guru charan
-
24 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ప్రముఖు నటుడు
అదృశ్చమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్ తిరిగొచ్చాడు. దాదాపు 24 రోజులు తర్వాత ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 24న ముంబయి వెళ్తానని చెప్పి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి వెళ్లిన ఇతడు.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా పనిచేయలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఇప్పుడు గురుచరణ్ ఆచూకీ కనుగొన్నారు. తిరిగొచ్చిన పోలీసులతో గురుచరణ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్ పలు ప్రదేశాలకు వెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ధ్యానం కోసం హిమాలయాలకు కూడా వెళ్లాలనుకున్నాడని పేర్కొన్నారు.హిందీలో పాపులర్ టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో గురుచరణ్.. రోషన్ సింగ్ సోధీ పాత్ర చేశారు. దీనితోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో షో నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఏదైతేనేం గురుచరణ్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ 'షరతులు వర్తిస్తాయి'.. స్ట్రీమింగ్ అందులోనే?) -
అలా దర్శకుడినయ్యా!
‘‘188 సినిమాలకు రచయితగా పనిచేశాను. 1600 పాటలు రాశాను. గురుచరణ్‌గారు నాకు అన్నయ్యలాంటివారు. కుబేర ప్రసాద్‌గారితో కలసి ఓ సినిమా చేయబోతున్నాం. కథ, స్క్రీన్‌ప్లే రాయమన్నారు. తీరా రాసాక ‘నువ్వే దర్శకత్వం వహించాలి’ అన్నారు. అలా నేను ఈ సినిమాకు దర్శకుడినయ్యా’’ అని భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా నటించిన చిత్రం ‘నటన’. భవిరి శెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మి సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ పి.రామ్మోహన్ రావు రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్ మేల్ వెర్షన్‌ను రచయిత జేకే భారవి, ఫిమేల్ వెర్షన్‌ను చాంద్ మాస్టర్ విడుదల చేయగా, ప్రొడక్షన్ లోగోను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ ఆవిష్కరించారు. భారతీబాబు పెనుపాత్రుని మాట్లాడుతూ– ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహాయం లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమాలో మూడు పాటలు ఉండగా మరో పాట పెట్టాలనిపించింది. శ్రీలేఖగారిని ఈ పాటకు సంగీతం చేయమని కోరగా, పదినిముషాల్లో చేసి ఇచ్చారు. ఈ నెలలో పూర్తి ఆడియో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన కుబేర ప్రసాద్, భారతీబాబు గార్లకు థ్యాంక్స్’’ అన్నారు మహిధర్. -
మమ్మల్ని కించపరచకండి!
ఇతరులను నిందించడానికీ, ముఖ్యంగా కిరాతుకుడు వంటి ముద్ర వేయడానికి కొన్ని కింది వర్గాల పేర్లను ఉపయోగించడం పూర్వం ఎక్కువగా ఉండేది. ఈ వర్గాలకు సంబంధించిన వారి పోరాటం ఫలితంగా కొద్దికాలం ఈ ధోరణి ఆగింది. కానీ ఇటీవల మళ్లీ అది తలెత్తుతున్న జాడలు కనిపించడం దురదృష్టకరమని ఆరెకటిక పోరాట సమితి తరఫున సమాజం దృష్టికి తీసుకువస్తున్నాను. ఆరెకటికలు బీసీ డికి చెందిన వారు. కులవృత్తి మేక మాంసం విక్రయిం చడం. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఆ వృత్తి మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ చాలామంది చదువు కుని ఇతర వృత్తులు చేపట్టారు. అయినా వీరి కులం పేరుతో ఉన్న పదాలను దూషణకు ఉపయోగించడం ఆగడం లేదు. కొన్ని సినిమాలలో, టీవీ సీరియళ్లలో, కొన్ని వార్తాపత్రికలలో ‘కటిక’, ‘కసాయి’ అన్న పదాలు ఇంకా ప్రయోగిస్తున్నారు. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. ఈ కులం వారు మాంసం విక్రయించినంత మాత్రాన కర్కోటకులు కాదు. ఇలాంటి పదా లను వాడవద్దని మా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మాల్ఖేదికర్ గురుచరణ్ సమితి రాష్ట్ర కన్వీనర్, సికింద్రాబాద్