groups clash
-
జాలర్ల ఫైట్.. గాల్లో కాల్పులు
-
జాలర్ల ఫైట్.. గాల్లో కాల్పులు
సాక్షి, చెన్నై: నిషేధిత వలల విషయంపై రెండు గ్రామాల జాలర్ల మధ్య శనివారం పుదుచ్చేరిలో వివాదం భగ్గుమంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. రాష్ట్రంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జాలర్లు వినియోగించే కొన్ని రకాల వలలపై ప్రభుత్వం నిషేధించింది. అలాగే పడవల కు కొన్ని రకాల ఇంజిన్లు వాడకానికి కూడా అనుమతులు రద్దు చేసి ఉంది. అయితే, ఓ వర్గం ఈ నిషేధానికి అనుకూలంగా, మరో వర్గం వ్యతిరేకం అన్నట్టుగా జాలర్లు విడిపోయారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నిరసనలు, వివాదాలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుదచ్చేరిలో శనివారం రెండు గ్రామాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చదవండి: ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?! గాల్లోకి కాల్పులు.. వీరాపట్నం, నల్లవాడు గ్రామానికి చెందిన జాలర్ల మధ్య ఈ వలల విషయంలో వివాదం రగులుతూ వస్తోంది. శనివారం వీరాపట్నం జాలర్లు నల్లవాడు సరిహద్దుల్లో 30కి పైగా పడవల్లో నిషేధిత వలల్ని ఉపయోగించి చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వీరిని అడ్డుకునేందుకు వీరాపట్నం గ్రామ జాలర్లు ఏకం కావడం, ఈటెలు, కర్రల సాయంతో సముద్రంలోకి వెళ్లారు. ఈ సమాచారంతో నల్లవాడు గ్రామం నుంచి పెద్దఎత్తున జాలర్లు తరలిరావడంతో పరస్పరం దాడులకు సిద్ధం అయ్యారు. రెండు గ్రామాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు మార్లు గాల్లో కాల్పులు జరిపి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సముద్రంలో చేపల వేటలో ఉన్న జాలర్ల మీద సైతం డమ్మి బుల్లెట్లను ఉపయోగించి తరిమి కొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈనేపథ్యంలో రెండు గ్రామాల మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొనకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అరియాకుప్పం ఎమ్మెల్యే భాస్కరన్ నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగి,రెండు గ్రామాల జాలర్లతో చర్చిస్తున్నారు. -
ఇరు వర్గాల ఘర్షణ
♦ ఏడుగురికి గాయాలు ♦ కావలికారు పోస్టు కోసం గొడవ ♦ సాయిపూర్లో పోలీస్ పికెట్ తాండూరు: పట్టణంలోని సాయిపూర్లో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. కావలికారు పోస్టుకోసం గొడవ జరిగింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణతో సాయిపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. తాండూరు అర్బన్ ఎస్ఐ నాగార్జున్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్ కుటుంబానికి చెందిన వారు ప్రస్తుతం కావలికారుగా ఉన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీలో భాగంగా ఈసారి సదరు పోస్టు తమకు ఇవ్వాలని బంటు మల్లప్ప కోరుతున్నాడు. ఈ పోస్టు తమకే చెందాలని సంతోష్‌కుమార్ వర్గం స్పష్టం చేసింది. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ఈక్రమంలో ఆదివారం ఉదయం సాయిపూర్ హనుమాన్ దేవాలయం వద్ద టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు, నాయకుడు బాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సింలు సమక్షంలో ఇరువర్గాలు పంచాయతీ పెట్టారు. మాటామాట పెరగడంతో ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. సంతోష్‌కుమార్ వర్గానికి చెందిన పలువురు గాయపడ్డారు. మరోవర్గానికి చెందిన బంటు మల్లప్ప, హన్మప్పల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ఏడుగురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలకు చెందిన ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌కుమార్, బంటుమల్లప్ప ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. సాయిపూర్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.