జేసీ హరిజవహర్‌లాల్ బదిలీ
నల్లగొండ : జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రీతిమీనా రానున్నారు. హరిజవహర్‌లాల్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన గురువారం తన విధుల నుంచి రిలీవ్ అవుతుండగా, కొత్త జాయింట్ కలెక్టర్‌గా ప్రీతిమీనా రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. బదిలీపై వెళుతున్న
నల్లగొండ అర్బన్
జిల్లాలో 340కిపైగా స్కూల్ కాంప్లెక్స్‌లున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పనితీరు, పాఠశాలల మానిటరింగ్, గుణాత్మక విద్య అందించడం, విద్యార్థుల నమోదు పెంచడం, తదితర కార్యక్రమాల నిర్వహణకు కాంప్లెక్స్‌కు ఒక సీఆర్పీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో సీఆర్పీ సగటున 10 పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తున్నాడు. జిల్లా ప్రస్తుతం 313 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు.
నియామకాలు ఇలా....
2012నవంబర్ 6వ తేదీన క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను నియమించారు. బీఈడీ, టెట్ పాసైన వారే అర్హులనడంతో కేవలం 53 మంది అర్హులకు అవకాశం లభించింది. గతంలో అనియ త విద్యాబోధకులు, సూపర్వైజర్లుగా పనిచేసిన వారికి అవకాశం కల్పిం చాలని చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్ మేరకు వారికి కూడా అవకాశం ఇచ్చారు. మిగతా వారిని మెరిట్ ప్రాతిపదికన నేరుగా నియమించారు. టెట్‌లో ఉత్తీర్ణత, డిగ్రీ, బీఈడీలో మెరిట్‌ను రోస్టర్ రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత స్కూల్‌కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలున్న గ్రామానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించారు. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను పిలిచి తుది జాబితా ద్వారా నియామకం చేశారు. వివిధ కారణాలతో జిల్లాలో దాదాపు 30 ఖాళీలు ఏర్పడ్డాయి. సగటున 10 నుంచి 13 స్కూల్ కాంప్లెక్స్‌లను పర్యవేక్షించాల్సి ఉండగా, కొన్ని మండలాల్లో సీఆర్పీల ఖాళీల వల్ల ఉన్నవారే 20కిపైగా కాంప్లెక్స్‌లకు వెళ్లాల్సి వస్తున్నది.
ఎంఆర్పీలకు ప్రత్యామ్నాయంగా...
గతంలో మండల రిసోర్స్ పర్సన్లు (ఎంఆర్పీ) నిర్వహించిన బాధ్యతలనే ప్రస్తుతం సీఆర్పీలు కూడా నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యనందించే కార్యక్రమాల నిర్వహణ, పాఠశాలల బలోపేతానికి ప్రయత్నించడం, ఎప్పటికప్పుడు పాఠశాలల నివేదికలను మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లకు చేరవేయడానికి అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. ఎంఈఓలు ఆదేశించిన ప్రకారంగా కొన్నిచోట్ల పాఠశాలలకు వెళ్లి బోధన కూడాచేస్తున్నారు. విద్యావలంటీర్లు/అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం లేకపోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లిన చోట సీఆర్పీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని దాదాపు 30 స్కూల్ కాంప్లెక్స్‌లకు సీఆర్పీల అవసరముంది. నియామకాలకు అవకాశం కల్పించాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరారు.
అవకాశం లేదు
సీఆర్పీలుగా కొత్తవారిని నియమించేందుకు అవకాశం లేదని సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఈ నెల 24వ తేదీన జీఓనం:464 ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త వారికి అవకాశం లేకపోగా ఉన్న సీఆర్పీలను కుదించాలని అందులో పేర్కొన్నారు. సగటున ఒక్కో సీఆర్పీకి 18 స్కూల్ కాంప్లెక్స్‌ల బాధ్యతలు ఇస్తూ 218 మందికి కుదించాలని యోచిస్తున్నట్లు సమాచారం.