Harijavaharlal
-
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
ఈ ఆఫీసు బహుదూరం
► సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పదిశాఖలు ► ప్రతివారం ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నా పురోగతి నామమాత్రం ఒంగోలు టౌన్ : ఈ-ఆఫీసుకు కొన్నిశాఖలు దూరంగా ఉంటున్నారుు. మొక్కుబడిగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఈ-ఆఫీసు ద్వారానే చేపట్టాలని కలెక్టర్ సుజాతశర్మ, జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆ శాఖాధికారుల్లో పూర్తిస్థారుులో స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ-ఆఫీసుపై జారుుంట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన స్థారుులో ఫలితాలు రావడం లేదు. దీనిలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మొక్కుబడిగా వ్యవహరిస్తున్న ఆ పది శాఖలతోపాటు ఇతర శాఖలు కూడా లైట్‌గా తీసుకుంటే ప్రకాశం జిల్లా దిగువ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఐదు నెలలైనా అంతే సంగతులు... జిల్లాలో ఈ ఏడాది జూలై నుంచి ఈ-ఆఫీసును అమలు చేస్తున్నారు. అంతకు ముందుగానే కలెక్టరేట్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి కార్యకలాపాలు సాగించారు. ఆ తరువాత మొదటి విడతలో 10శాఖలను చేర్చారు. అనంతరం రెండో విడతలో మరో 72 శాఖలను ఈ-ఆఫీసులో చేర్చారు. రోజుకు 100 నుంచి 135 వరకు ఈ-ఆఫీసు ద్వారా ఫైల్స్ నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 82 శాఖల్లో ఈ-ఆఫీసు అమలవుతోంది. ఇప్పటివరకు ఈ-ఆఫీసు ద్వారా 10,250 ఫైల్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు సాగారుు. పూర్తిస్థారుులో అన్ని శాఖలు ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు సాగిస్తే ప్రకాశం జిల్లా రాష్ట్రస్థారుులో మొదటి మూడు స్థానాల్లో నిలిచేది. అరుుతే, కొన్ని శాఖల పనితీరు చూస్తుంటే జిల్లా ర్యాంకు కిందకు దిగజారే ప్రమాదం పొంచి ఉంది. కారణాలు అనేకం... ఈ-ఆఫీసుకు సంబంధించి కొన్ని శాఖలు వెనుకబడటానికి కారణాలు అనేకం ఉన్నారుు. ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థారుులో మ్యాన్ పవర్(సిబ్బంది) లేకపోవడం ఒక కారణమైతే, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు స్కాన్‌చేసి పంపడం ఇంకో కారణం. కొన్ని సందర్భాల్లో దాదాపు 100 నుంచి 200 పేజీల వరకు స్కానింగ్ చేసి ఈ-ఆఫీసుకు పంపించడం కష్టతరమవుతోంది. అదేవిధంగా స్కానర్ల సమస్య కూడా కొన్ని శాఖలను పట్టిపీడిస్తోంది. ఈ-ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన స్కానర్లు మాత్రం పూర్తిస్థారుులో అందించలేదు. సంబంధిత శాఖలే స్కానర్లు కొనుగోలు చేసుకుని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లడంతో వాటిని ఏ విధంగా కొనుగోలు చేయాలో తెలియక కొంతమంది రోజుల తరబడి ఈ-ఆఫీసు వారుుదా వేసుకుంటూ వచ్చారు. అన్ని శాఖలు తమకు సంబంధించిన బడ్జెట్లో స్కానింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు వెళ్లినప్పటికీ నామమాత్రపు బడ్జెట్లకు పరిమితమైన శాఖాధికారులు వాటిని కొనుగోలు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో ఈ-ఆఫీసు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. టాప్ టెన్‌లో కొన్ని శాఖలు... జిల్లాలో ఈ-ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ, జిల్లాపరిషత్, డ్వామా, పౌరసరఫరాలశాఖ, డీఆర్డీఏ, వ్యవసాయశాఖ, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, ట్రెజరీ, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీ టాప్‌టెన్‌లో ఉన్నారుు. వీటితోపాటు కనిగిరి, కందుకూరు, అద్దంకి మున్సిపాలిటీల్లో కూడా ఈ-ఆఫీసుకు సంబంధించిన కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటా రుు. దాంతో ఈ-ఆఫీసులో అవి ముందంజలో ఉన్నారుు. అరుుతే ఆ శాఖలు మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు వేగవంతం చేస్తే కొంతమేర ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నారుు. సింగిల్ డిజిట్స్ శాఖలు... జిల్లాలో పది శాఖలు ఈ-ఆఫీసుకు సంబంధించి సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఆ శాఖల పనితీరు కారణంగా రాష్ట్రస్థారుులో జిల్లా స్థానంపై ప్రభావం కనిపిస్తోంది. మెప్మా, కార్మికశాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, ఎస్ఈ కన్స్టక్ష్రన్స, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కార్యాలయం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం, ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలను ఈ-ఆఫీసు ద్వారా తక్కువగా పంపిస్తుండటంతో డబుల్ డిజిట్స్‌కు కూడా చేరుకోలేకపోతున్నారుు. -
