breaking news
Handshake Row
-
ఓడిపోయామన్న బాధ లేదు.. నేనే గనుక అక్కడి ఉంటేనా..! కథ వేరే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్‌హ్యాండ్’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్లు ఆసియా కప్ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామాఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్ ఆడే మ్యాచ్‌లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్ మ్యాచ్‌లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్- పాక్ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?ఈ నేపథ్యంలో పాక్ వ్యవహారశైలిపై అశ్విన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్‌షేక్ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..అయినా ఆండీ పైక్రాఫ్ట్ ఏమైనా స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది? మీతోనే సారీ చెప్పించుకునేవాడినినేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును అశ్విన్ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్ నాటకం ఆడిన పాక్.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. -
అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్‌ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.అంపైర్‌పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
Asia Cup 2025: పాక్ 'బాయ్‌కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్‌తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్‌హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్‌హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్‌తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్‌తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్‌కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్‌కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్‌లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్‌షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్‌షేక్' గురుంచి పైక్రాఫ్ట్‌కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్‌కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్‌కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్‌కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్‌లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం
భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం.కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్‌కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్‌షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్‌లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
'అలా ఎక్కడా రాసి లేదు'.. షేక్హ్యాండ్పై పాక్‌కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్‌తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్ -
ముదురుతున్న IND-PAK 'షేక్ హ్యాండ్' వివాదం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్‌కు ఏం సంబంధం..?నిన్నటి భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్‌గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్‌పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్మన్షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్‌హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్‌రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్‌హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్‌హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
‘అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్ ఇలా’
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్‌కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.ఆ తర్వాత కూడా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఓడించిన సూర్య సేన.. ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్ జరిగింది.నో షేక్‌హ్యాండ్!స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్‌పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్‌హ్యాండ్ గానీ లేకుండానే వెనుదిరిగారు.ముఖం మీదే తలుపు వేశారు!ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు ఇండియన్ డ్రెసింగ్ రూమ్ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్‌హ్యాండ్’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి. ఈ విజయం ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!కాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్‌కు నిరాకరించినట్లు ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాక్ స్కోరు: 127/9 (20)👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
‘షేక్ హ్యాండ్’ లేదు!
సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్ యాదవ్ గానీ ఇటు సల్మాన్ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు. టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్‌ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు!