నీతికి నిలువెత్తు రూపమైన ప్రజానేత
ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు వరు సగా గెలుపొందిన ఓటమి ఎరుగని ప్రజానాయకుడు ఆయన. కుల మతాలను, గ్రూపులను ఆకట్టుకొనే రాజకీ యాలకు ఆయన ఆమడ దూరం. రాజకీయమంటేనే నాలుగు డబ్బులు.. కాదు కాదు.. రూ.కోట్లు పోగేసుకునే నేటి కాలంలో విలువల కోసం కట్టుబడ్డారు... ఆస్తులు కరిగించుకొన్నారు. కానీ, నిబద్ధతకు ప్రతిరూ పంగా నిలిచారు. అందుకే ఆయన కన్ను మూసిన రోజు పార్టీల కతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఆయన గుదిబండి వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిరపరిచితుడు. 2004 వరకు కొనసాగిన దుగ్గిరాల నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్ పార్టీదే విజయం. 1985 వరకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే కూడా రెండు పర్యాయాలు గెలుపొందలేదు. ఆ ఒరవడికి గుదిబండి గండికొట్టారు. 1989లో ఆరం భించి వరుసగా నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నిక య్యారు. సీఎంలుగా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్. జనార్ధనరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జిల్లా సీనియర్ నేతలు కే.రోశయ్య, ఆలపాటి ధర్మారావుతో సన్నిహితంగా వ్యవహరించేవారు.
వెంకటరెడ్డి నిర్మొహమాటి. తన మనసుకు మంచి అనిపించింది ఎవరి ఎదుటైనా, ఎక్కడైనా ముక్కుసూటిగా చెప్పటం అలవాటు. సహచర శాసనసభ్యుల్లో అవినీతిపరులున్నా రంటూ సంచలన వ్యాఖ్యలు చేయటానిక్కూడా ఆయన వెనుకాడ లేదు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంకటరెడ్డికి, ఒక పర్యాయం మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా దుగ్గిరాల నియోజకవర్గం రద్దయింది. ఆయన స్వస్థల మైన కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలో కలిసింది. ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ద క్కలేదు.
కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంకోసం పాటుపడుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్ని కలకు మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుకు పనిచేసిన వెంకటరెడ్డికి పల్నాడులోని దైద, తేలుకుట్ల, కరాలపాడు, ముత్యాలం పాడు గ్రామాల్లో పంచెలు, చీరెలు పరిచి నడిపిస్తూ స్వాగతం పలకటం ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వం కల్పించే గన్‌మ్యాన్ సౌకర్యాన్ని ఏనాడూ అంగీకరించ లేదు. ఎన్నికల్లో ఖర్చుపెట్టడమే కానీ తిరిగీ తీసుకునే అలవాటు ఆయనకు లేదు. రాజకీయ అవలక్షణాలు అంటని ఆయన వ్యక్తిత్వం మాత్రం వెలుగుదివ్వెలా వెలుగులీనుతూ ఉంది.
(గురువారం గుంటూరు జిల్లా కొల్లిపరలో ఆకస్మికంగా కన్నుమూసిన సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డికి నివాళిగా..)
బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
- గుదిబండి వెంకటరెడ్డి
మొబైల్: 97059 31082