gudimetla ravireddy
-
బీజేపీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయి?
విశాఖపట్నం: ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశం పెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని విశాఖపట్నం వైఎస్ఆర్ సీపీ అధికారి ప్రతినిధి గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు. సబ్బం హరి పచ్చి అవకాశవాదని విమర్శించారు. బీజేపీ నుంచి సబ్బం హరికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయని ప్రశ్నించారు. సమైక్యవాదులంతా సబ్బం హరి తీరును ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. -
రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జీవీఎంసీ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనోకు, గుడిమెట్ల రవిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. వీరికి సంఘీభావంగా గురువారం నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర నాయకులు ఆడారి కిషోర్‌కుమార్, ఏయూ జేఏసీ నాయకులు ఆరేటి మహేష్, కాంతారావు, లగుడు గోవింద్, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు జీవీ రవిరాజు, తిప్పల నాగిరెడ్డి మద్దతు తెలిపారు.