‘వాటర్ గ్రిడ్’పై సమగ్ర చర్చ అవసరం
సందర్భం
తెలంగాణ ప్రభుత్వం భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అందుబాటులో ఉన్న సమాచారం స్వల్పం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ సమాచారాన్నంతా బహిరంగపరచి, విస్తృత చర్చ, సంప్రదింపులు నిర్వహించాలి.
భారీ వ్యయంతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు జల ప్రాజెక్టులను తెలం గాణ ప్రభుత్వం తలపెట్టింది. మొదటిది, పైపులు, పంపుల ద్వారా తాగునీటి, గృహ అవ సరాలను తీర్చే ‘‘వాటర్ గ్రిడ్’’. రెండవది, వ్యవసాయ, గృహ అవసరాలకు నీటి లభ్య తను మెరుగుపరచే లక్ష్యంతో గ్రామీణ చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ. రూ. 50,000 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, సామా జిక అంశాలపై నిర్మాణాత్మకమైన బహిరంగ చర్చ అవ సరం. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్‌పై ఇంతవరకు అందు బాటులో ఉన్న సమాచారం స్వల్పం. దాని పైన ఆధా రపడి ప్రాజెక్టు డిజైనింగు, అమలు, వ్యయాల తగ్గింపు నకు తోడ్పడాలనేదే ఈ వ్యాసం లక్ష్యం.
గ్రామీణ నీటి సరఫరా పథకాలు మనకు కొత్తేమీ కాదు. బావుల మరమ్మతు, కొత్త పంచాయితీ బావుల తవ్వకంతో తాగునీటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ జోక్యం ప్రారంభమైంది. ఆ తర్వాత చేతి పంపులు, ఆ తదుపరి ఎమ్ 2 పంపులతో లోతైన బోరు బావులు,పెద్ద గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లు ప్రవేశిం చాయి. నేడు ఆర్ఓ (నీటి శుద్ధి) ప్లాంట్లు, వాటర్ క్యాన్లు సురక్షితమైన తాగునీటికి సంకేతంగా మారాయి. పలు గ్రామాలకు ఇంకా చేతి పంపులే తాగునీటికి ఆధారం. అయినా ఆర్ఓ ప్లాంట్లు, వాటర్ క్యాన్లే విస్తరిస్తున్న ధోరణి. ఈ మార్పునకు చాలానే కారణాలున్నాయి. వాటిలో నీటి లభ్యత, నాణ్యత ప్రధానమైనవి. ప్రజల ఆదాయాలు, నీటి నుంచి సంక్రమించే వ్యాధులపట్ల అవగాహన పెరగడం కూడా ప్రజల తాగునీటి ఎంపి కలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు డిజైనింగ్, అమలులో దిగువ అంశాలను పరిగ ణనలోకి తీసుకోవాలని భావిస్తున్నాం.
గ్రామీణ జనాభాలో 50% నేడు ఆర్ఓ ప్లాంట్ల తాగునీటిని వాడుతున్నారని, 2020 నాటికి 80% ఆ నీరే వాడుతారని అంచనా. కాబట్టి వాటర్ గ్రిడ్ పూర్తయ్యేస రికి తాగునీటికి గ్రిడ్ ప్రధాన వనరుగా ఉండకపోవచ్చు.
ఒకే గ్రిడ్, ఒకే వనరు ప్రభుత్వ ప్రణాళికయితే వనరు, దూరం, గ్రిడ్ నుంచి గ్రామీణ తెలంగాణకు అం తటికీ నీటి రవాణా ఏర్పాట్లు వంటి విషయాల్లో చాలా సవాళ్లు ఎదురుకావచ్చు. లేక వాటర్ గ్రిడ్ పలు నీటి వన రులతో కూడిన ప్రాజెక్టయితే, అలాంటి వనరులను ఉప యోగించుకోవడంలో నాణ్యత, పరిమాణాలకు సంబం ధించి పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటి యూనిట్ వ్యయం మరో సవాలు కావచ్చు.
గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటిని ప్రజలు తాగు నీటిగా ఉపయోగించకపోతే, గృహావసరాలు తదితరా లకు జలరవాణాపై అంత భారీ పెట్టుబడులను పెట్టడం సమంజసం కాకపోవచ్చు.
