gudi malkapur
-
కరోనాతో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కుమార్తె మృతి
సాక్షి, గోల్కొండ: గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మృతి చెందారు. వారం రోజులుగా ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, 15 రోజుల బాబు ఉన్నాడు. కాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం దేవర కరుణాకర్‌కు పంపిన ఒక సందేశంలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో నిబ్బరంగా ఉండాలని ఆయన దేవర కరుణాకర్‌ను కోరారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని హిందూశ్మశాన వాటికలో జరిగాయి. చదవండి: వరంగల్, ఆదిలాబాద్‌లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు -
వైరల్: ఆ ఫొటో బాలిక జీవితాన్నే మార్చేసింది
లోకంలో పట్టెడన్నం కోసం పడిగాపులు కాచేవారు ఎందరో.. ఇక్కడ మనం చెప్పుకునే ఈ చిన్నారి కూడా ఆ కోవకు చెందిందే. మోతి దివ్య ఉండేది మురికివాడలో. బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకోడానికి వెళ్తే.. ఆకలితో పల్లెం పట్టుకుని తన ఈడు పిల్లలుండే చోటుకు వడివడిగా అడుగులు వేసేది. పట్టెడు మెతుకులు దొరక్కపోతాయా అని గంపెడాశతో మధ్యాహ్న భోజన సమయానికి బడి మెట్లెక్కేది. మధ్యాహ్నం బడి గంట ఎప్పుడు కొడతారా అని చేతిలో ఖాళీ గిన్నెతో ఆతృతగా ఎదురు చూసేది. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతిరోజూ ఇదే తంతు. లోపల మిగతా పిల్లలందరూ స్కూలు బట్టలు ధరించి పాఠాలు వింటుంటే అక్కడే ఉన్న వారి వంక ఓసారి, వారి బ్యాగుల వంక తరచి తరచి చూస్తుండేది.. పిడికెడు మెతుకులైనా దొరక్కపోతాయా అని. ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఓ జర్నలిస్ట్ క్లిక్‌మనిపించగా కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న విషయాన్ని అక్షరాలా పాటించాడో వ్యక్తి. వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త ఎవరైనా ఆమెకు సహాయం చేస్తే బాగుండు అనుకోలేదు. నేనే ఎందుకు ముందడుగు వేయకూడదు అనుకున్నాడు. వెంటనే మరి కొంతమంది సహాయంతో ఆమె ఆచూకీ కనుగొన్నాడు. ఎక్కడైతే వేయిచూపులతో అంటరానిదానిలా ఆకలి తీర్చుకోడానికి నిరీక్షగా ఎదురు చూసిందో అదే పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. దీంతో ఆమెకు తిండితో పాటు చదువు కూడా సొంతం అయింది. ఇప్పుడామె హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న దేవల్ ఝామ్ సింగ్ ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థి. అందరు పిల్లల్లాగే ఆమె కూడా స్కూలు దుస్తులను వేసుకుంది. తన తల్లిదండ్రుల సమక్షంలో మొదటిసారిగా బడిలోకి విద్యార్థిగా అడుగుపెట్టింది. ఈ ఘటన.. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించిందని పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పూల మార్కెట్లో అగ్నిప్రమాదం
-
పూల మార్కెట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: పూలమార్కెట్లో అగ్నిప్రమాదం సంభవించి నాలుగు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన నగరంలోని గుడిమల్కాపుర్ పూల మార్కెట్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో.. సమీపంలో ఉన్న 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.