Harappan culture
-
ప్రాచీన భారతంలో వ్యవసాయ తత్వం
హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. క్రీ.పూ. 2600లో నిర్మితమైన చైనా తొలి నగరం చాంగ్జౌలో కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం ఆనవాళ్లు దొరకలేదు. అంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. అయితే చైనా వ్యవసాయ తత్వం చైనా చరిత్రలో భాగం. అదే భారతదేశంలో అలా జరగలేదు. ఒక తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా భావించారు. పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. నా తాజా పుస్తకం ‘ద శూద్ర రెబెలియన్’ కోసం పరిశోధిస్తున్నప్పుడు, పూర్వ వేద కాలంలో వ్యవసాయవాదపు (అగ్రికల్చరిజం) తాత్విక ధార ఉందో లేదో తెలుసుకోవడానికి పురాతన భారతీయ సాహిత్యం పరిశీలించాను. రాతపూర్వక ఆధారాలు ఏవీ దొరకలేదు. పురాతన చైనా, గ్రీస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లో అటువంటి స్రవంతులు ఉండే అవకాశాలను పరిశీలించాను. భారతదేశమే కాకుండా ఈ దేశాలు కూడా పురాతన ఆలోచనా విధానాలకు ప్రధాన నిర్మాతలు అని మనందరికీ తెలుసు. పురాతన చైనాలో చాలా శక్తిమంతమైన వ్యవసాయవాదపు ఆలోచన ధార ఉందని గుర్తించాను. ఇది క్రీస్తు పూర్వం 770 నుండి 221 మధ్య వృద్ధి చెందింది. వ్యవసాయం గురించి ప్రచారం చేసిన, రాసిన ఆ ప్రధాన తత్వవేత్త జు జింగ్ (క్రీస్తు పూర్వం 372–289). ఇది చైనా చరిత్రలో భాగమైంది.నిజానికి భారతీయ వ్యవసాయ నాగరికతా చరిత్ర చైనీస్ నాగరికతకు పూర్వం నాటిది. ఆర్యులకు పూర్వం భారతీయులు హరప్పా నాగరికతను నిర్మించినప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందిన వ్యవసాయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఆనాటికి చైనాలో అంత అధునాతన వ్యవసాయ నాగరికత లేదు. చైనా తొలి నగరం చాంగ్జౌ. ఇది క్రీ.పూ 2600లో స్థాపించబడింది. హరప్పా నాగరికత దీని కంటే చాలా పురాతనమైనది. పైగా చైనీస్ నగరం చిన్నది; కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం, కాంస్య పనిముట్ల వంటి ఆధారాలు దొరకలేదు.హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ సన్నిహిత సంబంధం ఉన్న మానసిక అభివృద్ధి ప్రక్రియలు. వేదాలకు పూర్వం భారతదేశం ఆ మిశ్రమ ఆలోచనా విధానాన్ని కలిగి ఉంది.వ్యవసాయం, వేదాలువేదాలు లిఖితరూపం దాల్చి, గ్రంథాలుగా లిఖితమైన తరువాత, తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా పరిగణించారు. విషాదంగా ఆ ఆలోచనా స్రవంతి మెల్లగా ఉనికిలో లేకుండా పోయింది. దీని ఫలితంగా ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయ, చేతివృత్తుల శాస్త్రంలో, ఉత్పత్తిలో భారీ స్తబ్ధత ఏర్పడింది. తోలు సాంకేతికతను అంటరానిదిగా పరిగణించడం; దాని ఉత్పత్తిదారులతో పాటు, పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా ఎన్నడూ చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. అప్పుడు ముస్లిం పాలకులు భిన్నమైన తత్వశాస్త్రంతో వచ్చారు. కానీ తమ పరంపర ప్రకారం కులంలో దైవత్వం ఉందనీ, శూద్ర, దళిత, ఆదివాసీలకు విద్యను అందించడం దేవుని మార్గదర్శకత్వంలో లేదనే పండితులు త్వరగా ముస్లింల చుట్టూ మూగిపోయారు.