gurrampode
-
గుర్రంబోడు నిర్వాసితులకు రక్షణ ఏది?
నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా పునరావాస లంబాడ, గిరిజన రైతులు ఆరు దశాబ్దాల నుండి నానా ఇబ్బందులకు గురవు తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు నకు గురైన లంబాడ గిరిజ నుల కష్టాలు నేటికీ తీరలేదు. 1962లో దేవరకొండ ప్రాంతంలోని గువ్వలగుట్ట, కాంచనపల్లికి చెందిన లంబాడ గిరిజనులు సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్నారని సుమారు వంద కుటుంబాలకు మఠంపల్లి మండలంలోని గుర్రం బోడు ఏరియాలో ఎలాంటి బాట సౌకర్యం లేని అటవీ ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయలేదు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదు. దాని కారణంగా వాళ్లే నానా కష్టాలు పడి గుర్రంబోడులో కాలనీ ఏర్పాటు చేసుకు న్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సర్వే నం.540లోని సుమారు 1870 ఎకరాల బంజరు భూమిని నిర్వాసితు లకు కేటాయించి హక్కు పత్రాలు జారీ చేశారు. సాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల మెట్ట పంటలు వేసుకుంటూ గొర్రెలు, మేకలు, పశువులను సాదు కుంటూ జీవిస్తున్నారు. ఆనాటి పాలకులు సాగు నీరు, తాగునీరు అందిస్తామని ఎప్పటికప్పుడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు విస్మరించారు. ఆ ప్రాంతం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నందున నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఈ పునరావాస రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆనాటి అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చి, కృష్ణా నదికి దగ్గరలో ఉన్న వేములూరు వాగు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయించి, దాన్ని కొద్ది కాలంలోనే పూర్తి చేయించి రైతుల భూములకు నీరు అందించే ఏర్పాటు చేయించడం జరిగింది. అట్టి లిఫ్ట్ ద్వారా కొన్ని భూముల్లో వరి పంట, కొన్ని భూముల్లో మెట్ట పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారు. 540 సర్వే నంబర్ భూమిలో మరి కొంతమంది బయటి ప్రాంతాల వారికి, భూమి ఎక్కడుందో తెలి యని వారికి అక్రమ పద్ధతుల్లో అధికారులు లాలూచీ పడి పట్టాలు ఇచ్చారు. వారు ఏనాడూ వ్యవసాయం చేయటంగానీ, భూముల దగ్గరికీ రావడంగానీ జరగ కుండానే పరిశ్రమలు పెట్టుకునే వారికి అమ్ము కున్నారు. ఆ భూములు ఎక్కడున్నాయో అమ్మినవారు గానీ కొన్నవారు గానీ పోడి చేయించుకోలేదు. నాగార్జున సాగర్ ముంపునకు గురైన గిరిజనులకు కేటాయించిన భూములపైకి కార్పొరేట్ కంపెనీలు అక్రమ పద్ధతుల్లో దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించు కోవటానికి పూనుకుంటున్నాయి. గిరిజనులు వేసిన పంట పొలాలు చెడగొట్టడం, వారిపై కిరాయి మను షులతో దాడి చేయించడం, తప్పుడు కేసులు పెట్టడం లాంటివి నిరంతరం చేస్తున్నాయి. దీనితో సమస్య తీవ్రంగా మారి అగ్గి రాజుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు, ఇండ్లు వదిలేసి కట్టుబట్టలతో వచ్చిన ఈ నిర్వాసితులు దశాబ్దాలుగా అన్యాయానికి గురౌతూనే ఉన్నారు. వీరికి కేటాయించిన భూములపైకి ఎవ్వరూ వెళ్ళకుండా రక్షణ కల్పించాలని, వారు వ్యవసాయం చేసుకోవటా నికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించాలని, ఇండ్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. ఆ ప్రాంతంలో కొత్తగా మట్టపల్లి కృష్ణానదిపైన వంతెన నిర్మాణం పూర్తి కావడం, పులిచింతల ప్రాజెక్టు నీళ్ళు ఉండటం వలన కొంతమంది పెట్టుబడిదారుల కన్ను పడి కంపెనీల పేరుతో కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ దస్తావేజులు సృష్టించి భూములను అనుభవించటానికి పూనుకుంటున్నారు. 540 సర్వే నంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉందో సమగ్రంగా సర్వే చేయించి గిరిజనులకు కేటాయించిన భూముల పైకి ఎవ్వరూ వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వాధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల భూములను ధరణి వెబ్సైట్లో చేర్చి వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. భూములన్నింటికీ సాగునీటి సౌకర్యం కల్పిం చాలి. ఈ సమస్య శాంతి భద్రతల సమస్యగా మార కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. - జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
వారికి రివిట్లు ఎక్కించే పరిస్థితి వస్తది: సంజయ్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట /మఠంపల్లి: సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం తలపెట్టిన గిరిజన భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కార్యకర్తలు, గిరిజనులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారుల రాళ్లదాడిలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారు. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని 540 సర్వే నంబర్లో ఉన్న గుర్రంబోడు తండా వివాదాస్పద భూములను పరిశీలించేందుకు గిరిజన భరోసాయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ బృందం ఆదివారం ఇక్కడికి వచ్చింది. సంజయ్‌తోపాటు మాజీ ఎంపీ, సినీనటి విజయశాంతి, మాజీమంత్రులు విజయరామారావు, చంద్రశేఖర్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, ముఖ్యనేతలు పెద్దిరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, సంకినేని వెంకటేశ్వరరావులతోపాటు మరికొంత మంది నేతలు గుర్రంబోడు తండాకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షెడ్డుపై దాడితో ఉద్రిక్తత వివాదాస్పద భూములకు సమీపంలోనే ఓ కంపెనీకి చెందిన రేకుల షెడ్డు ఉంది. సదరు కంపెనీ నిర్వాహకులే తమ భూములను లాక్కుంటున్నారని