GT vs PBKS
-
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా విజయ్‌కుమార్ వైశాఖ్‌ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్‌లోకి వచ్చేసింది. రూథర్‌ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్‌కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్‌ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్‌లో వైడ్లు, ఫుల్ టాస్‌లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్‌కుమార్ వైశాఖ్‌కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్‌లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడి పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయం అందుకోగా.. గుజరాత్ సారథిగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.శ్రేయస్ అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండు పాత్రల్లోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గిల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలే ఓటమికి పరోక్ష కారణాలంటూ విమర్శించాడు.పవర్ ప్లేలో బౌలర్ల మార్పులుముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో గుజరాత్ సారథి విఫలమయ్యాడని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగినట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుగ్గా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడులే అనుకునే సరికి.. అర్షద్ ఖాన్‌ను తీసుకువచ్చాడు.ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?అతడేమో పవర్ ప్లేలోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడనుకుంటా! అదే పంజాబ్‌కు మొమెంటమ్‌ను ఇచ్చింది. ఒకవేళ సిరాజ్ గనుక కొత్త బంతితో రాణిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఆఖర్లోనూ సిరాజ్ బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.కెప్టెన్‌గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలని.. కానీ శుబ్‌మన్ గిల్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఓ బౌలర్ మెరుగ్గా రాణిస్తున్న వేళ.. అతడిని తప్పించి మరొకరిని తీసుకురావడం సరికాదని పేర్కొన్నాడు. గిల్ ఇకనైనా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులలో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేదంటే మున్ముందు గుజరాత్‌కు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.సిరాజ్ ధారాళంగాకాగా గుజరాత్ టైటాన్స్ తమ సొంతమైదానం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం మ్యాచ్ ఆడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన టీమిండియా పేసర్ సిరాజ్.. తొలి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు.మరుసటి ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడను గిల్ బరిలోకి దించగా.. అతడు 8 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సిరాజ్ రంగంలోకి దిగి.. 12 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రబడ ఓవర్లో తొలి వికెట్ దక్కించుకుంది టైటాన్స్.అయితే, వీరిద్దరిని పక్కనపెట్టిన గిల్.. ఐదో ఓవర్లో అర్షద్ ఖాన్‌ను తీసుకురాగా.. అతడు ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మళ్లీ పదిహేనో ఓవర్ దాకా గిల్ సిరాజ్ చేతికి బంతినివ్వలేదు. మళ్లీ ఆఖరి ఓవర్లో సిరాజ్‌ను రంగంలోకి దించగా.. ఈసారి ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.శ్రేయస్ ధనాధన్‌ఈ నేపథ్యంలో సెహ్వాగ్ గిల్ కెప్టెన్సీ తీరుపై పైవిధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అరంగేట్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 47) మెరుపులు మెరిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక మార్కస్ స్టొయినిస్ (15 బంతుల్లో 20) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపులు(16 బంతుల్లోనే 44 నాటౌట్) మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు నమోదు చేసింది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్.. ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.టైటాన్స్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54) అర్ధ శతకాలతో రాణించగా.. శుబ్‌మన్ గిల్(14 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(28 బంతుల్లో 46) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 232 పరుగులకే పరిమితమైన టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్Punjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025