ఇప్పటికే పలుచోట్ల స్థానికంగా పైపులు, పంపుల వ్యవస్థలున్నాయి. అవి లేని చోట్ల ఆ ఖాళీలను పూరించ డానికి వాటర్ గ్రిడ్ సమంజసం కావచ్చు. అందుకోస మైతే ఈ ప్రాజెక్టును ప్రతిచోటా గాక, పంపునీటి కనెక్షన్లు లేని చోట్ల ప్రారంభించడమే తర్కబద్ధమవుతుంది.
ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. తెలంగాణ ప్రజ లందరి గృహ, తాగునీటి అవసరాలకు సరిపడేటంత సురక్షితమైన నీటిని అందించాల్సిన అవశ్యకతను ఎవ రూ ప్రశ్నించడం లేదు. ప్రాజెక్టును మరింత ఆమోదయో గ్యంగా, ఆర్థికంగా మనగలిగేదిగా చేయడం కోసమే పై అంశాలను లేవనెత్తాం. దిగువ సూచనలను చేస్తున్నాం.
1.గృహ, తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రస్తుత మున్న మౌలిక సదుపాయాల స్థితిపై శీఘ్రమే వివ రమైన నివేదికను రూపొందించడం ముందుగా చేయాల్సిన పని. ఆ నివేదకలో ఈ అంశాలను చేర్చ వచ్చు: ఎ) సగటున రోజుకు 120 లీటర్ల ప్రమాణం ప్రకారం ఇప్పుడున్న తాగునీటి సదుపాయాలు, పంపిణీ, విస్తరణ; బి) ప్రస్తుతం ఉన్న శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు, వాటి పంపిణీ, విస్తృతి; సి) వాటి పై పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడు లు; డి) స్థానికంగా ఉన్న పంపు నీటి వ్యవస్థలు, వాటి సమర్థత; ఇ) స్థానికంగా వాటర్ గ్రిడ్లు ఉం డివుంటే వాటి విస్తృతి; ఎఫ్) శుద్ధిచేసిన నీటి ప్రస్తు త డిమాండు, సరఫరా. ఈ నివేదకను నెలలో తయారుచేయవచ్చు. ఆ తదుపరి ‘అందుబాటులో లేని వారికి ప్రాధాన్యం’ అనే ప్రాతిపదికన వాటర్ గ్రిడ్‌ను డిజైన్ చేయాలి. ఇప్పటికే ఉన్న పరిశుద్ధ నీటి వ్యవస్థలను బలోపేతం చేసి, విస్తరించడం ద్వారా త్వరితగతిన ఫలితాలను సాధించవచ్చు.
2. {Wy్ డిజైనింగ్‌కు, ఆమోదానికి, అమలుకు కాలం పడుతుంది. కాబట్టి జిల్లాకో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, తదుపరి వాటిని వాటర్ గ్రిడ్‌తో అనుసంధానించవచ్చు.
3. ముందే చెప్పినట్టుగా శుద్ధిచేసిన క్యాన్లలోని తాగు నీటి వాడకం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భవిష్యత్ ధోరణి. కాబట్టి ప్రజలు గ్రిడ్ నీటిని తాగకపో వచ్చు. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ లను బలోపేతం చేసి, నియంత్రణ వ్యవస్థను నెలకొల్పి, గ్రిడ్ నీరు నాణ్యమైనది, సురక్షితమైనది, ధర రీత్యా అందుబాటులో ఉండేదిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
4.ఇలాంటి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాలపరిమితిలో స్పష్ట మైన లక్ష్యం, టార్గెట్లు, ప్రయోజనాలను నిర్వచించే ప్రభావ విశ్లేషణ అవసరం. ప్రాజెక్టు ప్రభావాన్ని ప్రభుత్వంతోపాటూ పౌర సమాజం కూడా క్రమం తప్పక పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి ముందే ప్రభు త్వం స్పష్టమైన, పారదర్శక క్రమాన్ని ప్రారంభించాలి. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు సమాచా రాన్నంతా బహిరంగపరచాలి. టెండర్ల ప్రక్రియకు ముం దే, ఇప్పుడే విస్తృత బహిరంగ చర్చ, సంప్రదింపులు చేపట్టడం మెరుగైన డిజైనింగ్‌కు, అమలుకు తోడ్పడు తుంది, ప్రజలందరికీ మేలు చేకూరుతుంది.
(వ్యాసకర్త ఐరాసలో పనిచేసిన అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు)
email:bg@agsri.com