gunjana river
-
ప్రకృతి రమణీయత.. మనసంతా పులకింత
సాక్షి, రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గుంజన జలపాతం ఉంది. ఇది కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికుల దృష్టి ఆకర్షిస్తోంది. ఇక్కడ ఎటువంటి సమయాల్లో కూడా నీరు ఇంకిపోయిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రాంతం బాలపల్లె రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఆ రేంజ్ పరిధిలో 23 వేల ఎకరాలలో శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో ఎంతో విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. కొండల మద్య అందమైన జలపాతం ఎలా వెళ్లాలంటే.. మండలంలోని ప్రధాన రహదారిపై ఉన్న మాధవరంపోడు నుంచి వాగేటికోన వద్ద వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు శేషాచలం అటవీ మార్గం మీదుగా గుంజన జలపాత జారకు కాలినడకన వెళ్లాలి. ఉదయం వెళ్లి అక్కడే వంటవార్పు చేసుకుంటారు. అక్కడ దొరికే చేపలు పట్టి, వండుకోవడం చేస్తూ ప్రకృతి ప్రేమికులు ఈ జలపాత అందాలు ఆస్వాదిస్తుంటారు. దీనితోపాటు విశాలమైన, ఎత్తయిన కొండలు, ఎత్తయిన ఎర్రచందనం వృక్షాలు పచ్చదనం పరుచుకుని ఉంటాయి. ఈ మార్గంలో వివిధ రకాల చెట్లు, పక్షులు చూపరులను ఇట్లే ఆకట్టుకుంటాయి. వంటావార్పు చేసుకుంటున్న ప్రకృతి ప్రేమికులు అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి ఎంతో విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నందున, ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడంతో లోపలికి ఎవరినీ వెళ్లనివ్వరు. జలపాత జార వద్దకు వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి రైల్వేకోడూరు నుంచి 100 కిలోమీటర్ల మేర ఇటువంటి ప్రకృతి అందాలు.. గుంజన జలపాతం వంటి సుందరమైన ప్రాంతం ఎక్కడా లేదని.. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే అక్కడ అలరిస్తున్న జలపాతాలు, ప్రకృతి అందాలను కనులారా చూసే అవకాశం ప్రజలకు దొరకడంతోపాటు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వారు పేర్కొంటున్నారు. -
నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు. శివరామకృష్ణకు నివాళి ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. ఫలించిన కొరముట్ల కృషి శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్ కొరముట్ల -
పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు
-
పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు: వైఎస్ జగన్
భారీవర్షాల తాకిడికి అతలాకుతలమైన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం పర్యటించారు. గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. 27 రోజులుగా వర్షబీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు. ''బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు, బియ్యం, వనరులు ఇచ్చి.. ఆ తర్వాత అధికారులను ఏమైనా అంటే బాగుంటుంది. కానీ ప్రజలు ముఖ్యమంత్రిని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారు. ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోండి. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే బతకగలరు. అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదు. ప్రతి గ్రామంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, తమకేమీ జరగట్లేదని.. బతకడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.