
అదృశ్చమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్ తిరిగొచ్చాడు. దాదాపు 24 రోజులు తర్వాత ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 24న ముంబయి వెళ్తానని చెప్పి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి వెళ్లిన ఇతడు.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా పనిచేయలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు.
(ఇదీ చదవండి: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఇప్పుడు గురుచరణ్ ఆచూకీ కనుగొన్నారు. తిరిగొచ్చిన పోలీసులతో గురుచరణ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్ పలు ప్రదేశాలకు వెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ధ్యానం కోసం హిమాలయాలకు కూడా వెళ్లాలనుకున్నాడని పేర్కొన్నారు.
హిందీలో పాపులర్ టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో గురుచరణ్.. రోషన్ సింగ్ సోధీ పాత్ర చేశారు. దీనితోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో షో నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఏదైతేనేం గురుచరణ్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ 'షరతులు వర్తిస్తాయి'.. స్ట్రీమింగ్ అందులోనే?)
Comments
Please login to add a commentAdd a comment