'అందుకే ఆ ప్రాజెక్ట్‌ల అంచనాలు పెంచాం'
విజయవాడ: హంద్రి-నీవా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే అంచనాలను పెంచామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో 6 వేల కోట్లు అవినీతి జరిగిందనడం అవాస్తమని అన్నారు. బుధవారం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పనులు వేగవంతం చేసేందుకే గాలేరు- నగరి, బోరకల్లు.. హంద్రి-నీవా ప్రాజెక్టుల అంచనాలు పెంచామని చెప్పారు.
ఏపీ కేబినెట్లో రెండు, మూడు సార్లు చర్చించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై చర్చించారని తెలిపారు. సవరించిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను త్వరలో పూర్తి చేస్తామని మంత్రులు పల్లె, దేవినేని ఉమ స్పష్టం చేశారు.