hari shankar
-
సమంత గ్లిజరిన్ కూడా వాడదు..'వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు: 'యశోద' దర్శకులు
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తమిళంలో 'ఒరు ఇరవు', 'అంబులి', 'ఆ', 'జంబులింగం' సినిమాలు చేశాం. మా తొలి సినిమా 'ఒరు ఇరవు'లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. కానీ ‘యశోద’సినిమాని భారీ స్కేల్లో చేశాం. కంటెంట్ పరంగా ఛాలెంజెస్ ఈ సినిమాకూ ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. కంటెంట్ ఎలా చెబుతున్నామనేది ముఖ్యం. ఇటువంటి కథకు అంత బడ్జెట్ అవసరం కూడా! సమంత, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బడ్జెట్ పెరుగుతుంది. ►మొదట ‘యశోద’సినిమాని తక్కువ బడ్జెట్లో తీసేలా స్క్రిప్ట్ రాసుకున్నాం. కథని శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పినప్పుడు 'భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు?' అని అడిగారు. 'కంటెంట్ బాగుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం' అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్లో చేయాలనుకున్నాం. మేం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని కథ రాశాం. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాలా ఉంటుంది. ► ఈ సినిమాలో సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు. ► సమంతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో... అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్ప్రైజ్లు షాక్ ఇస్తాయి. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు. ► సమంత హెల్త్ కండిషన్ గురించి షూటింగ్ సమయంలో మాకు తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు మాకు ఆ విషయం తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు. ► యశోద.. మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్ప్రైజింగ్గా ఉంది. లాక్డౌన్లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు. ► ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు'ఈవా' అని పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. మాకు షూటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో 'జురాసిక్ పార్క్'లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం. మెజారిటీ షూటింగ్ నానక్‌రామ్ గూడాలో వేసిన సెట్స్‌లోనే చేశాం. సినిమాలో మొత్తం 30, 40 సెట్స్ ఉంటాయి. ► నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్... ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మార్తాండ్ కె వెంకటేష్ గారు క్రిస్పీగా ఎడిట్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారు (బుల్లి గారు) మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప గారు కూడా మంచి నటీనటులను ఎంపిక చేశారు. ► ఈ సినిమాకు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి గార్లు తెలుగులో మాటలు రాశారు. తెలుగులో మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. మా మధ్య పాజిటివ్ కన్వర్జేషన్స్ జరిగాయి. ఇద్దరూ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళకు చాలా కమాండ్ ఉంది. బాగా చేశారు. మాకు కొంచెం తెలుగు వచ్చు. భాగ్యలక్ష్మి గారికి తెలుగు, తమిళం వచ్చు. పులగం గారు రాసింది ఆవిడ మాకు తమిళంలో వివరించేవారు. మా వర్క్ ఈజీ అయ్యింది. మహిళల కోణంలో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారు. ► ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కథను ఆవిడకు జూమ్ కాల్లో నేరేట్ చేశాం. 20 మినిట్స్ చెప్పాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక 'మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి?' అని అడిగారు. 'మీకు కథ ఓకేనా?' అని అడిగితే చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఆవిడను కొత్తగా చూస్తారు. ► ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ 'యశోద' అని చెప్పవచ్చు. సినిమా మొత్తం చూశాక మాకు అదే అనిపించింది. ఈ విషయంలో రాజమౌళి గారు మాకు ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెబుతారు. -
సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్
