
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్‌గా కొనసాగుతున్న ఆచంట శరత్ కమల్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని జి.సత్యన్ భర్తీ చేశాడు. కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న సత్యన్... మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 49వ స్థానానికి చేరుకున్నాడు.
శరత్ కమల్ 51వ స్థానంలో నిలిచాడు. గతేడాది సత్యన్ బెల్జియం ఓపెన్, స్పానిష్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో మానవ్ ఠక్కర్ 18వ, మానుష్ షా 47వ, హైదరాబాద్ ప్లేయర్ స్నేహిత్ 64వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment