Gunadala Temple
-
వైభవంగా గుణదల మేరీమాత ఉత్సవాలు
గుణదల (విజయవాడ తూర్పు): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులతో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. బిషప్ రాజారావు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా భక్తులు మరియమాతను సందర్శించి ఆమె చల్లని దీవెనలు పొందుతున్నారన్నారు. క్రైస్తవ మత గురువులు భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. కతోలిక పీఠం చాన్సలర్ ఫాదర్ వల్లె విజయజోజిబాబు, సోషల్ సర్వీస్సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల థామస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్లు పాల్గొన్నారు. -
కొండంత అభిమానం
చీరాల రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఓ యువకుడు కొండంత అభిమానం చూపాడు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేవిజయవాడ గుణదలలోని మేరిమాత ఆలయం (కొండపైకి) వద్దకు మోకాళ్లతో ఎక్కుతానని ప్రతిన బూనాడు. తన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో అతడు ఆదివారం మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గుణదల కొండపైకి మోకాళ్లతో ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. చీరాల హారిస్పేటకు చెందిన మల్లెల రవీంద్రబాబు ఇంటర్ పూర్తి చేసి కొరియర్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. అతడికి వైఎస్ జగన్ అంటే ప్రాణం. ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా తన సొంత ఖర్చులతో హాజరవుతాడు. తనకు వచ్చే సంపాదనలో కొంత మొత్తం కుటుంబానికి ఖర్చుచేసి మిగిలిన కొద్ది మొత్తాన్ని దాచుకుని సమావేశాలకు హాజరవుతుంటాడు. జగన్మోహన్రెడ్డి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కనుక తాను ప్రతి ఏడాది మే 30న మేరీ మాత ఆలయమైన గుణదల కొండపైకి మోకాళ్లతో ఎక్కుతానని ప్రతిన బూనాడు. మోకాళ్లతో కొండపైకెక్కిన రవీంద్ర బాబును పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అభినందించారు. -
గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ : గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు. మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. -
ఘనంగా ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు
విజయవాడ (గుణదల): గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప, గోల్డెన్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ వెంపని, ఫాదర్ టీహెచ్ జాన్ మాథ్యూ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభించారు. బిషప్ టీజే రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోక రక్షకుడైన యేసును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు. ఇన్నేళ్లుగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే మరియమాత ఆశీర్వాదమేనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు. గురువులుగా 50 ఏళ్లు, 25 ఏళ్లు పూర్తిచేసుకున్న వారిని బిషప్ తెలగతోటి అభినందించి, సత్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధుల్లో ఊరేగించారు. మరియమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.