groom abscond
-
కిలేడీ మాస్టర్ ప్లాన్.. పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో పరార్!
లక్నో: వివాహం జరిగిన మరుసటి రోజునే వరుడికి షాక్ ఇచ్చింది ఓ నవ వధువు. ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది. ఆ తర్వాత వరుడికి ఫోన్ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పేసింది. ‘నేను నిన్ను ప్రేమించలేదు. నున్వు నాకు ఫోన్ చేయొద్దు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టుకెళ్లిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు వరుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన అక్టోబర్ 4నే జరిగినా.. బిల్హార్ పోలీస్ స్టేషన్లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదిర్చుతామని నమ్మించారు. అందుకు తమకు రూ.70వేలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి కుదిర్చారు. సెప్టెంబర్ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించారు. అక్టోబర్ 1న గయాలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరవింద్. అక్టోబర్ 4న తెల్లవారి నిద్రలేచే సరికి అతని భార్య కనిపించలేదు. ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం కనిపించలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్ చేసి తన కోసం వెతకొద్దని చెప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి -
పెళ్లి మండపం నుంచి వధూవరులు పరార్
సాక్షి, చెన్నై: కల్యాణ మండపం నుంచి వధూవరులు పరారైన ఘటన తమిళనాడులోని స్వామిమలైలో బుధవారం చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోగల చోళపురానికి చెందిన అళగర్ కుమార్తె దుర్గాదేవి(27), కోవిలాచ్చేరికి చెందిన ఆటో మెకానిక్ బాబురాజన్(33) మూడేళ్ల క్రితం వేలాంగన్నిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ కోవిలాచ్చేరిలో కాపురం పెట్టారు. ప్రస్తుతం దుర్గాదేవి నాలుగు నెలల గర్భిణి. అయితే తల్లిదండ్రులు చూసిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు బాబురాజన్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి కుంభకోణం మహిళా పోలీసుస్టేషన్లో దుర్గాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబురాజన్‌ను పిలిచి మాట్లాడారు. కాగా, తన వివాహానికి పోలీసులు అడ్డుపడుతున్నారని అతడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడగా కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు స్వామిమల ఆలయంలో బుధవారం బాబురాజన్కు, వలంగమాన్ సమీపంలోగల విసలూరుకు చెందిన యువతితో బుధవారం వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలిసి దుర్గాదేవి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో దుర్గాదేవి న్యాయవాదిని తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దీంతో స్పందించిన కుంభకోణం తాలూకా పోలీసులు స్వామిమలై ఆలయానికి వెళ్లి బాబురాజన్ పెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసి మండపంలో ఉన్న బాబురాజన్, పెళ్లికుమార్తె.. ఆమె బంధువులు అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పెళ్లికి గంట ముందు పారిపోయిన వరుడు
-
పెళ్లికి గంట ముందు పారిపోయిన వరుడు
సికింద్రాబాద్: వరుడు పారిపోవడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఘటన సికింద్రాబాద్ లో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లి ముహూర్తానికి గంట ముందు పెళ్లికొడుకు సతీశ్ పారిపోయాడు. తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పి అతడు పరారయ్యాడు. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నిరాశగా వెనుదిరిగారు. తమ పరువు తీశారంటూ పెళ్లికొడుకు తరపు వారిపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీశ్ ఎందుకు పారిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.