Halima
-
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
‘నవ’ పారిజాతాలు
ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. గంపెడు సంతానం అంటుంటారు.. మాలీకి చెందిన 27 ఏళ్ల హలీమా విషయానికొస్తే.. గంపెడు సంతానమంటే.. తొమ్మిది మంది!! ఎందుకంటే.. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారందరూ ఆమె పిల్లలే(ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు).. పైగా.. వీరందరూ ఒకే కాన్పులో జన్మించారు!! ఒకరిద్దరికే ఆపసోపాలు పడుతున్న ఈ కాలంలో 9 మంది అంటే మాటలా.. గతేడాది మే 4న వీరు జన్మించారు. ఇప్పటివరకూ చరిత్రలో ఒకే కాన్పులో 9 మంది పుట్టిన ఘటనలు మూడుసార్లు మాత్రమే జరిగాయి.. అయితే.. అలా పుట్టినవారందరూ బతికి ఉండటం మాత్రం ఇదే తొలిసారి.. మొన్న మే 4న వీరందరూ తమ మొదటి పుట్టిన రోజును మొరాకోలోని కాసబ్లాంకాలో జరుపుకున్నారు. కాన్పు కోసం హలీమాను మాలీ ప్రభుత్వం మొరాకోకు తరలించింది. అప్పటి నుంచి ఆమె పిల్లలతో అక్కడే ఉంది. వీళ్లను చూసుకోవడానికి నర్సుల బృందాన్ని కూడా నియమించారు. ఈ ఖర్చులన్నీ మాలీ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నవ శిశువుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వీరందరి అక్క సౌదా(మొత్తంగా 10 మంది పిల్లలు), హలీమా భర్త ఖాదర్ మాలీ నుంచి వచ్చారు. ఖాదర్ మాలీ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇంతమంది పిల్లలు బతికిబట్టకట్టడం అంటే అంతా దేవుడి దయేనని ఈ సందర్భంగా ఖాదర్ అన్నారు. -
ఆనంద సాగరంలో ఆమినా..!
అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు. హలీమా కాస్త భయంగా, ఆశ్చర్యంగా వారివైపు చూసింది. కాని ఏమీ సమాధానం చెప్పలేదు.ఆమెనుండి సమాధానం రాకపోయినా, ఆ చిన్నారి ఎవరో వారు పసిగట్టి, తమలో తాము గుసగుసలాడుకున్నారు. ‘మన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఆదరణకర్త నిస్సందేహంగా ఇతనే. ఏదో ఒకటి చేసి మనం ఈ పిల్లాడిని తీసుకువెళితే బావుంటుంది’ అనుకుంటున్నారు వాళ్లు.వాళ్ల గుసగుసలు చూసి హలీమా మనసు కీడు శంకించింది. ‘వీళ్ల వాలకం చూస్తే పిల్లాడిని ఎత్తుకెళ్లినా ఎత్తుకెళ్తారు’ అనుకుంటూ, ఊపిరి బిగబట్టి చిన్నగా అక్కడి నుండి జారుకుంది. ‘ఇక లాభంలేదు. ఎలాగూ రెండేళ్లు గడిచాయి. బాబు పాలుతాగడం కూడా మానాడు. వెంటనే బిడ్డను తల్లికి అప్పగించాలి’ అనుకొంది. కాని, రెండేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని ఇంత తొందరగా వదులుకోవడానికి మనసు అంగీకరించంలేదు. కాని తప్పదు. బిడ్డ క్షేమంగా ఉండాలంటే గుండెను రాయి చేసుకోవాల్సిందే. అనుకొని మరునాడే మక్కాకు బయలుదేరింది హలీమా, చిన్నారి ముహమ్మద్‌ను వెంటబెట్టుకొని. సుదీర్ఘ ఎడబాటు తరువాత తన ఆశల పంటను చూసుకున్న ఆమినా ఆనందం అవధులు దాటింది. మమతానురాగాలతో కళ్లు నిండుకుండలయ్యాయి. కలలన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదలాడసాగాయి. అటు తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ విషయం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సంతోష సాగరంలో తేలియాడుతున్నారాయన. ‘ఈ రోజు కొడుకు అబ్దుల్లాహ్ ఉంటే, బిడ్డను చూసుకొని ఎంతగా మురిసిపోయేవాడో! కాని, విధిరాతను ఎవరు మార్చగలరు?’ అని మనసుకు సర్దిచెప్పుకున్నారు. అయితే చిన్నారి ముహమ్మద్ మక్కా వచ్చిన కొన్నాళ్లకే పట్నంలో ఏదో అంటువ్యాధి ప్రబలింది. చూస్తూ చూస్తూనే జనం మృత్యువాత పడుతున్నారు. మృత్యుదూత ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పట్నం వెలుపల కొత్త కొత్త సమాధులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి చూసి ఆమినా నిలువెల్లా వణికిపొయ్యారు. తన బిడ్డ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం క్షేమకరం కాదని భావించి, వెంటనే ఆయా హలీమాను పిలిపించి, మళ్లీ ఆమె వెంట పంపించి వేశారు. చిన్నారి ముహమ్మద్‌కు హలీమా తమ ఇంట్లోని మేకపాలు అలవాటు చేసింది. విచిత్రం ఏమిటంటే, చిన్నారి ముహమ్మద్ ఒక్క స్తన్యాన్ని మాత్రమే నోట్లో పెట్టుకొని పాలు తాగేవాడు కాని, రెండో దాని జోలికి పోయేవాడు కాదు. అంటే ఆ పాలు తన సోదరి షీమా కోసం ఉంచేవాడన్నమాట. అంత పసితనంలోనే అంతటి న్యాయదృష్టిని చూపుతున్న చిన్నారి ముహమ్మద్ పెద్దవాడయ్యాక ఇంకెంతటి న్యాయశీలతను ప్రదర్శిస్తాడోనని హలీమా దంపతులు ఎంతో మురిపెంగా చెప్పుకునేవారు. ‘ఆమినా ముద్దుల బిడ్డ పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని నీతి, న్యాయం, ధర్మం, సమానతలతో కచ్చితంగా నింపేస్తాడు. అందుకే ఆయమ్మ ఆమినా కూడా, ‘ఈ పసిబిడ్డ ముందుముందు మహోజ్వల చరిత్ర సృష్టిస్తాడని ధీమాగా చెప్పింది. ఆ మాతృమూర్తి కలలన్నీ ఒక్కొక్కటి నిజమవుతున్నాయి’ అన్నది హలీమా భర్తతో. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
ఎంత పెద్ద కష్టమో..!
ఈ అబ్బాయి పేరు కలీం. ఉండేది గుర్గావ్ సమీపంలోని ఓ చిన్న గ్రామం. భారీ పరిమాణంలో పెరిగిపోయిన ఈ కుర్రోడి చేతులు డాక్టర్లకు సైతం పెద్ద సవాల్‌గా మారాయి. కలీం తండ్రి హషీం రోజు కూలీ. తల్లి హలీమా భిక్షాటన చేస్తోంది. సాధారణ శిశువు కంటే రెండింతల పెద్దగా ఉన్న చేతులతో జన్మించిన తమ కుమారుడిని చూసి వారు తల్లడిల్లారు. తమది అరకొర సంపాదనే అయినా, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కుమారుడ్ని చాలా మంది వైద్యులకు చూపించారు. కానీ వారెవరూ కూడా అతడికి ఉన్న వ్యాధి ఏమిటో కనుకోకలేకపోయారు. ఈ క్రమంలో కలీం ఎదుగుతున్న కొద్దీ అతడి చేతులు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఒక్కో అర చేయి ఏకంగా 13 అంగుళాల పొడవు, దాదాపు 12 కిలోల బరువు ఉంది. ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసున్న కలీం.. పెద్దపెద్ద చేతులు కారణంగా చిన్నచిన్న పనులు సైతం చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అన్నం కూడా అమ్మ తినిపించాల్సిందే. రెండు వేళ్ల మధ్య గ్లాసు పట్టుకుని మంచినీళ్లు మాత్రం తాగుతాడు. స్కూళ్లో మిగతా పిల్లలు నీ చేతులు చూసి భయపడుతున్నారని టీచర్లు చెప్పడంతో బడికి వెళ్లడం మానేశాడు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన కలీం.. బ్యాటింగ్‌లో మాత్రం బాగానే దుమ్ము దులుపుతాడండోయ్. ఇటీవలే గుర్గావ్లోని ఓ వైద్య నిపుణుడు కలీంను పరీక్షించి, చికిత్స చేస్తే అతడి చేతులు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఈ అబ్బాయి తల్లిండ్రుల్లో ఆశలు చిగురించాయి. తమ కుమారుడికి చికిత్సకు అవసరమైన సొమ్మును ఎలాగైనా సంపాదించాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.