తెలంగాణ ప్రజలందరూ పుణ్యస్నానాలు చేయాలి : మంత్రి జోగు రామన్న
దండేపల్లి (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని గూడెం పుష్కరఘాట్‌ను మంత్రి జోగు రామన్న సోమవారం సందర్శించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రజలందరూ గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యం పొందాలని సూచించారు.