కొంతకాలంగా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బండితోపాటు ముఖ్యనేతలకు వివరించారు. ఈ క్రమంలో సంజయ్‌తోపా టు నేతలు ఈ షెడ్డు వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు షెడ్డుపైకి రాళ్లు విసిరారు. షెడ్డు రేకులను ధ్వం సం చేశారు. రాళ్లదాడిలో కోదాడ డీఎస్పీ రఘు తలకు, హుజూర్నగర్ సీఐ రాఘవరా వు ముఖానికి గాయాలయ్యాయి. కోదాడ ఎస్ఐ క్రాంతికుమార్ తలకు గాయమైంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన అనంతరం సంజయ్ కార్యకర్తలను సముదాయించి అరకిలోమీటరు దూరంలో ఉన్న సభావేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారికి రివిట్లు ఎక్కించే పరిస్థితి వస్తది: సంజయ్ ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ 540 సర్వే నంబర్లోని 1,876 ఎకరాల్లో గిరిజనులు 70 ఏళ్లుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్నారని, ఈ భూములు వారికే చెందుతాయని అన్నారు. టీఆర్ఎస్ గూండాలు, కబ్జాదారులు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దాడులు చేసి కాళ్లు, చేతులు విరగొట్టి 40 మందిపై అక్రమంగా హత్యాయత్నం కేసులు మోపారని ఆరోపించారు. గిరిజనులపై లాఠీచార్జి చేయించిన టీఆర్ఎస్ నేతల కాళ్ల తొడలకు రివిట్లు ఎక్కించే పరిస్థితి త్వరలో వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కుట్ర పన్ని లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. గిరిజనుల కోసం అవసరమైతే తాను జైలుకైనా వెళ్తానని, జైల్లో కేసీఆర్ కోసం మరో గది ఏర్పాటు చేయిస్తానన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్లో లాఠీలు కొనేందుకు, జైళ్లు కట్టేందుకు నిధులు కేటాయించుకోవాలని ఎద్దేవా చేశారు. గుర్రంబోడు నుంచి మరో కరసేవను ప్రా రంభిస్తున్నామని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ బహిరంగసభలో గిరిజన భూ ముల సమస్యపై సీఎం స్పష్టమైన ప్రకట న చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తాగి ఫాంహౌస్‌లో పడుకొని.. సీఎం పద వి తన ఎడమ కాలితో సమానమని అం టున్నారన్నారు. ఒకప్పుడు పైలట్‌గా పనిచేసిన పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కారు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయశాంతి మాట్లాడుతూ ‘కేసీఆర్ దొర గిరిజనుల భూములను దోచు కుంటున్నార’ని ఆరోపించారు. తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చానని చెప్పి.. కేసీఆర్ కుటుంబమే తెలంగాణను దోచుకుంటోందని, ఇలాంటి వ్యక్తితో తాను పని చేసినందుకు తలదించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా’
సాక్షి, సూర్యాపేట: గుర్రంపోడు గిరిజన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. న్యాయం కోసం పోరాడితే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్,రఘునందన్ రావు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి,మాజీ ఎంపీ వివేక్లతో కలిసి ‘గిరిజన భరోసాయాత్ర’ పేరుతో గిరిజన భూముల సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గిరిజనుల దాడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేవారు. గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క టీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ కరెప్షన్ ఉన్న క్యారెక్టర్ లేని పార్టీ అని విమర్శించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, పేదల బాగోగులే ముఖ్యమని చెప్పారు. పేదల ఉసురు సీఎం కేసీఆర్‌కు తగలకమానదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం: విజయశాంతి అధికారం ఉందని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. టీఆర్ఎస్కు రెండోసారి అధికారం ఇచ్చి ప్రజలు తప్పు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇంకా పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటే తెలంగాణ ఏమై పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ నేతలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని విజయశాంతి చెప్పుకొచ్చారు. -
గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత.. డీఎస్పీకి గాయాలు
సాక్షి, సూర్యపేట : జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వేనంబర్‌లోని గిరిజన భూములను గ్లేడ్ ఆగ్రో కంపెనీ ఆక్రమించింది. దీనికి నిరసనగా ఆందోళన నిర్వహించిన బీజేపీ నేతలు.. గ్లేడ్ ఆక్రమించిన భూముల్లో షెడ్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి పోలీసులపై బీజేపీ నాయకులు దాడికి దిగారు. ఈ దాడిలో కోదాడ డీఎస్పీ, సీఐ, ఎస్ఐతో పాటు పలువురు పోలీసులకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. -
అభివృద్ధికి పట్టం కట్టండి : జానారెడ్డి
గుర్రంపోడు, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండని కాంగ్రెస్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి కోరారు. గురువారం మండలంలోని మొసంగి, చేపూరు, తా నేదార్పల్లి, జూనూతుల, మక్కపల్లి, సుల్తాన్పురం, ఉట్లపల్లి, పోచంపల్లి, తేనపల్లి, కొప్పోలు, గుర్రం పోడు, పాల్వాయి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించానని తెలిపారు. శ్రీశైలం ఎడుమగట్టు కాల్వకు పునాది వేసింది, మండల వ్యవస్థకు ఆధ్యున్ని తానేనని పేర్కొన్నారు. ఊరు, వాడా తెలి యని వాళ్లు కులం పేరుతోనో, మరో రకంగానో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జానారెడ్డికి కులం, మతం లేదని ప్రజలందరి మనిషినని అన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోరతను అధిగమించేందుకు నాలుగు వేల కోట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సోని యా, రాహూల్ హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు కాంగ్రెస్ అమలు చేసిందన్నారు.