Hammer attack Murder
-
హత్య చేసి పారిపోతూ....మృతదేహంతో సెల్ఫీ వీడియో!
చిన్నచిన్న వాటికే పెద్దగా రియాక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుని కటకటాల పాలవుతున్నారు చాలామంది. ఏ చిన్న బాధ, అవమానం కలిగిన అవతలవాళ్లను కడతేర్చాలనేంత ఉద్రేకానికి గురవ్వడం...ఇరు జీవితాలను తెలియకుండానే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్‌కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆ తర్వాత పంకజ్ ఇంటి యజమానికి సురేష్, అతని కొడుకు జగదీష్‌లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్ ఇంటి యజమాని సురేష్ చాలా ఘోరంగా అవమానంగా తిట్టడాని, అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్‌కి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదు పంకజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు కూడా. ఐతే జగదీష్‌కి పంకజ్ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్ ఇంటికి వచ్చి చూస్తాడు. అంతే అక్కడ తండ్రి మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో సురేష్‌ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్ వెళ్లిపోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్‌కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది. (చదవండి: రాజస్థాన్ దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. నీళ్ల కుండే లేదంట!!) -
సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు
సాక్షి, దుండిగల్: ఓ వ్యక్తి సుత్తితో తలపై మోది భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, మన్నెపల్లి గ్రామానికి చెందిన బస్వరాజు రాజ్‌కుమార్, శిల్ప(38) దంపతులు. 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్ ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా శిల్ప గృహిణి. వారికి శివానీ, పవన్ సంతానం. శివానీకి డీపోచంపల్లికి చెందిన హరీష్‌తో వివాహం కాగా, పవన్ సూరారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో 10వ తరగతి చదువుతున్నాడు. కుమారుడికి స్కూల్ దూరంగా ఉండడంతో నెల రోజుల క్రితం రాజ్‌కుమార్ భవానీ నగర్‌కు మకాం మార్చాడు. సోమవారం రాత్రి పవన్ రోడా మేస్త్రీనగర్‌లోని తన బావ దుకాణానికి వెళ్లి అక్కడే పడుకున్నాడు. అదే రోజు రాత్రి శిల్ప, రాజ్‌కుమార్ మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రాజ్‌కుమార్ సుత్తితో శిల్ప తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లి పోయిన రాజ్‌కుమార్ మంగళవారం ఉదయం హరీష్‌కు ఫోన్ చేసి ‘ మీ అత్తకు నాకు చిన్న గొడవ జరిగింది.. ఆమెను కొట్టాను, బతికి ఉందో.. చనిపోయిందో.. వెళ్లి చూడని’ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో హరీష్ తన భార్య శివానీతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా శిల్ప అప్పటికే మృతి చెందింది. హరీష్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను సుత్తితో మోది చంపిన భర్త
ఆత్మహత్య చేసుకుంటానని కూతుళ్లతో పరార్ ముషీరాబాద్: తలపై సుత్తితో మోది భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో దుర్మార్గుడు. అనంతరం ఇద్దరు పిల్లల తో కలసి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి ఇంటి నుంచి పరారయ్యాడు. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గురువారం ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో నివసించే మహ్మద్ షబ్బీర్ అహ్మద్(45), ఫర్హానాభాను(38) దంపతులకు కుమారుడు ఎండీ జాఫర్(18), కుమార్తెలు సోఫియానూర్(16), ఆయేషాసిమ్రాన్(14) సంతానం. షబ్బీర్ భోలక్‌పూర్ ఇందిరానగర్‌లో ఫ్లోర్ పాలిషింగ్ వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లి.. రాత్రి ఒంటి గంటకు ఇంటికి తిరిగి వచ్చారు. కాగా, గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో షబ్బీర్ భార్య ఫర్హానా భాను తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం కుమార్తెలు సోఫియానూర్, ఆయేషాసిమ్రాన్‌లను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు అతను తన కుమారుడు జాఫర్ నుద్దేశించి హిందీలో లేఖ రాశాడు. అందులో ‘‘భార్య అంటే తనకు ఇష్టమేనని, ఆర్థిక ఇబ్బందులు కారణం చంపేశానని, ఆత్మహత్య చేసుకొనేందుకు ఇద్దరు కుమార్తెలను తీసుకొని వెళ్లిపోతున్నానని, డబ్బు కోసం తన ఇంటికి ఎవ్వరూ రావడం ఇష్టం లేదని’’ రాశాడు. కాగా, ఉదయం 11 గంటలకు కుమారుడు జాఫర్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. తన తండ్రి, ఇద్దరు చెల్లెళ్లు కనిపించడం లేదని చెప్పాడు. నీ తల్లి ఎక్కడ అని పోలీసులు ప్రశ్నించగా... తండ్రి చంపేశాడని చెప్పాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా, భార్యను హత్య చేసి కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిన షబ్బీర్ అహ్మద్ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో షబ్బీర్ భార్యను హత్య చేశాడా? ఇతర కారణాలున్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.