మరో మాటలో చెప్పాలంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. మన జాతీయవాదపు పునాది తత్వశాస్త్రం వ్యవసాయ సంస్కృతే తప్ప వేద సంస్కృతి కాదు. కుల సంస్కృతి వ్యవసాయవాదం గురించి రాయడానికీ, దానిని సంరక్షించడానికీ అనుమతించలేదు. ఎందుకంటే, ఆర్యన్ పూర్వ హరప్పన్ లు అభివృద్ధి చెందిన లిపిని కలిగిలేరు; వైదిక అనంతర కాలంలోనేమో వ్యవసాయదారులను నాల్గవ వర్ణంగా లేదా శూద్ర బానిసలుగా ప్రకటించారు. ఇందులో ప్రస్తుత రెడ్లు, కమ్మలు, కాపులు, మరాఠాలు, పటేళ్లు, జాట్లు, మొదలియార్ల నుండి చాకలి వంటి శూద్ర కులాలన్నీ ఉన్నాయి. క్షురకులు (మంగలి) కూడా వీరిలో ఒక భాగం. అందువల్ల బ్రిటిష్ పాలకులు వారందరికీ పాఠశాలలు తెరిచే వరకు, శూద్ర కులాలకు చదవడానికీ, రాయడానికీ అనుమతి లేదు. అక్బర్ వంటి ముస్లిం రాజులు కూడా, శూద్రులను పర్షియన్ విద్యకు దూరంగా ఉంచాలని చెప్పిన బ్రాహ్మణ పండితుల సలహాను అనుసరించారు. ఇప్పుడు కూడా ఆ చారిత్రక నిరక్షరాస్యత శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీకంపై తన ప్రభావం చూపుతున్నది.ఆర్థికంగా దృఢంగా ఉన్న శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడు కూడా తత్వశాస్త్రంతో నిమగ్నమై ఉండకపోవడానికి కారణమవుతున్న ఈ అడ్డంకులను నా పుస్తకం పరిశీలిస్తుంది. చాలావరకు ఆర్ఎస్ఎస్ ప్రాపంచిక దృక్పథంతో ప్రభావితులైన సమకాలీన ద్విజులు వ్యవసాయ తత్వశాస్త్రంతో సంబంధం కలిగి ఉండరు. భారతీయ తత్వానికి మూలం వేదాలు అని వారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కానీ వేదాలు వ్యవసాయ ఉత్పాదక క్షేత్ర తత్వాన్ని ప్రతిబింబించలేదు. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తాత్విక ఆలోచనలను ఉత్పత్తి చేయగలరని ద్విజ చింతనాపరులు ఇప్పటికీ భావించడం లేదు. వారు వ్యవసాయ తత్వశాస్త్రం, వేదవాదం మధ్య గోడను నిర్మించారు. ఈ గోడ వ్యవసాయ ఉత్పత్తిలో సృజనాత్మకతను నాశనం చేసింది. ప్రస్తుత కాలంలో చైనాలో, ఐరోపాలో జరిగిన విధంగా మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి ఈ వాదం అనుమతించలేదు.మంచి ఉత్పత్తి, భూమి, విత్తనాల మధ్య సంబంధం గురించీ; నేల స్వభావం, విత్తనాలు, జంతువులు, మానవులతో దాని సంబంధం గురించీ అనేక తాత్విక దర్శనాలు గ్రామ వ్యవసాయ సమాజాలలో ఉన్నాయి అనేది వాస్తవం కాదా? మన గ్రామాల్లో ఇప్పటికీ తాత్విక ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తున్నాయా, లేదా? అవును, అవి పని చేస్తున్నాయి. ఒక ప్రదేశంలో వేట, చేపలు పట్టడం అనేవి తగినంత ఆహారం అందించలేనప్పుడు, మొక్కలు, ధాన్యం, పండ్లు, భూమి, నీటి చుట్టూ ఉన్న తాత్వికత మాత్రమే ఆహారం అందించగలిగింది. ప్రత్యామ్నాయ పద్ధతివ్యవసాయానికి సంబంధించిన భారతీయ తత్వాన్ని పునర్నిర్మించడానికీ, హరప్పా వ్యవసాయం నుండి దాని మూలాలను గుర్తించడానికీ ప్రస్తుత గ్రామ స్థాయి వ్యవసాయ ప్రజానీకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.పైన పేర్కొన్న పుస్తకంలో శూద్ర వ్యవసాయవాదం, భారతీయ నాగరికత అనే అధ్యాయం ఉంది. ఇది నిజానికి చైనీస్‌తో పోల్చి చూస్తే మన వ్యవసాయ తత్వశాస్త్రపు ప్రాథమిక అధ్యయనం. భారతదేశంలోని వ్యవసాయ కార్యకలాపాలు భౌతికవాదంతో ముడిపడి ఉన్న తాత్విక ఆలోచనలను ఎలా కలిగి ఉంటాయో ఇది నిర్వచిస్తుంది. మతం మాత్రమే తత్వశాస్త్రంతో ముడిపడి ఉందన్నది హిందుత్వ అభిప్రాయం. వాస్తవానికి ఋగ్వేదం రాయకముందే, రామాయణ, మహాభారతాలు రాయకముందే వ్యవసాయ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక తత్వశాస్త్రం కంటే లోతుగా ఇక్కడ పాతుకుని ఉంది.వ్యవసాయదారులను శూద్ర బానిసలుగా అణచివేయడం ద్వారా వేదవాదులు వ్యవసాయవాద తత్వాన్ని కూడా అణచివేశారు. పైగా వ్యవసాయ వ్యతిరేక తాత్విక ఆలోచనా ధోరణి కొనసాగింది.అయితే, భారతీయ వ్యవసాయ విధానంపై చాలా కొత్త అధ్యయనాలు జరగాల్సి ఉంది. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం కాబట్టి దీనికి వైదికం, వేదాంతం, ద్వైతం, అద్వైతం కంటే ఉన్నతమైన హోదా ఇవ్వాలి. మనం ఒక సృజనాత్మక దేశంగా మనుగడ సాగించడానికి వ్యవసాయవాదం వంటి గొప్ప తాత్విక ధోరణులను తిరిగి ప్రోత్సహించాలి. వ్యవస్థీకృత మతాలు ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా లేవు. అనేక శతాబ్దాల తరువాత అవి ఉండకపోవచ్చు. కానీ ఈ భూమిపై మానవ జీవితం ఉన్నంత కాలం ఉత్పత్తి, పంపిణీ తత్వశాస్త్రం మానవ జీవితంలో భాగంగా ఉంటుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (డిసెంబర్ 8న గుంటూరులో ‘ద శూద్ర రెబిలియన్’ ఆవిష్కరణ)- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ధోలావీరాకు యునెస్కో గుర్తింపు
ధోలవిరా: హరప్పా నాగరికత కాలం నాటి నగరం ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యునెస్కో మంగళవారం ప్రకటించింది. చైనాలోని ఫుఝౌలో జరుగుతున్న 44వ యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాల్లోనే తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రకటించడం తెల్సిందే. తాజా ప్రకటనతో భారత్‌లోని మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరినట్లయింది. అదేవిధంగా, గుజరాత్లో యునెస్కో గుర్తించిన ప్రాంతాల జాబితాలో పావగఢ్ సమీపంలోని చంపానెర్, పటన్‌లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్ సరసన నాలుగో ప్రాంతంగా ధొలావి చేరింది. భారతదేశ చరిత్రలో గుజరాత్ రాష్ట్రం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం ఖదీర్ దీవిలో ధోలావీరా మహానగరానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1,800 సంవత్సరం వరకు సుమారు 1,200 ఏళ్లపాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. ఆనాటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి. -
వావ్.. 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్ లడ్డూలు..
న్యూఢిల్లీ : అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన ప్రజలు లడ్డూలు తినే వారన్న సంగతి తెలిసిందే. 2017లో జరిపిన తవ్వకాల్లో 7 లడ్డూలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోధుమ రంగులో ఉన్న ఈ లడ్డూలు ఒకే సైజును కలిగి ఉన్నాయి. వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి క్రీస్తు పూర్వం 2500 సంవత్సరానికి చెందినవని తేల్చారు. ఈ లడ్డూలపై జరిపిన పరిశోధనలకు సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా వెలువడింది. దీనిపై పురావస్తు శాస్త్రవ్తేత ఆగ్రిహోత్రి మాట్లాడుతూ.. వాటిపై భాగం బాగా గట్టిపడటంతో ఇంత కాలం పూర్తిగా పాడవకుండా ఉన్నాయని అన్నారు. వీటిపై నీళ్లు పడినపుడు వాటి రంగు మారుతోందని తెలిపారు. ఈ లడ్డూలు అన్నీ బార్లే, గోధుమ, బఠాణీలు మరికొన్ని తృణ, పప్పు ధాన్యాలతో తయారు చేశారని, ఈ విషయం మైక్రోస్కోపిక్ పరిశోధనల్లో తేలిందని వెల్లడించారు. వ్యవసాయ ఆధారితులైన హరప్పా ప్రజలు అత్యధిక మాంసపుకృతులు కలిగిన పదార్ధాలను ఆహారంగా తీసుకునేవారన్నారు. రెండు ఎద్దు బొమ్మలు, ఓ ఆయుధంతో పాటు ఈ లడ్డూలు దొరికాయని చెప్పారు. హరప్పా ప్రజలు వీటిని కొన్ని రకాల పూజల కోసం వాడేవారని పేర్కొన్నారు. చదవండి, చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. బైకర్‌ను ఆపిన పోలీస్.. చేతులెత్తి దండం పెడతారు! -
మేఘాలయ యుగం!
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల గురించి విని ఉంటారు... ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు సంబంధించినవి.. మరి ఆధునిక సైన్స్ ఏం చెబుతోంది? గతం గురించి కాకపోయినా.. ఇటీవలి కాలం మాత్రం మేఘాలయ యుగానిదంటోంది! ఎందుకలా? సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి ఇప్పటివరకూ బోలెడన్ని ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జీవం పుట్టుక మొదలుకొని.. వేర్వేరు కారణాలతో జీవజాతులు దాదాపుగా అంతరించిపోవడం వరకూ ఉన్న ఈ ఘటనల ఆధారంగా శాస్త్రవేత్తలు భూమి చరిత్ర మొత్తాన్ని కొన్ని యుగాలుగా విడదీశారు. స్థూలంగా పాలియోజోయిక్, మెసోజోయిక్, సెనోజోయిక్ అనే మూడు భాగాలు ఉంటే.. మళ్లీ ఒక్కోదాంట్లో ఉప విభాగాలూ ఉన్నాయి. ఈ విభజన ప్రకారం మనం ప్రస్తుతం సెనోజోయిక్ భాగంలోని హాలోసీన్ యుగంలో ఉన్నాం! ఒకప్పుడు మంచుముద్దగా ఉన్న భూమిపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని.. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయన్న ఘటనకు పెట్టిన పేరిది. సుమారు 11,700 ఏళ్ల చరిత్ర ఉంది హాలోసీన్కు. అయితే ఈ మధ్య కాలంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు మేఘాలయలో లభ్యమైన కొన్ని ఆధారాలు మొత్తం చరిత్రను మలుపు తిప్పేవే. దీంతో 4,200 ఏళ్ల క్రితం నుంచి ఇటీవల ఉన్న కాలాన్ని.. కచ్చితంగా చెప్పాలంటే 1950 వరకూ ఉన్న కాలాన్ని ‘‘మేఘాలయ యుగం’’అని పేరు పెట్టాలని శాస్త్రవేత్తలు తీర్మానించారు. – సాక్షి, హైదరాబాద్ నాగరికతలను మింగేసిన కరువు మొదలైంది అప్పుడే... హరప్పన్ నాగరికత అంతరించి పోయిందెలా? దశాబ్దాల కరువని సైన్స్ చెబుతోంది! మరి దక్షిణ అమెరికాలోని మాయన్ నాగరికత మాటేమిటి? అవి కూడా కరువు కాటకాలతోనే కానరాకుండా పోయాయి. పర్షియా ప్రాంతపు సుమేరియన్, ఈజిప్టులోని నైలు నదీ నాగరికతల పరిస్థితి కూడా ఇంతే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నాగరికతలన్నీ సుమారు 4,200 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా అంతరించిపోవడం. మేఘాలయలోని ఒక రకమైన రాయి (స్టాల్గమేట్)తో కూడిన గుహల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినప్పుడు ఆ కాలం నాటి గుర్తులు కొన్ని రసాయనాల రూపంలో బయటపడ్డాయి. కరువు కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రాళ్లలో కనిపించింది. నాగరికతలు అంతరించిపోవడమన్నది భూమి చరిత్రలో కీలకమైన ఘట్టం కాబట్టి.. అందుకు ఆధారాలు లభించిన ప్రాంతం మేఘాలయ ఆధారంగా దీన్ని కొత్త యుగంగా గుర్తించాలని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీ అనే సంస్థ ప్రతిపాదించింది. హాలోసీన్ యుగంలో కొంత భాగాన్ని నార్త్‌గ్రిప్పియన్ యుగంగానూ.. మిగిలిన భాగాన్ని మేఘాలియన్ యుగంగానూ గుర్తించాలన్న ఈ సంస్థ ప్రతిపాదనను ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియలాజికల్ సైన్సెస్ ఆమోదించాల్సి ఉంది. -
దేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు?