సమంత తొలి పాన్ ఇండియా మూవీ యశోద షూటింగ్ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హరి-హరీశ్‌లో ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దర్శకులు ఇటీవల ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు చిత్ర విశేషాలతో పాటు సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: స్కూల్లో ఓ అబ్బాయికి లవ్ లేటర్ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి రోటిన్‌గా కాకుండా ప్రేక్షకులకు వినోదపరిచేందుకు విభిన్న కథ రావాలనుకున్నాం. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నాం. యశోద మూవీకి విభిన్న కథానాలను అర్థం చేసుకునే హీరోయిన్ కావాలనుకున్నాం. అందుకేఈ సినిమా కోసం సమంతను సంప్రదించాం. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు’ అని చెప్పారు. కాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు ముందే సమంతకు ఈ కథ వివరించామన్నారు. ఇక కథ వింటుంటే తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని, తప్పకుండా తాను ఈ సినిమా చేస్తానని సమంత మాట ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్ విజ్ఞప్తి అంతేకాకుండా యాక్షన్ సీన్స్ తెరకెక్కించేందుకు ఎలాంటి సహాయం తీసుకోవడానికి కూడా సమంత ఇష్టపడేలేదన్నారు. ‘సినిమాలోనే మెయిన్ యాక్షన్ సీన్స్‌ను సెట్లోనే చిత్రీకరించాం. అయితే కొన్ని ఫైట్ సీన్స్ రిహార్సల్స్ కోసం సమంత 2, 3 రోజులు సెట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఫైట్ సన్నివేశాలను తానే స్వయంగా చేయాలనుకుంది. ఎవరి సహాయం లేకుండానే సమంత యాక్షన్ సీన్స్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్, వెంకట్ మాస్టర్లు ఈ మూవీకి పని చేసిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్‌లోకి కడప క్రికెటర్ ఎంట్రీ.. చెన్నై ట్వీట్
సాక్షి, రాయచోటి(కడప): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్ సీజన్లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది. ఇక బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్ వచ్చాడని సీఎస్కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ హరిశంకర్ ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. కాగా హరిశంకర్‌కు ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాయచోటి ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆయన ఆకాక్షించారు. చదవండి: కాసుల వర్షం .. 20 లక్షలు టూ కోట్లు ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ 2021 వేలం: ముంబైకి అర్జున్ టెండూల్కర్ LION ALERT! 🦁 From the land of #Bahubali we rope in Harishankar Reddy! #WhistlePodu #Yellove #SuperAuction 💛🦁 — Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021 -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
మందస మండలంలో దీక్షకు దిగిన గిరిజన యువతి నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మందస : నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై ఓ గిరిజన యువతి న్యాయ పోరాటానికి దిగింది. ప్రేమ పేరుతో దారుణంగా మోసగించిన ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పాలని అతడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... మందస మండలంలోని పట్టులోగాం గ్రామానికి చెందిన సవర హరిశంకర్ కవిటి మండలం బొ రివంక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే మండలం కుల్లోగాం కాలనీకి చెందిన సవర భూలక్ష్మి పలాసలో చదువుతోంది. తొమ్మిది నెలల కిందట వీరిద్దిరికీ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గర కావడంతో భూలక్ష్మి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని హరిశంకర్‌కు చెప్పి తనను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో విషయం యువతి అన్నయ్య శంకర్, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు కూడా పట్టులోగాం వెళ్లి ప్రియుడి కుటుంబ సభ్యులను కలిశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మార్చి 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరిశంకర్‌ను ఎస్ఐ వి.రవివర్మ హరిశంకర్‌ను పిలిపించి నిలదీయగా... పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని అంగీకార పత్రం రాసి ఇచ్చారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో బాధితులు పలాస డీఎ స్పీని ఆశ్రయించారు. అయినా హరిశంకర్ గడువులు కోరుతూ విషయం దాటవేయడంతో బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భూలక్ష్మికి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ ఏడాది మార్చి 27న హరిశంకర్ ఎవరికీ తెలీకుండా కళావతి అనే యువతిని కంచిలి లోని జగన్నాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నా రు. ఆ తర్వాత ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఈ విషయం భూలక్ష్మి కి ఆలస్యంగా తెలియడంతో శుక్రవారం ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు... న్యాయ పోరాటానికి దిగిన సవర భూలక్ష్మికి సీపీఐఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం, నవోదయ మహిళా సంఘంతో పలు మహిళా సంఘాలు మద్దతు నిచ్చాయి. బాధితురాలికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. న్యాయం కోసం ప్రియుడి వద్దకు రాగా బాధితురాలితో పాటు ఆమెతో వచ్చిన మహిళా సంఘాల సభ్యులపై హరిశంకర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిని పలు సంఘాల ప్రతినిధులు ఖండించారు. కేసు నమోదు... హరిశంకర్ ఆచూకీపై మందస ఎస్ఐ రవివర్మ అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలికి న్యా యం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.