ఆర్ఎస్ఎస్ సిద్థాంతాలకు వ్యతిరేకం: రాహుల్
అసోం: ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువు నష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఉదయం గౌహతి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట ఆయన మాట్లాడుతూ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకమని రాహుల్ పేర్కొన్నారు.
కాగా గత ఏడాది డిసెంబరుల రాహుల్ బార్పేట సత్ర(బౌద్ధ ఆలయం) నుంచి మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ బౌద్థ ఆలయం లోపలకు వెళ్లకుండానే వెనుతిరిగారు. అనంతరం పార్లమెంటులో ఆర్ఎస్ఎస్ తనను బార్పేట సత్రలోకి వెళ్లకుండా అడ్డుకుందని ఆరోపించారు. కొందరు మహిళలను ఉంచి తాను లోపలికి వెళ్లే వీలులేకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ కోర్టులో దావా వేసింది. తమ పరువుకు భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యానించారని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంజాన్ బోరా ఈ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.