సింధూ నాగరికతకు సమకాలీన ప్రపంచ నాగరికతలకంటే విశాలమైన పరిధి ఉంది. ఇది భారతదేశంలో దాదాపు 1.3 మిలియన్ల చ.కి.మీ. ప్రాంతంలో విస్తరించింది. దీనికి సంబంధించి భారత్, పాకిస్థాన్‌లో 1400 స్థావరాలు బయటపడ్డాయి. ప్రధానంగా సింధూనది, దాని ఐదు ఉపనదులైన రావి, బియాస్, సట్లేజ్, జీలం, చీనాబ్ పరీవాహక ప్రాంతాల్లో విలసిల్లినందువల్ల దీన్ని సింధూ నాగరికత లేదా సింధూలోయ నాగరికతగా వ్యవహరిస్తారు. ఈ నాగరికత సరిహద్దులు తూర్పున-అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన - సుట్కజెండార్ వరకు, ఉత్తరాన - మాండా నుంచి దక్షిణాన - దాయిమాబాద్ వరకు విస్తరించాయి. పట్టణ నాగరికత ఈ నాగరికతా కాలాన్ని మొదటి నగరీకరణ యుగంగా పేర్కొంటారు. దీని తర్వాత మళ్లీ బుద్ధుని కాలం వరకూ నగరాలు కనిపించవు. సింధూ నాగరికతకు సంబంధించి దాదాపు 250 వరకు పట్టణాలను కనుగొన్నారు. వీటిలో ముఖ్యమైనవి.. హరప్పా: దయారాం సాహ్ని ఆధ్వర్యంలో తొలిసారిగా తవ్వకాలు చేసింది హరప్పాలోనే. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణాలు.. ఒకే వరుసలో నిర్మితమైన ఆరు ధాన్యాగారాలు, హెచ్ ఆకారంలో ఉన్న శ్మశాన వాటిక, కోట మొదలైనవి. మొహెంజొదారో: ఈ పదానికి సింధీలో ‘మృతదేహాల మట్టిదిబ్బ’ అని అర్థం. ఇక్కడ తవ్వకాలకు నేతృత్వం వహించింది ఆర్.డి. బెనర్జీ. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణం మహాస్నానవాటిక. దీంతోపాటు ధాన్యాగారం, పా లనా భవనం, అసెంబ్లీ హాలు వంటి కట్టడాలు వెలుగు చూశాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం, నేసిన వస్త్రం మొదలైనవి ఇక్కడ బయటపడిన ఇతర ముఖ్య అవశేషాలు. చన్హుదారో: ఇది మొహెంజొదారో లానే సింధూ తీరంలో వెలసిన మరో నగరం. ఇక్కడ మొదట ఎం.జి.మజుందార్ తర్వాత మాకే తవ్వకాలు నిర్వహించారు. దీనికి కళాకారుల నగరమని పేరు. అంతేకాకుండా ఇది కోట గోడలేని ఏకైక నగరం. లోథాల్: దీనికి కూడా మృతులదిబ్బ అని పేరు. ఇక్కడ తవ్వకాలు చేసింది ఎస్.ఆర్.రావు. ఇది భాగావో అనే నదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లింది. ఇక్కడ ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు బయటపడినందువల్ల సతీ సహగమనం దురాచారం అమల్లో ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధూ నాగరికతకు సంబంధించిన ఏకైక కృత్రిమ ఓడరేవు ఇక్కడ వెలుగుచూసింది. ఇంకా హోమగుండాలు, చదరంగం ఆటకు సంబంధించిన ఆధారాలు, కాంస్యపు కొలబద్ధలు, వస్త్రపు గుర్తును కలిగి ఉన్న ముద్రలు (సీల్స్) ఇక్కడ లభించాయి. కాలీబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది. ఇది ఘగ్గర్ (ప్రాచీన సరస్వతి) నది ఒడ్డున వెలసింది. ఇక్కడ మొదట తవ్వకాలు చేసింది డాక్టర్ ఎ.కె.ఘోష్. కాలీబంగన్ అంటే ‘నల్లని గాజులు’ అని అర్థం. భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు లభించిన ఏకైక నగరం కాలీబంగన్. బనావలి: హరప్పా నగరాలన్నింటిలోకి గ్రిడ్ పద్ధతిని పాటించని ఏకైక నగరమిదే. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. తవ్వకాలు చేసింది ఆర్.