జీఆర్టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జీఆర్టీ జువెలర్స్ తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన (1.513 కేజీలు) జుంకీలను తయారు చేసినందుకు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. బంగారు నగలు, వజ్రాభరణాలు సహా విస్తృత శ్రేణి ప్లాటినం, వెండి ఉత్పత్తులతో ఇప్పటికే కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న తమకి తాజా గిన్నిస్ రికార్డ్ ఒక మైలురాయి లాంటిదని జీఆర్టీ జువెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ తెలిపారు.
‘గిన్నిస్ రికార్డ్ ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది దీన్ని కోరుకుంటారు. కానీ అందరికీ ఇది చేరువ కాదు. గిన్నిస్ రికార్డ్ సాధించిన వారి జాబితాలో మేం చేరడం గొప్ప విషయం. కస్టమర్లు మాత్రమే కాకుండా దేశం గర్వపడేలా మా వంతు కృషి అందించాం’ అని పేర్కొన్నారు.