Grievous Murder
-
ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టి..
- గుర్తుతెలియని యువకుని దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన హంతకులు - పెట్రోల్‌తో మృతదేహం దహనం - ఉలిక్కిపడిన ఈపూరుపాలెం చీరాల : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈపూరుపాలెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్య జరగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. పట్టణ ప్రాంతాల్లోని హత్యల సంస్కృతి రూరల్ గ్రామాలకు పాకడంతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే రోడ్డుపై మృతదేహాన్ని తగలబెట్టడం స్థానికులను కలవరపరిచింది. ఈ సంఘటన మండలంలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ నుంచి తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీకి వెళ్లేదారిలో ఉన్న కాలువకట్టపై ఆదివారం జరిగింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. చీరాల రూరల్ సీఐ ఎండీ ఫిరోజ్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని యువకుడిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి ఆదివారం తెల్లవారు జామున తగులబెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈపూరుపాలెంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ డి.నరహర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి పోలీసు జాగిలాన్ని పిలిపించి క్షుణ్ణంగా తనిఖీలు చేయించగా పోలీసు జాగిలం బైపాస్ రోడ్డు వరకు వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టుకుని వచ్చి తగలబెట్టారని తమ పరిశీలనలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. యువకుడు దారుణ హత్యకు గురవ్వడంతో పాటు పెట్రోల్ పోసి తగులబెట్టారని సమాచారం దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. 90 శాతం వరకు కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఫిరోజ్ తెలిపారు. సంఘనా స్థలాన్ని ఈపూరుపాలెం వీఆర్వోలు విద్యుల్లత, రాము, కరీముల్లా పరిశీలించి పంచనామా నిర్వహించారు. -
మాజీ నక్సలైట్ దారుణ హత్య
పినపాక, న్యూస్‌లైన్: మండల పరిధిలోని జానంపేటలో శనివారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. కరీంనగర్ జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర శ్రీనివాసరావు(35)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. ఏడూళ్ల బయ్యారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహముత్తారం గ్రామానికి చెందిన గండ్ర రంగారావు, సరోజ పెద్ద కుమారుడు శ్రీనివాసరావు. జానంపేటకు చెందిన దుగ్యాల నర్సింహరావు కూతురు సంధ్యతో తొమ్మిదేళ్ల క్రితం ఇతడితో వివాహం జరిగింది. కొంత కాలం కరీంగనర్‌లో నివాసం ఉన్న వీరు గత ఏడాది వరంగల్ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ సమేతంగా గురువారం అత్తగారిల్లు జానంపేటకు వచ్చిన శ్రీనివాసరావు రెండురోజులుగా బంధువుల ఇళ్లకు తిరిగాడు. జానంపేట నుంచి ముకుందాపురం వెళ్లే మార్గంలో భార్య అమ్మమ్మ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భార్య, కుమారుడితో కలిసి బస చేశాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వీరు నిద్రిస్తు గదిలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. భార్యను పక్కకు తోసేసి శ్రీనివాసరావు గొంతు కోశారు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించగా దుండగులు వారిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని ఇంటి నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి పడేశారు. అనంతరం కేరింతలు కొడుతూ కారు ఎక్కి పరారయ్యారు. హత్యకు కారణమేమిటి..? శ్రీనివాసరావు హత్యపై పను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 నుంచి 2008 వరకు శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లాలో ప్రతిఘటన గ్రూపు ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ప్రసాదన్న రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రతిఘటన గ్రూపులో బక్కన్న దళంలో పని చేసినట్లు తెలిసింది. 2008లో కరీంగనర్ పోలీసులకు శ్రీనివాసరావు లొంగిపోయాడు. అనంతరం కరీంనగర్ జిల్లాలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. భూ సెటిల్మెంట్లు కూడా చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో వరంగల్‌కు మకాం మార్చాడు. అక్కడా రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వరంగల్‌లో లిక్కర్ వ్యాపారం కూడా చేసే వాడని సమాచారం. శ్రీనివాసరావుపై కరీంనగర్, వరంగల్ జిల్లాలో పలు కేసులు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు, భూసెటిల్మెంట్ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ శ్రీనివాసరావు హత్యపై ఏడూళ్ల బయ్యారం పోలీసులు పలు కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. మణుగూరు, అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లు నర్సయ్య, డి.వేణుచందర్, ఏడూళ్ల బయ్యారం ఎస్సై కొండ్ర శ్రీనివాస్ సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పిం చి విచారణ చేపట్టారు. -
మహిళ దారుణ హత్య
మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణం బాపూజీనగర్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. దామరచర్ల మండలం అడవిదేవులపల్లికి చెందిన గోపగాని వెంకయ్య, లక్ష్మమ్మ(42) దంపతులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడకు వచ్చారు. బాపూజీనగర్‌లో స్థిరనివా సం ఏర్పాటు చేసుకొని సెంట్రింగు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాము, లక్ష్మణ్, కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటున్నారు. రోజు మాదిరిగానే వెంకయ్య, ఇద్దరు కుమారులు ఉదయం 9 గంటలకు తమ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనానికి వచ్చిన పెద్దకుమారుడు రాము తల్లి ఇంట్లో లేక పోవడంతో బయటకు వెళ్లి ఇరుగు పొరుగు వారిని విచారించాడు. తిరిగి ఇంట్లోకి వచ్చి చూడగా లక్ష్మమ్మ మం చం కింద అపస్మారకస్థితిలో పడి ఉం ది. దీంతో ఇరుగు, పొరుగు వారి సహకారంతో పైకిలేపి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే చనిపోయిందని చెప్పారు. నగల కోసమే ఘాతుకమా..? గుర్తుతెలియని వ్యక్తులు నగల కోసమే లక్ష్మమ్మను హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలి మెడ లో నాలుగున్నర తులాల పుస్తెల తా డు, 20 తులాల వెండి పట్టీలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మమ్మ నగ లు లాక్కునే క్రమంలో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. టీవీ కిందపడిపోయి ఉంది. వస్తువులు చిం దరవందరగా పడి ఉన్నాయి. దీంతో పాటు మృతురాలి మూతి, మోచేయి, మెడపై గాయాలు ఉన్నాయి. లక్ష్మమ్మ ను గొంతు నులిమి హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా లక్ష్మమ్మ మధ్యాహ్నం 11 గంటల సమయంలో తమతో మాట్లాడి వెళ్లిందని ఇరుగు పొరుగు మహిళలు తెలిపారు. ఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్రావులు పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ పేర్కొన్నారు.