ఎస్. బిష్త్. సింధూ ప్రజలు నాగలిని ఉపయోగించారనడానికి ఇక్కడ లభించిన మట్టితో చేసిన నాగలి బొమ్మను ప్రధాన ఆధారంగా పేర్కొంటారు. కోట్‌డిజి: పాకిస్థాన్‌లోని సింధూ రాష్ట్రంలో ఉంది. తవ్వకాలు నిర్వహించింది గురే.ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి. ధోలవీర: గుజరాత్లో ఉంది. తవ్వకాలు చేసినవారు ఆర్.ఎస్.బిష్త్, జె.పి.జోషి. ఈ నగరం వర్షాభావ ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడ కృత్రిమ రిజర్వాయర్ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక స్టేడియం కూడా బయటపడింది. మిగిలిన సింధూ నగరాలకు భిన్నంగా ఈ నగరం రెండుకు బదులు 3 విభాగాలుగా విభజితమై ఉంది. సింధూ నాగరికత ముఖ్య లక్షణాలు పట్టణ ప్రణాళిక: సింధూ ప్రజలు ప్రధానంగా నగరవాసులు. ఈ నగరాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా వాటి నిర్మాణశైలి, నగర ప్రణాళిక మొదలైన అంశాల్లో ఏకరూపత కనిపించడం విశిష్ట లక్షణంగా చెప్పొచ్చు. ప్రతి నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఎగువభాగంలో ఉన్నత వర్గాలవారు నివసించేవారు. నగర నిర్మాణానికి గ్రిడ్ పద్ధతిని అనుసరించారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించారు. నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. ఎగువ పట్ట ణం చుట్టూ పటిష్టమైన కోటగోడను నిర్మించారు. వీధులన్నీ సూటిగా 90ని లంబ కోణంలో ఉండి నగరాన్నంతా అనేక చతురస్ర బ్లాకులుగా విభజించేవి. సామాజిక వ్యవస్థ: సింధూ సమాజం భిన్న జాతుల కలయికతో ఏర్పడింది. మెడిటరేనియన్ జాతికి చెందినవారు అధిక సంఖ్యాకులు కాగా, మంగోలాయిడ్, ఆస్ట్రలాయిడ్, అల్పిన్నాయిడ్ జాతులకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసించారు. వైదిక యుగంలో ఉన్నట్లుగా కుల, వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో ఇంకా ఏర్పడలేదు. అయినప్పటికీ ఆర్థికస్థాయిని బట్టి సమాజం వివిధ వర్గాలుగా విభజితమైంది. ఈ కాలంలో స్త్రీలు మంచి గౌరవ మర్యాదలు పొందినట్లుగా తెలుస్తోంది. నాటి సమాజం మాతృస్వామిక వ్యవస్థను అనుసరించినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పశుపోషణ, పరిశ్రమలు, వ్యా పార వాణిజ్యాలకు కూడా ప్రాధాన్యం ఉండేది. ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి కూడా పండించినట్లు లోథాల్, రంగపూర్‌లో ఆధారాలు లభించాయి. సింధూ పరీవాహక ప్రాంతం అత్యంత సారవంతంగా ఉండేది. పశుపోషణలో భాగంగా ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. పట్టణాల్లో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. ఖేత్రి, బెలూచిస్థాన్ నుంచి రాగిని, అఫ్గానిస్తాన్ నుంచి తగరాన్ని, ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల లోహాలను దిగుమతి చేసుకుని వాటితో ఆయుధాలు, ఆభరణాలు తయారు చేసేవారు. వస్త్ర పరిశ్రమ కూడా ప్రముఖంగానే ఉంది. వీరు నూలు, ఉన్ని వస్త్రాలు తయారు చేశారు. తవ్వకాల్లో చాలాచోట్ల రాట్నాలు బయటపడ్డాయి. ఇటుకలు, సీళ్లు, కుండలు, ఆటబొమ్మలు, పూసలు, గవ్వలతో ఆభరణాల తయారీ, నౌకల నిర్మాణం వంటివి ఇతర పరిశ్రమల్లో ముఖ్యమైనవి. వీరు దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించారు. మొహెంజొదారో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. తవ్వకాల్లో బయటపడిన ధాన్యాగారాలు, సీళ్లు, తూనికలు, కొలతలు, ఎడ్లబండ్ల బొమ్మలు, నౌకల బొమ్మలు మొదలైనవి వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలను అందిస్తున్నాయి. దేశీయ వ్యాపారానికి ఎడ్లబండ్లు, పడవలనూ, విదేశీ వ్యాపారానికి భారీ నౌకలనూ ఉపయోగించారు. వీరి విదేశీ వాణిజ్యం ప్రధానంగా మెసపటోమియాతో కొనసాగింది. అక్కడి శాసనాలు సింధూ ప్రాంతాన్ని ‘మెలూహ’అని పేర్కొన్నాయి. రాజకీయ వ్యవస్థ: సింధూ నాగరికత భౌగోళికంగా 1.3 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. అయినా అనేక అంశాల్లో ఏకరూపత, సమగ్రత కనిపిస్తుంది. ఉదాహరణ: గ్రిడ్ పద్ధతిలో పట్టణాల నిర్మాణం, భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ. ఇటుకల నిర్మాణంలో ప్రమాణాలు, 16 లేదా దాని గుణకాలను తూనికలు, కొలతలకు ప్రమాణంగా ఉపయోగించడం మొదలైన అంశాల్లో ఉన్న ఏకరూపత వల్ల కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరి ప్రకారం 4 లేదా 5 పాలనా కేంద్రాలతో ఈ నాగరికత వర్థిల్లింది. డి.డి. కౌశాంబి ఇది మతరాజ్యమనీ, మతాధిపతుల పాలన కొనసాగిందని అభిప్రాయపడ్డారు. ఆర్.ఎస్. శర్మ.. వ్యాపార, వాణిజ్యాలకు అమిత ప్రాధాన్యమిచ్చిన వ్యాపార వర్గాలే పాలకులుగా ఉం డేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధూ ప్రజల రాజకీయ వ్యవస్థపై నిర్దిష్ట ఆధారాలు లభించడం లేదు. కాబట్టి చరిత్రకారుల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మత వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి. మొహెంజొదారోలో ‘పశుపతి’ మహాదేవుడి ముద్ర లభించింది. ఈ దైవాన్నే జాన్ మార్షల్ తర్వాతి కాలపు పరమశివుడుగా పేర్కొన్నారు. సింధూ ప్రజలు జంతువులు, వృక్షాలను కూడా పూజించారు. మూపురము న్న ఎద్దు, రావిచెట్టు వీరికి పరమ పవిత్రమైనవి. మానవ జననేంద్రియాలనూ ఆరాధించారు. భూత ప్రేతాలు, మంత్రతంత్రాలపై వి శ్వాసం ఉంది. రక్షా రేకులు, తాయెత్తులను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. వీరి దహన సంస్కారాలు భిన్న రకాలు గా ఉండేవి. దహనం చేయడం, పూడ్చిపెట్టడం, కళేబరాలను పశుపక్ష్యాదులు తినగా మిగిలిన అవశేషాలను పూడ్చడం మొదలైన పద్ధతులుండేవి. సింధూ లిపి: భారతదేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు వీరే. ఇది నేటి లిపిలా అక్షర రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉన్నందువల్ల నేటి వరకూ దీన్ని చదవడం సాధ్యపడలేదు. వీరి లిపిలో 400 దాకా చిత్రాలున్నాయి. ఇది ఎడమ నుంచి కుడికి, మళ్లీ కుడి నుంచి ఎడమకి రాసి ఉంది. ఎస్.