మహిళ దారుణ హత్య | Woman grievous murder | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Published Sun, Nov 17 2013 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

Woman grievous murder

 మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్:   గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణం బాపూజీనగర్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. దామరచర్ల మండలం అడవిదేవులపల్లికి చెందిన గోపగాని వెంకయ్య, లక్ష్మమ్మ(42) దంపతులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడకు వచ్చారు. బాపూజీనగర్‌లో స్థిరనివా సం ఏర్పాటు చేసుకొని సెంట్రింగు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాము, లక్ష్మణ్, కుమార్తె ఉంది.
 
 కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటున్నారు. రోజు మాదిరిగానే వెంకయ్య, ఇద్దరు కుమారులు ఉదయం 9 గంటలకు తమ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనానికి వచ్చిన పెద్దకుమారుడు రాము తల్లి ఇంట్లో లేక పోవడంతో బయటకు వెళ్లి ఇరుగు పొరుగు వారిని విచారించాడు. తిరిగి ఇంట్లోకి వచ్చి చూడగా లక్ష్మమ్మ మం చం కింద అపస్మారకస్థితిలో పడి ఉం ది. దీంతో ఇరుగు, పొరుగు వారి సహకారంతో పైకిలేపి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే చనిపోయిందని చెప్పారు.
 
 నగల కోసమే ఘాతుకమా..?
 గుర్తుతెలియని వ్యక్తులు నగల కోసమే లక్ష్మమ్మను హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలి మెడ లో నాలుగున్నర తులాల పుస్తెల తా డు, 20 తులాల వెండి పట్టీలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మమ్మ నగ లు లాక్కునే క్రమంలో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. టీవీ కిందపడిపోయి ఉంది. వస్తువులు చిం దరవందరగా పడి ఉన్నాయి.

దీంతో పాటు మృతురాలి మూతి, మోచేయి, మెడపై గాయాలు ఉన్నాయి. లక్ష్మమ్మ ను గొంతు నులిమి హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా లక్ష్మమ్మ మధ్యాహ్నం 11 గంటల సమయంలో తమతో మాట్లాడి వెళ్లిందని ఇరుగు పొరుగు మహిళలు తెలిపారు. ఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌రావులు పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement