Gucci
-
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్‌ను స్పెషల్‌గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్‌కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్‌లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్‌గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వైరల్ వీడియో: 68 మంది కవలలతో ఫ్యాషన్ షో
-
68 మంది కవలలతో ఫ్యాషన్ షో: వీడియో వైరల్
ఇప్పటి వరకు పలు రకాల ఫ్యాషన్ షోలు చూసి ఉంటాం. వాటిల్లో వారు ధరించిన బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సాగేవి. ఇక్కడోక ఫ్యాషన్ షో మాత్రం అత్యంత విభిన్నంగా రూపొందించారు. మాగ్జిమమ్ ఎవరి ఇంట్లోనైనా ఇద్దరు అక్కచెల్లెళ్లు, లేదా అన్నాదమ్ములు లేదా కవలలు ఉంటే ఒకేలాంటి డ్రస్‌లు వేస్తారు. దీన్నే థీమ్‌గా తీసుకుని కవలలతో ఫ్యాషన్ షో నిర్వహించింది ఓ ప్రముఖ కంపెనీ వివరాల్లెకెళ్తే... ఈ షోలో ఇద్దరో లేదా ఐదోగురో కవలలు కాదు. ఏకంగా 68 మంది కవలలతో ఫ్యాషన్ షోని ప్రదర్శించారు. ఈ షోని ఇటాలియన్ దుస్తుల, జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్ గుస్సీ 'గుస్సీ ట్విన్బర్గ్' పేరుతో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించింది. అలెశాండ్రో మిచెల్ అనే ప్రముఖ డిజైనర్ 2022-23 స్ప్రింగ్ సమ్మర్ సీజన్ పేరిట మిలాన్ ఫ్యాషన్ షోలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ షోకి సంబంధించిన వీడియోలను గుస్సీ బ్రాండ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట చేసింది. ఆ వీడియోలో ఒకే రకమైన దుస్తులు, జువైలరీని ధరించిన కవలల మోడళ్లు నడుస్తూ వస్తుంటారు. మిచెలల్ తన ఫ్యాషన్ షోలో పురాతన కాలం నాటి దుస్తులు, సింబల్స్‌ను ఉపయోగించి అప్పటి నాగరికతను ప్రతిబింబించేలా రూపొందించారు. పాతకాలం నాటి సినిమాల్లో ఉపయోగించిన దుస్తులను కూడా కవలల మోడళ్లు ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ వీడియోకి ఏడు వేలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం...గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్) -
నీ గొడుగు సల్లగుండ..ధర లక్షరూపాయలంట! ఏముంది ఇందులో!
ట్రెండ్‌కు తగ్గట్లు నేటి యువత ప్యాషన్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నుదుటున పెట్టుకొనే కుంకుమ బొట్టు దగ్గర నుంచి సమ్మర్ సీజన్లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు వినియోగించే గొడుగు వరకు..ఇలా ప్రతిదీ ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లు ఫ్యాషన్ బ్రాండెడ్ సంస్థలు ప్రొడక్ట్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ గుచీ, స్పోర్ట్స్ బ్రాండ్ సంస్థ అడిడాస్‌లు సంయుక్తంగా ఓ గొడుగును మార్కెట్లో విడుదల చేశాయి. ఇప్పుడీ గొడుగు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ⚠️warning!🤣⛽️ ☔️Umbrellas are not waterproof!#adidasxGucci @adidasoriginals @gucci #VirtualWorld #REALITY #Blockchain #CryptocurrencyNews #Metaverse #NFTCommunity #NFTcollectibles #NFTartist #nftcollector pic.twitter.com/xmudzHHxrW — cubist👽🐼🧛♂️🧟♂️🧚♀️🤖 (@cubist_pg) May 13, 2022 అడిడాస్ ఎక్స్ గూచీ కలెక్షన్ పేరుతో స్పెషల్‌గా తయారు చేసిన ఈ గొడుగును ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది.1,644 డాలర్లు(భారత కరెన్సీలో రూ1,27,407.12) చైనా గూచీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ గొడుగు స్పెషాలిటీ ఏంటో తెలుసా? వర్షం కురుస్తున్నప్పుడు తడవకుండా ఉండేందుకు గొడుగును వినియోగిస్తాం.కానీ ఈ ఫ్యాషన్ సంస్థలు అమ్మకానికి పెట్టిన ఈ గొడుగును వర్షంలో వినియోగించడానికి కాదంట. "దయచేసి గమనించండి, ఈ గొడుగు వర్షంలో తడవకుండా ఉండేందుకు కాదు. సూర్యుడి నుంచి రక్షణ లేదంటే అలంకరణ కోసమే ఉపయోగించుకోవచ్చని తెలిపింది. గొడుగు అమ్మకం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజట్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. వర్షంలో వినియోగించేందుకు పనిచేయని గొడుగును ఇంత ధరకు అమ్మడం ఏంటని మండి పడుతున్నారు. చదవండి👉‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’ -
బెల్టుకు 35 వేలా అని తిట్టారు.. మరి ఇదేంటి ‘దేశీ మామ్’!
‘‘ఏంటీ.. ఈ బెల్టుకు 35 వేల రూపాయలా? అంతగా ఏముంది దీంట్లో.. స్కూలు బెల్టులా ఉంది. దీని మీద జీజీ అని ఎందుకు రాశారు. మార్కెట్లో 150 రూపాయలకే దొరుకుతుంది. డబ్బు వృథాగా ఖర్చు పెట్టేందుకే మీరంతా ఉన్నారు’’.. ఈ మాటలు అన్న ‘దేశీ మామ్’ అనితా గుప్తా గుర్తున్నారా? అదేనండీ.. తన కూతురు, సోషల్ మీడియా యూజర్ చాబి గుప్తా బ్రాండెడ్ బెల్టు కొన్నానని చెప్పినందుకు చివాట్లు పెట్టారే ఆవిడే. తన ఫన్నీ కామెంట్లతో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అనితా గుప్తా.. ఇప్పుడు మరోసారి వార్తలోకెక్కారు. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బెల్టును జార్ఖండ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు బెల్టుతో పోల్చిన ఆమె.. ఇప్పుడు అదే బెల్టును ధరించి ఎంచక్కా ఫొటోలకు ఫోజులిచ్చారు. సంప్రదాయ చీరకట్టుకు బెల్టును జతచేసి మోడ్రన్ లుక్‌లో అదరగొడుతున్నారు. తన తల్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన చాబి.. ‘‘గుచీ బెల్టును ఇలా భారతీయ సంప్రదాయ చీరకట్టుతో జతచేసి ధరించడం.. ఇదొక స్టైల్’’ అని పేర్కొంది. గోరంచు ఉన్న గులాబీ రంగు చీరకు... పూర్తిగా వర్క్‌తో నిండిన బ్లౌజ్‌ను మ్యాచ్ చేసి చిరునవ్వులు చిందిస్తున్న అనితా గుప్తా ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో... ‘‘ఆంటీ.. ఇది ఆ 150 రూపాయల బెల్టు అయితే కాదు కదా. లేదంటే.. అంత ఖర్చు పెట్టి కొన్నందుకు ఎడాపెడా వాడేద్దామని డిసైడ్ అయ్యారా? ఏదైమేనా చాలా అందంగా కనిపిస్తున్నారు దేశీ మామ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anita Gupta & Chabi Gupta (@yourregularmom) -
‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్త్రధారణలో అనేకానేక మార్పులు వస్తున్నాయి. బ్రాండెడ్, లగ్జరీ దుస్తులు ధరించడం ఇప్పుడొక ఫ్యాషన్. ఈ ఫ్యాషన్‌ను ఫాలో కాకపోవడాన్ని నామూషీగా ఫీలయ్యే వారు ఎంతో మంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా, నలుగురిలో తిరగాలంటే ఇలాంటివి ఉండాల్సిందే అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతుంటాయి. ఇక డబ్బులున్న వారీ సంగతీ మరింత భిన్నంగా ఉంటుంది. ఏం ధరించిన కాస్ట్లీదే అయ్యుండేలా చూసుకుంటారు. అయితే ప్రతీది లగ్జరీగా కనిపించదు. కొన్నింటి ఖరీదు నిజంగా నమ్మడానికి వింతగా అనిపిస్తుంటుంది. అచ్చం అలాగే ఇన్స్టాగ్రామ్ యూజర్ అయిన చాబీ గుప్తా ఇటీవల ఆమె కొన్న ఓ బ్రాండెడ్ బెల్ట్‌ను తన తల్లికి చూపించింది. అది లగ్జరీ బ్రాండ్ గుచీకి చెందినది. దాని ఖరీదు అక్షరాలా 35 వేల రూపాయలు. అయితే ఆ నిజాన్ని తల్లి అనిత గుప్తా అస్సలు నమ్మలేదు. పైగా అది అచ్చం ఆమె చదువుకున్న రాంచీలోని డిల్లీ పబ్లిక్‌స్కూల్ బెల్ట్‌లా ఉందంటూ కూతురు గాలి తీసేసింది. ముందుగా గుచీ బ్రాండ్ లోగో ఉన్న బాక్స్‌లో నుంచి బెల్ట్ తీస్తూ ‘ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బెల్ట్ ఆ? ఖరీదెంత అంటూ తల్లి అనితా ప్రశ్నించింది. ఇందుకు కూతురు 35 వేలు అని సమాధానమిచ్చింది. ‘35 వేల బెల్డ్ ఆ ఇది.. అంత ఏముంది ఇందులో.. అయినా ఎందుకు జీజీ అని దీని మీద రాశారు.. బయట నీకు ఇది ఎక్కడైన 150 రూపాయలకు దొరుకుతుంది. అంటూ పెదవి విరిశారు. తల్లి మాట్లాడుతుండగా చాబీ గట్టిగా నవ్వుకుంది. దీంతో ‘ మీరంతా కేవలం డబ్బు వృథా చేయడానికే ఉన్నారు. అంటూ అనితా మరోసారి కోపగించుకున్నారు. తల్లీకూతుళ్ల మధ్య జరిగిన ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు చాబీ. ప్రస్తుతం ఇది నెట్టింటా చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Anita Gupta & Chabi Gupta (@yourregularmom) -
ఏంటి 2.5 లక్షలా.. మా అమ్మ రూ.250కే తెస్తుంది
కొన్ని ఇంటర్నెషనల్ బ్రాండ్ దుస్తుల ఖరీదు చూస్తే.. కళ్లు తిరుగుతాయి. అరే ఇంత ఖరీదు పెట్టడానికి అసలు వాటిలో ప్రత్యేకత ఏంటో మనలాంటి సామాన్యులకు అర్థం కాదు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే వాటిని కొనే ధైర్యం చేస్తారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గుస్సి బ్రాండ్‌కు చెందిన ఓ కుర్తా ఖరీదు తెలిస్తే.. హవ్వా అంటూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. దీనిపై దేశీ నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు.. గుస్సి తాజాగా తన కలెక్షన్లో భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడే కుర్తీలను తీసుకువచ్చింది. కుర్తీని కాస్త పొరపాటుగా కఫ్తాన్‌గా పేర్కొంది. ఇక దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా పేర్కొంది. అంటే మన కరెన్సీలో సుమారు 2,50,000 రూపాయలకు పైగా ఖరీదన్నమాట. Gucci selling an Indian kurta for 2.5 lakhs ? I'll get the same thing for 500 bucks 💀 pic.twitter.com/Opw2mO5xnV — nalayak (@samisjobless) June 1, 2021 చూడటానికి కూడా పెద్దగా బాగాలేదు. గొప్ప కలర్ కూడా కాదు. తెలుపు రంగు కుర్తీ మీద నెక్ దగ్గర మెరూన్ డిజైన్‌తో ఉన్న ఈ కుర్తీకి 2.5 లక్షల రూపాయల ఖరీదుగా ప్రకటించడంతో మన నెటిజనులు ఏ మాత్రం కన్విన్స్ కాలేకపోతున్నారు. ‘‘ఏంటి ఈ కుర్తా ఖరీదు 2.5 లక్షలా.. మా అమ్మ 250 రూపాయల్లో కొనుగోలు చేస్తుంది’’.. ‘‘నేనైతే ఇలాంటివి 500 రూపాయలకు రెండు ఇప్పిస్తాను’’.. ‘‘నా బర్త్‌డేకి ఇదే కొనబోతున్నాను.. అయితే రెండున్నర లక్షల రూపాయలకు కాదు.. కేవలం 250 రూపాయలకు మాత్రమే.. ‘‘బ్రాండ్ పేరు చెప్పి.. ఇంత ఖరీదు ప్రకటించడం ఏమైనా బాగుందా’’అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. -
గుచ్చి గుచ్చి చంపుదామా!
gucci... స్పెల్లింగ్ ఇదే! అయినా దీనిని పలకడం మాత్రం ‘గూచి’యే! ప్రపంచంలో అత్యంత పాపులర్ బ్రాండ్స్‌లో ఇది టాప్‌లో ఉంది. ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు. హృదయాన్ని విప్పి చూపడానికి గూచి. ప్రపంచం అంతా తొడిగేస్తోంది కదా..! మరి మనమూ, మన పిల్లలు ఏం తక్కువ? మన పర్సులో కొంచెం క్యాషే తక్కువ!! ఒక జత ‘గూచి’ కొనాలంటే ఓ ఏడాది జీతం కూడా సరిపోకపోవచ్చు. కానీ, ఆ ఆలోచనని ఆస్వాదించాలంటే... ఆ ప్యాటర్న్స్ని ధరించాలంటే... పైకం అక్కర్లేదు, కొంచెం మైకం ఉంటే చాలు. నిజంగా మన చుట్టూ ఉండే డల్‌నెస్‌ని చిరునవ్వుతో ఎలాగైతే చీల్చేస్తామో! అలాగే, ఈ షాకింగ్ కలర్స్‌తో సగటు జీవితాన్ని ఒక్కోసారి ఇలా వేసుకొని మరీ గుచ్చి గుచ్చి చంపుదామా! కమాన్ లెట్స్ బ్రైటన్ అప్. ద వరల్డ్ ఈజ్ వాచింగ్ అజ్! ఈ ధీమాతో ఒక కొత్త యాటిడ్యూడ్ని కాలరెగరేసుకొని ధరిద్దాం రండి.ఈ తొడుగుతో ఒక కొత్త ఆహ్లాదాన్ని ఆస్వాదిద్దాం పదండి. మనకు తెలిసినవి ఏడు రంగులు. కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో వేల రంగులను సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఐలాండ్ పారడైస్, ఫియస్టా రోజ్, బటర్‌కప్, లింపెట్ షెల్... ఇలా సైకెడెలిక్ కలర్స్‌ను సృష్టించి, వాటితో డిజైనర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. టాప్ టు బాటమ్ అదరగొట్టేస్తున్నారు. అందులో ‘గూచి’ బ్రాండ్‌తో అలెస్సండ్రో మిచేలే డిజైన్స్ ప్రముఖమైనవి. బాలీవుడ్లో ఐశ్వర్యారాయ్, కంగనా రనౌత్, సోనమ్‌కపూర్.. వంటి తారలంతా గూచి డ్రెస్సుల్లో బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. వెదురు నుంచి ప్రయాణం ‘గూచి’ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఇటాలియన్ బ్రాండ్. 