassan admitted to hospital with leg fracture

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరో రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు శుక్రవారం వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని తన ఇంట్లో మెట్లు దిగుతూ కమల్హాసన్ జారి పడ్డారు. దీంతో ఆయన కుడికాలికి, వెన్నెముకకు దెబ్బతగిలింది.

దాంతో కమల్ కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని గ్రీన్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి తీరలించారు. కమల్ కుడి కాలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయన కాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. కమల్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement