'ప్రకృతి వైపరిత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే'
శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో మాజీ మంత్రులు, కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించిన రఘువీరా తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్లే రైతులు నష్టపోయారు అని వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతోనే రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి కోల్పోయారన్నారు. రైతుకు పూర్తి నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే అని రఘువీరా విమర్శించారు.