నేడు గుమ్మసముద్రానికి సీఎం రాక
హంద్రీ-నీవా కాలువ పరిశీలన నీరు-చెట్టు పైలాన్ ఆవిష్కరణ
బి.కొత్తకోట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం చెరువుకు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నేరుగా చెరువులో సిద్ధం చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2.45గంటలకు చేరుకుంటారు. అక్కడినుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం వద్దకు వెళతారు. అక్కడి నుంచి ఏవీఆర్ హంద్రీ-నీవా ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కాలువను పరిశీలిస్తూ కొత్తపల్లె మీదుగా గుమ్మసముద్రం చెరువు వరకు రెండున్నర
నేడు గుమ్మసముద్రానికి సీఎం రాక
కిలోమీటర్లు ప్రయాణిస్తారు. తిరిగి చెరువును చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం చేయనున్న నీరు-చెట్టు కార్యక్రమానికి ఇక్కడినుంచే శ్రీకారం చుడతారు. ప్రారంభోత్సవానికి చిహ్నంగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తర్వాత చెరువులో పూడికతీత పనులు ప్రారంభించి, ఉపాధి హామీ పథకం కూలీలతో ముఖాముఖీ మాట్లాడుతారు. అనంతరం మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక బహిరంగ సభాస్థలికి చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30గంటలకు హెలికాపర్లో తిరుపతికి బయలుదేరివెళ్తారు.
ఏర్పాట్లు పూర్తి..
ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హంద్రీ-నీవా కాలువపై మార్గం సిద్ధమైంది. పైలాన్ నిర్మాణం, సభావేదిక, హజరయ్యే ప్రజలకు కుర్చీలు ఏర్పాటుచేశారు. సీఎం 2.5 కిలోమీటర్లు దూరం రోడ్డుపై ప్రయాణించనుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతాపరంగా తీసుకొవాల్సిన చర్యలపై ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సుమారు 1,100మంది భద్రత అందించనున్నారు. సభకు కనీసం 30వేలమంది జనాన్ని రప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు.
ఫోటోలున్నాయి:
18టిబిపి61: సీఎం ఆవిష్కరించనున్న నీరు-చెట్టు పైలాన్
18టిబిపి62: సిద్దమవుతున్న సభావేదిక
భారీ బందోబస్తు
సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సీఎం భద్రతకు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, వంద మంది ఎస్ఐలు, 700 మంది పీసీలు, 200 మంది ఆర్మెడ్ ఫోర్సు, 300 మంది హోంగార్డులు, ఎస్బీ, ఇంటల్ జెన్స్, బ్లూకోట్స్ తదితర విభాగాల పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాయలసీమ రేంజ్ డీఐజీ బాలక్రిష్ణ, ఎస్పీ శ్రీనివాస్‌లు పర్యవేక్షణ ఉంటుందన్నారు.
పోలీసుల ఆధీనంలో బి.కొత్తకోట బి.కొత్తకోటను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించే ప్రదేశంతో పాటు చుట్టు పక్కల గ్రామాలను జల్లెడ పడుతున్నారు. 18టిబిపి63ఃబి.కొత్తకోటలో మొహరించిన పోలీసుబలగాలు
సీఎం పర్యటన ఇలా..
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురు, శుక్రవారాల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19న మధ్యాహ్నం 1.30 గంటలకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎలహంక విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి జిల్లాలోని హంద్రీ-నీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తూ 2.45 గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం చెరువులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభిస్తారు. తరువాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 6.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు తిరుపతిలోని రామానాయుడు కల్యాణమండపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారని తెలిపారు.
కిలోమీటర్లు ప్రయాణిస్తారు. తిరిగి చెరువును చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం చేయనున్న నీరు-చెట్టు కార్యక్రమానికి ఇక్కడినుంచే శ్రీకారం చుడతారు. ప్రారంభోత్సవానికి చిహ్న ంగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తర్వాత చెరువులో పూడికతీత పనులు ప్రారంభించి, ఉపాధి హామీ పథకం కూలీలతో ముఖాముఖీ మాట్లాడుతారు. అనంతరం మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక బహిరంగ సభాస్థలికి చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం తిరుపతికి బయలుదేరివెళ్తారు.
ఏర్పాట్లు పూర్తి..
ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హంద్రీ-నీవా కాలువపై మార్గం సిద్ధమైంది. పైలాన్ నిర్మాణం, సభావేదిక, హజరయ్యే ప్రజలకు కుర్చీలు ఏర్పాటుచేశారు. సీఎం 2.5 కిలోమీటర్లు దూరం రోడ్డుపై ప్రయాణించనుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతాపరంగా తీసుకొవాల్సిన చర్యలపై రాయలసీమ రేంజ్ డీఐజీ బాలక్రిష్ణ, ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సుమారు 1,100మంది భద్రత అందించనున్నారు. సభకు కనీసం 30వేలమంది జనాన్ని రప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..