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్,విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శించొద్దని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శారదదేవి, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శనివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పలు అంశాలపై వారు సూచనలిచ్చారు. సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నికల అధికారి రామానుజుల రెడ్డి వారికి వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా సజావుగా నిర్వహిం చేందుకు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టరేట్లో అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వారి వెంట సూర్యాపేట ఆర్డీవో నాగన్న ఉన్నారు. ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలింపు ఎన్నికల విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది శనివారం మధ్యాహ్నం తమకు కేటాయించిన వార్డులకు ఈవీఎంలను తీసుకవెళ్లారు. మొత్తం 30 వార్డులను ఆరు జోన్లుగా విభజించిన అధికారులు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులలో ఆయా పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు. -
అక్టోబర్ చివరి వరకు అందరికీ ‘ఆధార్’
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :అక్టోబర్ నెలాఖరు నాటికీ అందరికీ ఆధార్‌కార్డుల నమోదును పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం లక్కారం శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇంకా 6లక్షల మందికి ఆధార్‌ను నమోదు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 155 కేంద్రాలు ఆధార్ నమోదు కోసం ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లక్ష మందికి ఆధార్ నమోదు పూర్తయ్యిందని, మిగతా 5లక్షల మందికి అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి 6వేల ఎకరాలను గుర్తించామన్నారు. 2వేల ఎకరాల్లో సర్వే పూర్తయ్యిందని, ఈ నెలాఖరు నాటికి పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు. చౌటుప్పల్, చిట్యాల మండల కేంద్రాల్లో హైవే విస్తరణ పూర్తి కాలేదన్నారు. చౌటుప్పల్‌లో ఈద్గాకు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో 35 నిర్మాణాలకు నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నామన్నారు. చిట్యాలలో నిర్వాసితులు కోర్టులో 5రిట్ పిటిషన్లు దాఖలు చేయగా, కౌంటరు పిటిషన్లు వేశామన్నారు. జిల్లాలో కాల్వల కింద భూసేకరణకు సంబంధించి మరో 15రోజుల్లో రూ.4కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీఓ భాస్కర్‌రావు, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డీఐ వెంకట్‌రెడ్డి, వీఆర్వోలు గాలయ్య, సైదాసాహెబ్ తదితరులున్నారు. ధర్మారం కాలువను సందర్శించిన జేసీ ఆత్మకూరు(ఎం) : తిమ్మాపురం, నాంచారిపేట గ్రామాల వద్ద ధర్మారం కాలువను జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కాలువ మ్యాప్‌ను పరిశీలించారు. మండల పరిధిలో 11 గ్రామాలు కాలువ కింద ఉన్నట్లు తెలిపారు. 78మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు పరిహారం ఎక్కువ మొత్తంలో కావాలని డిమాండ్ చేయడంతో తాము పరిహారం ఇచ్చేది ఇస్తాం.. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే అటువంటి రైతులు కోర్టును ఆశ్రయించవచ్చునని అన్నారు. జేసీ వెంట భువనగిరి ఆర్డీఓ ఎ.భాస్కర్‌రావు, తహసీల్దార్ డి. కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు బీసు చందర్‌గౌడ్, నోముల నర్సిరెడ్డి, పైళ్ల తులశమ్మ, ఆర్ఐ చిప్పలపెల్లి యాదగిరి, నాయకులు పైళ్ల సత్యనారాయణరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి ఉన్నారు.