యువత దారి తప్పితే...
చిన్నప్పట్నుంచీ స్నేహితులైన ముగ్గురు యువకులూ, ముగ్గురు యువతులూ పై చదువుల కోసం నగరానికి వచ్చి ఒకచోట కలిసి ఉంటారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గున్నమామిడి కొమ్మ మీద’. విక్కీ, విజయ్, దామోదర్, ప్రియాంక, శిరీష, స్పందన నాయకా నాయికలు. అల్లీపురం దామోదర్ దర్శకత్వంలో కేశవ సిరి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘యువత దారి తప్పితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? అనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. వినోదం మాత్రమే కాదు.. యువతకు చక్కని సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ముస్తఫా, కెమెరా: సాయి, ఎడిటింగ్: కిశోర్.