కోదాడఅర్బన్, న్యూస్‌లైన్,విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శించొద్దని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శారదదేవి, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శనివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పలు అంశాలపై వారు సూచనలిచ్చారు. సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నికల అధికారి రామానుజుల రెడ్డి వారికి వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా సజావుగా నిర్వహిం చేందుకు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వారి వెంట సూర్యాపేట ఆర్డీవో నాగన్న ఉన్నారు.
ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలింపు
ఎన్నికల విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది శనివారం మధ్యాహ్నం తమకు కేటాయించిన వార్డులకు ఈవీఎంలను తీసుకవెళ్లారు. మొత్తం 30 వార్డులను ఆరు జోన్లుగా విభజించిన అధికారులు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులలో ఆయా పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
Published Sun, Mar 30 2014 1:02 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement