g.satyan
-
భారత నంబర్‌వన్ సత్యన్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్‌గా కొనసాగుతున్న ఆచంట శరత్ కమల్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని జి.సత్యన్ భర్తీ చేశాడు. కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న సత్యన్... మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 49వ స్థానానికి చేరుకున్నాడు. శరత్ కమల్ 51వ స్థానంలో నిలిచాడు. గతేడాది సత్యన్ బెల్జియం ఓపెన్, స్పానిష్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో మానవ్ ఠక్కర్ 18వ, మానుష్ షా 47వ, హైదరాబాద్ ప్లేయర్ స్నేహిత్ 64వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. -
సత్యన్ సంచలనం
ఘసుజో (చైనా) : ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువ ఆటగాడు జి.సత్యన్ సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 188వ ర్యాంకర్ సత్యన్ 4-1 గేమ్‌ల తేడాతో ప్రపంచ 64వ ర్యాంకర్ గెరెల్ పార్ (స్వీడన్)ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు జరిగిన అర్హత రౌండ్ చివరి మ్యాచ్‌లో సత్యన్ 11-7, 11-8, 11-8, 11-4 తేడాతో చిలీకి చెందిన ఫెలిప్ ఒలివర్స్ను ఓడించాడు. మరోవైపు భారత ప్రధాన ఆటగాడు ఆచంట శరత్ కమల్ తొలి రౌండ్లో 4-2తో పార్క్ సిన్ హ్యోక్ (ఉత్తర కొరియా)పై గెలుపొందగా... సౌమ్యజిత్ ఘోష్ 4-1తో ఖాద్రి (నైజీరియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత పొందాడు.