greeting
-
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
సన్‌రైజర్స్ తొలి మ్యాచ్.. విక్టరీ విషెస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అసలైన మజాను ఇస్తోంది. ముగిసింది రెండో మ్యాచ్‌లు అయినా.. క్రికెట్ కిక్‌ను అందించింది. ఇక తమ అభిమాన జట్ల మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక హాట్ పేవర్ టీమ్‌గా బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య ఐపీఎల్ సీజన్ 2020 తొలి మ్యాచ్ నేడు (సోమవారం) జరుగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు జట్టు సన్ రైజర్స్ ఈ సీజన్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగుతోంది. దీంతో నేటి తొలిమ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) దీనిలో భాగంగానే టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ఆడుతున్నందున విషెస్ తెలియజేసిన విక్టరీ.. తమ మద్దతు ఎప్పుటికీ ఉంటుందని మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్‌పై వెంకీకి మొదటి నుంచీ మక్కువ ఎక్కువే. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే మైదానంలో వాలిపోవాల్సిందే. ఇక సొంత జట్టుకు మద్దతు విషయంలో ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు వెంకటేష్‌తో పాటు టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్‌తో సహా మరికొంత మంది సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్ చెప్పారు. ఇక ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం.. విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది. ఇక తొలిలో విజయం కోసం ఇరు జట్లూ వ్యహాలను సిద్ధం చేశాయి. (రైజింగ్‌కు వేళాయె...) -
నమస్కార వైభవం
• ధర్మసోపానాలు మన సంప్రదాయంలో నమస్కార వైభవం అని ఒకమాట ఉంది. ఒకరికొకరు నమస్కరించు కుంటారు. నమస్కారం చేయడానికి వినయం ఉండాలి. ఒకరి దగ్గరకు వెళ్ళి నేలమీదపడి నమస్కరించారనుకోండి. నేలమీద పడిపోయినవాడిదికాదు బాధ్యత, ఎవడు నిలబడి ఉన్నాడో వాడిది కర్తవ్యం. వాడు వచ్చి నేలమీద ఎందుకుపడిపోయాడు? ‘‘అయ్యా! ఎంత కింద పడిపోవాలో అంత కిందపడిపోయాను. ఇంకా పడిపోవడానికి అవకాశంలేదు. ఇప్పుడు నన్ను పైకెత్తగలిగిన వారెవరు? పడకుండా నిలబడిన మీరే. అందుకని మీరే ఎత్తాలి’’ అన్నది పడిపోయినవాడి భావన. అందువల్ల ఎవడో వచ్చి కాళ్ళమీద పడి నమస్కారం చేస్తే, పొంగిపోనక్కరలేదు. ఉలిక్కిపడాలి... ‘‘బాబోయ్! నాకు ఇప్పుడు కొత్త కర్తవ్యం అంటుకుంది’’అని. వంగి రెండు భుజాలు పట్టి పైకెత్తుతాడు. అంటే... ‘‘నిన్ను నిలబెట్టే కర్తవ్యం నేను పుచ్చుకుంటున్నాను. నీవు పతితుడవు కాకుండా నేను దిద్దుతాను... లే...’’ అని ఆయన అభయం ఇస్తాడు. నమస్కారం అంత తేలికయిందేమీ కాదు... పడిపోయానని అంగీకరించడానికి వినయం ఉండాలి, అహంకార పరిత్యాగం ఉండాలి. నమస్కారం చేసేటప్పుడు ఎవరు పెద్దలో వారికి నమస్కరించాలి. వారిలో కూడా ప్రాధాన్యత – జ్ఞానంలో పెద్దవారికి. లోకమంతా సన్యాసికి నమస్కరిస్తే, సన్యాసి మాత్రం ఎక్కువ చాతుర్మాస్యదీక్షలుచేసిన సన్యాసికి నమస్కరిస్తాడు. అందుకే కంచి పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారున్నప్పుడు ఆయన చేత నమస్కారం అందుకోదగిన వ్యక్తి ఈ లోకంలో లేడు. కారణం–అయన 13వ ఏట సన్యసించి, నూరేళ్ళు జీవించడంతో 83 చాతుర్మాస్య దీక్షలు చేయగలిగారు. అప్పటికి అన్ని చేసిన వాళ్ళులేరు. అది అపూర్వం. మహాస్వామి ఒక మాటంటుండేవారు. ‘‘నేను కలియుగంలో పుట్టినందుకు సంతోషిస్తున్నా. త్రేతాయుగంలో పుట్టనందుకు ఆనందపడుతున్నా. ఎందుకంటే త్రేతాయుగంలో పుట్టి ఇలా సన్యాసాశ్రమంలో ఉండి ఉంటే రాముడికి నమస్కారం చేసుకునే అవకాశం నాకు లేకుండాపోయేది. కలియుగం కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోగలుగుతున్నా’’...అనేవారు. అంతటి వినయశీలి. ఎక్కడ జ్ఞానముంటుందో అక్కడ వినయముంటుంది. కంచి మహాస్వామి వారి తల్లిగారిపేరు మహాలక్ష్మమ్మ. స్వామివారికి ఒక అలవాటు ఉండేది. వారు ప్రతిరోజూ ఎక్కడ ఉన్నా సరే, కలవైవంక తిరిగి నమస్కారం చేసేవారు. కలవై వారి గురుస్థానం. వారు శతాయుష్కులైన తర్వాత ఒకరోజు పక్కన పరిచారకలు కూడా లేరు. జయవిజయులు చెన్నై వెడుతూ అక్కడ వేదపాఠశాలలో పెట్టడానికి మహాలక్ష్మమ్మగారి చిత్తరువు తీసుకెడుతున్నారు. మహాస్వామివారు ఆ పటాన్ని చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూసారు. అప్పటికే వారు మౌనదీక్షలో ఉన్నారు. ఆదేపనిగా చూస్తూ ఆమ్మ రెండుపాదాలు (పటంమీద)చేతులతో తడుముతూ తన తలమీద పెట్టుకున్నారు. పటం తిరిగి ఇచ్చి లేచి నిలబడి కలవైవంక తిరిగి గురువుగారికి నమస్కారం చేసారు. అవే వారు చేసిన ఆఖరి నమస్కారాలు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుని శరీరం విడిచిపెట్టేసారు. బ్రహ్మీభూతులయ్యారు. అంటే మహాస్వామి అంతటివారు తల్లి విషయంలో అంత అనుగ్రహాన్ని చూపించారు. -