ఆర్ రావు ఈ చిత్రలిపిని ఆర్యభాషకు మాతృకగా పేర్కొన్నారు. కంప్యూటర్ సహాయంతో ఈ లిపిని పరిశోధించిన మహదేవన్ మాత్రం ఇది ద్రావిడ భాషతోనే పోలికలు కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. అధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇదే. సింధూ ప్రజల సీళ్లు (ముద్రలు): సింధూ ప్రజల కళాభిరుచికి నిదర్శనం వారి సీళ్లు. తవ్వకాల్లో దాదాపు 2000కు పైగా సీళ్లు లభించాయి. వీటిలో అత్యధికం మొహెంజొదారోలోనే లభించాయి. 1-2.5. సెం.మీ. ఎత్తుతో వివిధ ఆకారాల్లో వీటిని తయారుచేశారు. ప్రతి సీలు పై ఏదో ఒక జంతు బొమ్మతోపాటు చిత్రలిపిలో శాసనం కూడా ఉండేది. పులి, ఎద్దు, గేదె, మేక, జింక, ఖడ్గమృగం, ఏనుగు వంటి జంతువుల బొమ్మలు సీళ్లపై ముద్రించారు. పతనానికి కారణం: ఈ నాగరికత క్రీ.పూ. 18వ శతాబ్దం నాటికి అంతమైంది. అయితే దీని పతనానికి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఇది చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారి తీసింది. విపరీతమైన వరదలు ఈ నాగరికత అంతానికి కారణమని కొందరి వాదన. నదుల ప్రవాహ దిశల్లో మార్పు వల్ల ఏర్పడిన నీటిఎద్దడి కారణమని మరికొందరు అభిప్రాయం. పక్కనున్న ఎడారి విస్తరించి, భూసా రం తగ్గడం వల్ల పతనమైందని మరికొందరి వాదన. ఆర్యుల దాడి ఈ నాగరికత ముగియడానికి ప్రధాన కారణమని ఎం.ఎం. వీలర్ అభిప్రాయం. భూకంపాల వల్ల ఈ నాగరితక అంతమైందని రైస్ వాదన. మాదిరి ప్రశ్నలు 1. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన హరప్పా నగరం? (గ్రూప్-2, 2012) 1) మొహెంజొదారో 2) లోథాల్ 3) చన్హుదారో 4) బన్వాలి 2. హరప్పా ప్రజలు పూజించిన పక్షి?(గ్రూప్-2, 2011) 1) పావురం 2) నెమలి 3) కాకి 4) గద్ద 3. హరప్పా ప్రజలు ఏ దేశంతో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉన్నారు? (గ్రూప్-1, 2010) 1) ఇరాన్ 2) ఈజిప్ట్ 3) బహ్రెయిన్ 4) మెసపటోమియా 4. కింద పేర్కొన్న 1, 2 జాబితాల నుంచి సరైనదాన్ని గుర్తించండి. జాబితా-1 జాబితా-2 ఎ) కాలీబంగన్ 1) కుండలు బి) లోథాల్ 2)టైట్ట బొమ్మలు సి) చన్హుదారో 3) పశుపతి ముద్రిక డి) మొహెంజొదారో 4) ఇటుకతో నిర్మించిన ప్రాంగణం ఎ బి సి డి 1) 1 3 4 2 2) 4 1 2 3 3) 3 2 4 1 4) 2 4 1 3 5. సింధూ లిపికి చిహ్నంగా ఇంకు పాత్ర లభించిన నగరం? 1)చన్హుదారో 2) అమ్రి 3) లోథాల్ 4) హరప్పా 6. గుర్రం ఆధారాలు లభించిన ప్రాంతం? 1) హరప్పా, లోథాల్ 2) లోథాల్, రంగపూర్ 3) సుర్కాటడా, బన్వాలి 4) సుర్కాటడా, లోథాల్ 7. సతీసహగమనం ఆచారాన్ని సూచించే సమాధి బయటపడిన సింధూ నగరం? 1) కాలీబంగన్ 2) హరప్పా 3) లోథాల్ 4) కోట్‌డిజి 8. సింధాన్ అంటే? 1) వరి 2) గోధుమ 3) బార్లీ 4) పత్తి 9. కిందివాటిలో సరికాని జత? సింధూ నగరాలు - ప్రస్తుత రాష్ట్రాలు 1) మొహెంజొదారో సింధూ రాష్ట్రం 2) రోపార్ పంజాబ్ 3) మాండ జమ్మూకాశ్మీర్ 4) దాయిమాబాద్ గుజరాత్ 10. హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్న ప్రాంతం? (గ్రూప్-1, 2010) 1) కాలీబంగన్, రోపార్ 2) లోథాల్, రంగపూర్ 3) చన్హుదారో, ఖేత్రి 4) మొహెంజొదారో, హరప్పా సమాధానాలు 1) 4 2) 1 3) 4 4) 2 5) 1 6) 4 7) 3 8) 4 9) 4 10) 1