19వ శతాబ్దిలో అంటే కనీసం వందేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించారు గూచి అనే ఇటలీ వ్యాపారి. వెదురుతో చేసిన హ్యాండ్ బ్యాగ్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చి, తర్వాత లెదర్ గూడ్స్‌తో తమ మార్కెట్‌ను విస్తృతం చేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చిరునామా అయిన ప్యారిస్‌లో తమ బ్రాండ్‌కు ఒక మార్కెట్‌ను సృష్టించుకొని తర్వాత న్యూయార్క్, లండన్ నగరాలకు విస్తరించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాలలోనూ గుచి తన వైభవాన్ని చాటుతోంది. మనకు తెలియని కలర్స్ కహానీ! టాప్ టు బాటమ్ ప్లెయిన్ కలర్స్‌తో క్లాత్‌పైన మ్యాజిక్ చేయడం ‘గూచి’ డిజైనర్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అలాగని అవి గాడీ రంగులు కాదు కాంతిమంతమైన రంగుల ఎంపిక అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలోచన గూచి కంపెనీకే పెద్ద ఎస్సెట్‌గా మారింది. పువ్వుల ప్రింట్లతో హవా! కాంతిమంతమైన రంగుల ఫ్యాబ్రిక్మీద అదరగొట్టే పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, జామెట్రికల్ లైన్స్ చూస్తే మతిపోతుంది. అవార్డులు: ప్రతియేటా అంతర్జాతీయ అవార్డులు గూచి సొంతం చేసుకుంటుంది. సిఎఫ్డిఎ (కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ అమెరికా) ఇంటర్నేషనల్ అవార్డ్ 2016. బ్రిటీష్ ఫ్యాషన్ ఇంటర్నేషనల్ డిజైనర్ అవార్డ్ 2015. ఖరీదులోనూ ఘనం ఒక్కో డ్రెస్ మన రూపాయల్లో లక్షన్నర నుంచి మొదలు. బ్యాగ్ అయినా, బెల్ట్ అయినా, షూస్ అయినా.. ఇతర అలంకార వస్తువులన్నీ అత్యంత ఖరీదైనవే! అందుకే గూచి ఉత్పత్తి అంటే లగ్జరీ ఫ్యాషన్ అనే పేరు స్థిరపడిపోయింది. డాలర్లలో డాబుసరి చూపుతున్న గూచి వేర్లో అంత అందం ఏముంది విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా.. అయితే ‘గూచి’ డాట్కామ్ని ఒకసారి క్లిక్ చేయండి. అందులో స్త్రీ, పురుషులు, పిల్లలకు విడివిడిగా డిజైనరీ దుస్తులు, ఇతర యాక్ససరీస్ వివరాలు ఉన్నాయి.. క్రియేటివ్ డిజైనర్ అలెస్సండ్రో మిచేలే అనే ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్న రంగుల మాయాజాలం అంతా ఇంతా కాదు. ఘనమైన పేరు సంపాదించాడు కనుకనే బ్యాగుల తయారీలో అగ్రగామిగా ఉండే ‘గూచి’ కంపెనీ అలెస్సండ్రే మిచేలేకి రెడ్‌కార్పెట్ పరిచింది. ఆ విధంగా ఈ కంపెనీకి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్‌లో సెటిల్ అయ్యాడు అలెస్సండ్రో. ఫ్యాషనబుల్ దుస్తుల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. డిజైనర్ అలెస్సండ్రో మిచేలే తాను ధరించే దుస్తుల్లోనూ ఆ వైవిధ్యాన్ని చూపుతాడు. మన భారతీయ వనితలూ వాటిని కళ్లకద్దుకొని మేనిని సింగారించుకుంటున్నారు. అలెస్సండ్రే మిచేలే, గూచి కంపెనీ క్రియేటివ్ డిజైనర్