మన్మోహన్ సింగ్‌కు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మన్మోహన్ సింగ్ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. మోదీ స్వంయంగా మన్మోహన్‌తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ఘా అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. Warm birthday wishes to Dr. Manmohan Singh ji. May God bless him with a long and healthy life. — Narendra Modi (@narendramodi) September 26, 2016 -
బాలచంద్ర ప్రస్థానం ఆదర్శనీయం
గుంటూరు ఈస్ట్ : నాటకరంగానికి 50 సంవత్సరాలు విశేష సేవలందించిన బాలచంద్రరావు కళా ప్రస్థానం మరింత ఉన్నతంగా సాగాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆకాంక్షించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖ నటులు ,దర్శకులు , విశ్వశాంతి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఎమ్ .బాలచంద్రరావు నాటక రంగంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్యేల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కళలను పాఠ్యాంశాలలో చేర్చి మార్కులు కేటాయిస్తేనే వాటికి ఆదరణ లభిస్తుందన్నారు. కళలను పరిరక్షించాలని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. అమరావతి ఆర్ట్స్ అధ్యక్షుడు కావూరి సత్యనారాయణ మాట్లాడుతూ నాటక రంగం సమాజం కోసమే పాటుపడిందని అటువంటి ఉన్నతమైన రంగంలో 50 సంవత్సరాలు కృషి చేయడం గొప్ప విషయమన్నారు. బాలచంద్రరావు తమ సంస్థ ద్వారానే కాక ఇతర సంస్థలకు ఎంతో సహకారాన్ని అందించి నాటక రంగానికి ఎనలేని సేవలు చేసారన్నారు. తొలుత ప్రముఖ నాట్యకళాకారిణి కోకా విజయలక్ష్మి , కె.సాయిమంజీర, మోహన శృతి కీర్తన సాంప్రదాయ నృత్యం చేసి అలరించారు. అట్ల రామకృష్ణారెడ్డి దుర్యోదనుడు ఏకాపాత్రాభినయంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. బొబ్బిలి యుద్ధంలోని బుస్సీ ఘట్టాన్ని ప్రదర్శించారు. ఎమ్.బాలచంద్రావు దంపతులను అమరావతి ఆర్ట్స్ ఇతర నాటక సంస్థల ఆధ్వర్యంలో బంగారు కడియం, గొలుసు, మోమెంటోలతో సత్కరించారు. సభకు నటులు దర్శకులు ఎమ్విఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. పారిశ్రామిక వేత్త కళ్లం హరినాథరెడ్డి, కారుమూరి సీతారామయ్య, నూతలపాటి సాంబయ్య, సిరిగిరి సాంబశివరావు, వంగల సుందరరామిరెడ్డి, ఆలయ చైర్మన్ సి.హెచ్.మస్తానయ్య, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. -
ఔను... వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు!
అది ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అవార్డుల వేడుక. అలనాటి స్టార్స్ రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్ల నుంచి ఈ తరం స్టార్స్ రణ్వీర్ సింగ్, వరుణ్ ధావన్, దీపికా పదుకొనే, సోనమ్‌కపూర్ వరకు ఎంతో మంది తారలు ఈ వేడుకకు హాజరై, ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయింది. అవార్డులూ, ఆటపాటలనూ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీల దృష్టంతా హఠాత్తుగా ముందు వరుసపై పడింది. అక్కడ అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆ వేడుకకు వచ్చిన నటి రేఖ ఆమె పక్కకు వచ్చారు. ఇప్పుడు వీళ్లిద్దరూ పలకరింపుగా నవ్వుకుంటారా? ఎప్పటిలానే పళ్లు పటపటలాడిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్ చేస్తే.. జయ, రేఖ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జయాబచ్చన్ పక్కనే కూర్చొన్నారు రేఖ. నిన్న మొన్నటివరకూ కనీసం హాయ్ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడని ఆ ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. ఇది అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమితాబ్ బచ్చన్-రేఖల మధ్య ఎఫైర్ ఉందని కొన్ని దశాబ్దాలుగా హిందీ పరిశ్రమలో ఓ టాక్. జయాబచ్చన్‌ని పెళ్లి చేసుకున్నాక రేఖతో అమితాబ్ కలిసి నటించకపోవడానికి కారణం కూడా అదే అంటారు. చివరికి జయ-రేఖ మాట్లాడటం కూడా మానేశారు. ఎక్కడైనా ఎదురుపడితే చురుగ్గా చూసుకోవడం తప్ప పలకరింపుగా నవ్వుకున్న దాఖలాలు లేవు. అలా ఏళ్ల తరబడి ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఇలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం టాపిక్ అయ్యింది.